
Rajagopal Reddy and DK Shivakumar: రాష్ట్ర రాజకీయాల్లో కాంట్రవర్ కి కేర్ ఆఫ్ అయిన ఆ నేత రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉండబోతున్నాయి. కాంగ్రెస్ దిగ్గజం డికే శివకుమార్ నడిపిన రాయ బేరాలు ఎంతవరకు ఫలించనున్నాయి? కోమటి రెడ్డి ఇంతలా తొడలు కొట్టినా పార్టీ వైపు నుంచి రియాక్షన్ లేకపోవడంలో ఆంతర్యం ఏంటి. ఇదే మంచి తరుణం అంటూ ఆయన్ని తమ వైపు లాక్కునే ప్రయత్నం చేస్తున్న ఇతర పార్టీల అగ్రనాయకులు ఎవరు. లెట్స్ వాచ్ థిస్ స్టోరీ.
అధికారంలోకి రావాలనే తాపత్రయంతో ప్రజలకు అడ్డగోలు హామీలు ఇచ్చారు. రుణమాఫి అందరికీ కాలేదు. రైతు భరోసాతో ఎవరు సంతృప్తిగా లేనేలేరు. పెన్షన్ల పెంపు ఊసేలేదు. ఇదేదో విపక్ష నేతలు చేస్తున్న విమర్శలు కావు. సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యే చెప్పిన మాటలివి. ఆయనే ముక్కుసూటి తనానికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉండే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అధికారంలోకి వచ్చేందుకు హామీలెన్నో ఇచ్చామన్న ఆయన, ఇప్పుడు ప్రజలు నిలదీస్తుంటే ఏం సమాధానం చెప్పాలని పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. తాను చేస్తున్న ఆరోపణలు ప్రత్యర్ధులకు అస్త్రాలు అవుతాయని తెల్సినా ఆయన వెనక్కి తగ్గడం లేదు. అవసరమైతే ప్రజల కోసం రాజీనామా అయినా చేస్తానంటూ చెబుతున్నారు.
కోమట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన సంచలన కామెంట్స్ స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. మునుగోడు ఎమ్మెల్యే కాంట్రవర్సీ కామెంట్స్ కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేసాయి. పదేళ్ళు తానే సీఎంగా ఉంటానంటూ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ మీద కూడా రాజగోపాల్ రెడ్డి రగిలిపోయారు. రేవంత్ సీమాంధ్ర కాంట్రాక్టర్లను చేరదీస్తున్నారనే రాజగోపాల్ రెడ్డి ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సీన్ చూస్తుంటే సీఎంతో రాజగోపాల్ రెడ్డి తాడో పేడోకు సిద్ధమవుతున్నట్టే కనిపిస్తోంది. ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన రాజగోపాల్ రెడ్డి విషయంలో ఎలాంటి చర్యలకు సాహసించలేదు కాంగ్రెస్ అధిష్టానం. ఈ పరిస్థితులు క్రమ శిక్షణాచర్యలకు పోయి భారీ మూల్యం చెల్లించుకునే దానికంటే బుజ్జగింపులతో పరువు నిలుపుకునే పనిలో పడిందట. అందుకే కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ని రంగంలోకి దింపిందట. వాస్తవానికి రేవంత్ రెడ్డిపై చాలా రోజులుగా అసంతృప్తితో ఉన్నారు రాజగోపాల్ రెడ్డి. తనకు మంత్రి పదవి ఆఫర్ చేస్తేనే కాంగ్రెస్ పార్టీలోకి కం బ్యాక్ అయ్యానని చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చారు. మాట ఇచ్చి తప్పితే ఎలా అంటూ ప్రశ్నించిన ఆయన, మంత్రి పదవి కోసం కాళ్ళు పట్టుకోవాలా అంటూ మండిపడుతున్నారు.
బీసీ ఉద్యమం ద్వారా ప్రజల్లో క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తున్న రేవంత్ సర్కార్ సొంత పార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యలతో సంకటంలో పడింది. రాజగోపాల్ రెడ్డి తిరుగుబాటు ప్రభుత్వాన్ని కుదిపేయకుండా దిద్దుబాటు చర్యలకు సిద్ధమైంది రేవంత్ టీమ్. ఇప్పటికే రేవంత్ వ్యతిరేక వర్గాన్ని తనవైపు తిప్పుకునే పనిలో ఉన్నారట రాజగోపాల్ రెడ్డి. ఓవైపు పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. అనర్హత వేటు ఖాయమనే ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో రాజగోపాల్ రెడ్డి చక్రం తిప్పి 10 మంది అసమ్మతి ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోగలిగితే ప్రభుత్వం ఇరకాటంలో పడక తప్పని పరిస్థితి. ఇదే అదునుగా ప్రత్యర్ది పార్టీలు రాజగోపాల్ రెడ్డిని ఉసిగొల్పితే ప్రభుత్వం మనుగడే ప్రమాదంలో పడ్డ ఆశ్చర్యపోన అవసరం లేదు. అందుకే ఈ పరిణామాలన్నీ అంచనా వేస్తూనే అధిష్టానం ఇప్పుడు ఆత్మ పరిశీలన చేసుకుంటున్నట్టు సమాచారం. Rajagopal Reddy and DK Shivakumar.
రాష్ట్రస్థాయి నాయకులు ఎవరు చెప్పినా వినేలా లేరు రాజగోపాల్ రెడ్డి. అందుకే ట్రబుల్ షూటర్ డికే శివకుమార్ ని రాయిబారిగా పంపినట్టుంది. ఇక చర్చల్లో ఏం జరిగిందో ఏమో కానీ అలా డికే శివకుమార్ ని కలిసారో లేదో రేవంత్ పై మరోసారి తిట్ల దండకం అందుకున్నారు రాజగోపాల్ రెడ్డి. ఒకవైపు మాటల తూటాలతో మంత్రి పదవి కోసం పార్టీ మీద ఒత్తిడి, మరోవైపు డికే లాంటి దిగ్గజాలతో పదవి కోసం రాయబారాలు నడుపుతున్నారు. ఇదే సమయంలో అవసరమైతే పార్టీ మారడానికి కూడా సిద్ధమన్నట్లు ముందుకు వెళ్తున్నారట. ఈ తీరుతో రాజగోపాల్ ఎప్పుడు ఎక్కడ ఎలాంటి బాంబు పేలుస్తారు అని అధిష్టానం పెద్దల గుండె గుబేల్ మంటోందట. మొత్తానికి కోమటరెడ్డి రాజగోపాల్ వ్యవహారం పార్టీకి ప్రభుత్వానికి కంటి మీద కురుకు లేకుండా చేస్తోంది. ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది.