గీతాంజలి 2 ప్లానింగ్ జరుగుతుందా..?

Mani Ratnam Geethanjali 2: భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో మణిరత్నం ఒకరు. ఆయన ఎలాంటి క్లాసిక్స్ అందించారో తెలిసిందే. అయితే.. మణిరత్నం తెరకెక్కించిన క్లాసిక్స్ లో ఒకటి గీతాంజలి. ఇప్పుడు గీతాంజలి 2 ప్లానింగ్ జరుగుతుందని టాక్ వినిపిస్తుంది. నిజంగానే గీతాంజలి 2 ప్లాన్ చేస్తున్నారా..? ఎవరితో ప్లాన్ చేస్తున్నారు..? మణిరత్నం ఆమధ్య నవీన్ పొలిశెట్టితో సినిమా చేయాలి అనుకున్నారు కదా..? ఇంతకీ ఏమైంది..?

మణిరత్నం తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా థగ్ లైఫ్ మూవీ నిలిచింది. నాయకుడు సినిమా తర్వాత కమల్, మణిరత్నం కలిసి చేసిన సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే.. ఈ సినిమా అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత మణిరత్నం నవీన్ పొలిశెట్టి న్యూఏజ్ లవ్ స్టోరీ చేయబోతున్నట్టుగా ప్రచారం జరిగింది. త్వరలోనే ఈ సినిమాని అనౌన్స్ చేస్తారనుకుంటే.. ఈ ప్రాజెక్ట్ లేదని తెలిసింది. ఇప్పుడు మణిరత్నం కథ పై కసరత్తు చేస్తున్నారనే వార్త బాగా వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. కోలీవుడ్ లో ఓ మాట వినిపిస్తుంది. అది ఏంటంటే.. గీతాంజలి 2 చేయాలని మణిరత్నం అనుకుంటున్నారట. గీతాంజలి సినిమాను నాగార్జునతో చేశారు. ఆ సినిమా తెలుగులో క్లాసిక్ గా నిలిచింది. ఆతర్వాత తెలుగులో మరో సినిమా చేయమని మణిరత్నంను ఎంతో మంది అడిగారు కానీ.. ఇంత వరకు చేయలేదు. ఇప్పుడు తెలుగులోనే సినిమా చేయాలని మణిసార్ ఫిక్స్ అయ్యారనేది చెన్నై న్యూస్. మరి.. ఈసారి ఎవరితో సినిమా చేయబోతున్నారు అంటే.. నాగచైతన్య పేరు వినిపిస్తుంది. నాగచైతన్య ప్రస్తుతం కార్తీక్ దండుతో సినిమా చేస్తున్నాడు. ఇది సమ్మర్ లో విడుదల కానుంది. Mani Ratnam Geethanjali 2.

ఈ సినిమా తర్వాత చైతన్యతో సినిమా చేసేందుకు కొంత మంది దర్శకులు వెయిటింగ్ లో ఉన్నారు. బోయపాటి శ్రీనుతో చైతూ మూవీ అంటూ ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. అలాగే శివ నిర్వాణ ఖుషి సినిమా తర్వాత నుంచి చైతన్య కోసం వెయిటింగ్ లో ఉన్నాడు. ఇటీవల వంశీ పైడిపల్లి కూడా కథ చెప్పాడని న్యూస్ లీకైంది. కొరటాల పేరు వినిపిస్తుంది. ఇప్పుడు మణిరత్నం పేరు వినిపిస్తుంది. వీళ్లే కాకుండా మరి కొంత మంది దర్శకులు, రైటర్స్ చైతూ కోసం కథలు రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నారు. మరి.. వీళ్లల్లో చైతూ నెక్ట్స్ ఎవరితో ఉంటుందో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/ntr-gave-a-shock-to-koratala-what-is-koratalas-next-and-will-there-is-a-devara-part-2/