
AP Terrorist Noor Ahmed: ఆంధ్రప్రదేశ్ ఉగ్రవాదులకు అడ్డగా మారుతుందా.. ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ పై ఉగ్రవాద కదలికలు టెన్షన్ పుట్టిస్తున్నాయి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు ఉగ్రవాద మూలాలు గతంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు చెప్పేవారు.. ప్రస్తుతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయింది. కానీ విభజిత ఆంధ్ర పదేశ్ లో ఉగ్రవాద కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి పాకిస్తాన్ కు చెందిన ఉగ్ర సంస్థల ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎంతవరకు సేఫ్ గా ఉంది అన్న అనుమానాలు మొదలవుతున్నాయి.
మొన్న అన్నమయ్య జిల్లా, నిన్న సత్యసాయి జిల్లా, అంతకు మునుపు విజయనగరం. ఇలా వరుసగా ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాలలో ఉగ్రవాద సంస్థలకు చెందిన కొందరు వ్యక్తులు రహస్యంగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ధర్మవరం పట్టణంలో నూర్ మహమ్మద్ స్థానికుడు. చిన్నప్పటి నుంచి ఉర్దూ మీడియం స్కూల్లో చదివిన నూరు మహమ్మద్ పదో తరగతి వరకు చదువుకున్నాడు. అనంతరం ఒక టీ షాప్ నిర్వహిస్తూ అది సరిగా సాగకపోవడంతో సొంత వ్యాపారాన్ని వద్దనుకొని వేరొక హోటల్లో వంట మనిషిగా పనికి చేరాడు. ఎవరికి అనుమానం రాకుండా అందరిలో ఒక సామాన్య వ్యక్తుల తిరుగుతూ ఉండే నూర్ మహమ్మద్ ఏకంగా పాకిస్తాన్ కు చెందిన ఉగ్ర సంస్థల తో లింక్ ఏర్పాటు చేసుకొని ముస్లిం యువతను ఉగ్రవాదం వైపు వెళ్లేలా ప్రేరేపించడం తీవ్ర కలకలాన్ని సృష్టించింది.
నూర్ మొహమ్మద్ కుటుంబ నేపథ్యం చూసుకుంటే నూర్తల్లి తండ్రులు బీడీలు చుట్టుకుంటూ వ్యాపారం చేసేవారు. తండ్రి మరణం తర్వాత నూరు తల్లి.. నూర్ మొహమ్మద్ అలాగే అక్క చెల్లెలు ధర్మవరం పట్టణంలో జీవనం కొనసాగిస్తూన్నారు. నూర్ మహమ్మద్ కు సుమియా అనే మహిళతో వివాహం జరిగింది.. విరు గత ఆరునెల క్రితం ఇద్దరు కూడా కుటుంబ కలహాలతో విడిపోయారు. తమ కుటుంబ సభ్యులు మాత్రం నూర్ మహమ్మద్ కు ఎలాంటి విషయాలు తెలియని మూడు రోజుల నుంచి నూరు మొహమ్మద్ ఇంటికి కూడా రాలేదని తను పనిచస్తున్న షాపు వద్దకు అడిగితే ఎక్కడికి వెళ్తాలే వస్తాడు అమ్మ అని చెప్పి పంపించారన వెల్లడించారు… శనివారం తెల్లవారుజామున కొంతమంది పోలీసులు తమన్న ఇంటికి తీసుకువచ్చి ఇంటిని మొత్తం శోదాల నిర్వహించారని ఏం జరుగుతుందో కూడా తమకు అర్థం కాని పరిస్థితిలో ఉండిపోయామన్నారు.
నూర్ మొహమ్మద్ ఇంటిని సోదాలు నిర్వహించిన ధర్మవరం పట్టణ పోలీసులు ఎన్ఐఏ అధికారులు ఐబి అధికారులకు నూర్ మహమ్మద్ ఇంట్లో ఉగ్రవాదాలకు సంబంధించిన కొన్ని బుక్స్, సిమ్ కార్డ్స్ దొరికాయని తెలిసింది. అక్కడి నుంచి ధర్మవరం డిఎస్పి కార్యాలయంలో నూర్ మహమ్మద్ను ఎన్ఐఏఐబి అధికారులు విచారణ చేపట్టగా విస్తు పోయే నిజాలను నూర్ మొహమ్మద్ వెల్లడించినట్లు తెలుస్తోంది. నిషేధిత ఉగ్ర సమస్తల సోషల్ మీడియాలోనూ వాట్సాప్ గ్రూపులోను నూర్ మహమ్మద్ చాలా యాక్టివ్గ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.. తరచూ పాకిస్తాన్ కి సంబంధించిన వాట్స్అప్ గ్రూపుల్లో చాటింగ్ చేసేవాడని అలాగే అందులో ఉన్న సభ్యులకు వాట్సప్ కాల్ ద్వారా కూడా మాట్లాడినట్లు విచారణలో వెల్లడయింది. సుమారు 29 ఉగ్రవాద సంస్థల సోషల్ మీడియా గ్రూపుల్లో నూర్ మహమ్మద్ ఆక్టివ్ గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు..
2000లో జైషే మహ్మద్ (Jaish-e-Mohammed) మౌలానా మసూద్ అజహర్ స్థాపించిన పాకిస్తాన్ కేంద్రిత ఉగ్రవాద సంస్థ. భారత్ పై ఉగ్రదాడులు చేయడం లక్ష్యంగా పనిచేస్తోంది. 2001 పార్లమెంట్ దాడి, 2016 పఠాన్ కోట్ దాడి, 2019 పుల్వామా దాడి వంటి భారీ ఉగ్రదాడులకు పాల్పడింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి మసూద్ అజహర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది. భారత్ లో అతనిపై వారెంట్లు ఉన్నాయి. ఇలాంటి ఉగ్రవాద సమస్తలతో నూర్ మహమ్మద్ సంబంధాలు కలిగి ఉండటం ప్రస్తుతం భారతదేశంలో ఒక సంచలనంగా మారింది. AP Terrorist Noor Ahmed.
ధర్మవరం పట్టణం అనేక వ్యాపారాలకు నెలవు.. ప్రధానంగా ధర్మవరం చీరలు, సిల్క్ బిజినెస్ ఎక్కువగా ఇక్కడి నుంచి దేశ విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. ధర్మవరంలో పనిచేసేందుకు ఎక్కువమంది ఈ పట్టణానికి చేరుకుంటూ ఉంటారు. ఇదే పట్టణంలో ఇతర దేశాలకు చెందిన వారు కూడా ఉన్నట్లు అనధికారికంగా తెలుస్తోంది ప్రస్తుతం నూర్ మహమ్మద్ పాకిస్తాన్ ఉగ్ర సమస్యలతో సంబంధాలు ఉన్నాయని తేలటంతో ధర్మవరం పట్టణంలో పోలీసులు ప్రత్యేక నిఘ ను ఉంచారు.. ఇతర దేశాల నుంచి ఇక్కడ పని కోసం వచ్చిన వారిపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.