
Arjun Reddy Beauty Shalini Pandey: ‘అర్జున్ రెడ్డి’ మూవీతో ఓవర్ నైట్ గుర్తింపు తెచ్చుకుంది షాలినీ పాండే. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది. అయితే ‘అర్జున్ రెడ్డి’ లాంటి సక్సెస్ కానీ, ఆ స్థాయి గుర్తింపు గానీ అమ్మడికి మరే సినిమాతోనూ దక్కలేదు. ఆశించిన స్థాయి విజయాలు దక్కకపోవడంతో తెలుగులో నిదానం గా ఫేడ్ అవుట్ అయిపోయింది. అనుష్క పాన్ ఇండియా మూవీ ‘నిశ్శబ్దం’ తర్వాత షాలినీ పాండే మరే తెలుగు సినిమాలోనూ నటించలేదు. సినిమా అవకాశాలు లేకపోడంతో సోషల్ మీడియాని అడ్డాగా చేసుకొని అందాల ఆరబోత స్టార్ట్ చేసింది. నిత్యం జిమ్ వర్కౌట్ వీడియోలు, హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. ఇక ఎట్టకేలకు ఈ అమ్మడికి స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ వచ్చింది. సుమారు ఆరేళ్ళ తర్వాత షాలిని పాండే కి వచ్చిన మూవీ ఆఫర్ ఇది..
‘అర్జున్ రెడ్డి’ తర్వాత షాలిని పాండే తెలుగుతో పాటూ అలానే తమిళంలో ‘100 పర్శంట్ కాదల్’, ‘గొరిల్లా’ సినిమాల్లో నటించింది. ఈ రెండు సినిమాలు మంచి ఆదరణే అందుకున్నాయి. కానీ ఆ తర్వాత అక్కడ కూడా ఎందుకో షాలినీకి అవకాశాలు రాలేదు. ఈ మధ్యలో వివాదాస్పదమైన స్టేట్ మెంట్స్ కారణంగానే ఆమె వార్తల్లో నానింది. తాజాగా కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటిస్తూ, డైరెక్షన్ చేస్తున్న సినిమా ‘ఇడ్లీ కడై’ లో షాలినీ పాండే నటిస్తోంది. ఇందులో హీరోయిన్ గా నిత్యా మీనన్ చేస్తుండగా, హీరో చెల్లి పాత్రను షాలినీ పోషిస్తోంది.
ధనుష్ లాంటి స్టార్ పక్కన చెల్లి పాత్ర అంటే ఖచ్చితంగా సినిమాలో ఆ రోల్ కి మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకే షాలిని కూడా ఆ రోల్ లో నటించేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. ఆరేళ్ళ తర్వాత సినిమా చేస్తుందంటే హీరోయిన్ గా ఏమో అని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ సిస్టర్ రోల్ అని తెలిసి కాస్త డిసప్పాయింట్ అయ్యారు. మరి మళ్ళీ లాంగ్ గ్యాప్ తర్వాత షాలిని పాండే సిస్టర్ రోల్ లో బిగ్ స్క్రీన్ పై ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. Arjun Reddy Beauty Shalini Pandey.
ఇక ధనుష్ ‘ఇడ్లీ కడై’ సినిమా విషయానికొస్తే.. ‘తిరు’ సినిమా తర్వాత ‘ఇడ్లీ కడై’ తో మరోసారి ధనుష్, నిత్యా మీనన్ జోడిగా అలరించనున్నారు. తిరు సినిమాతో నిత్యా మీనన్, ధనుష్ జోడికి మంచి పేరు వచ్చింది. జాతీయ స్థాయిలో తిరు చిత్రం మార్మోగిపోయింది. ఇక ఏకంగా నిత్యా మీనన్‌కు ఉత్తమ జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఇప్పుడీ ‘ఇడ్లీ కడై’ సినిమా కూడా అదే రేంజ్లో ఉంటుందని, పర్ఫామెన్స్‌కు చాలా స్కోప్ ఉండే కారెక్టర్ అని నిత్యా మీనన్ ఇది వరకే చెప్పింది. సినిమాలో అసలు నిత్యా మీనన్ ఇలా ఉంటుందా? ఇలా కూడా నటిస్తుందా? అని అందరూ సర్ ప్రైజ్ అయ్యేలా తన పాత్ర ఉంటుందట. ఇక ఈ సినిమా అక్టోబర్ 1న ఆడియెన్స్ ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని ఆకాష్ భాస్కరన్, ధనుష్ సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. డాన్ పిక్చర్స్, రెడ్ జెయింట్, వండర్ బార్ ఫిల్మ్స్ బ్యానర్ల మీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q