
Dharmasthala Mass Burial Case: కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థల వివాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. తాను అసలు గత పదేళ్లుగా కర్ణాటకలోనే లేనని.. వందల మందిని పాతి పెట్టినట్లుగా ఫిర్యాదు చేసిన వ్యక్తి రివర్స్ అయ్యాడు. ఓ వ్యక్తి తనతో అబద్దాలు చెప్పించాడని.. అతనే పుర్రెను కూడా ఇచ్చాడని రివర్స్ వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో ఇప్పుడు ధర్మస్థల కథ మారింది.
మాజీ పౌరకార్మికుడు చేసిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసును సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. అతను చూపించిన అటవీప్రాంతంలో 15 రోజులపాటు తవ్వకాలు జరిపారు. శనివారం నుంచి తవ్వకాలకు బ్రేక్ పెట్టిన సిట్ అధికారులు ఫిర్యాదుదారుడిని విచారించారు. విచారణలో ఫిర్యాదుదారుడు.. తాను 2014 నుంచి 2023 వరకు తమిళనాడులో కుటుంబంతో పాటు ఉన్నానని, ఆ తర్వాత ఓ బృందం తనను సంప్రదించి, ధర్మస్థలలో మృతదేహాలు పాతిపెట్టిన అంశం గురించి వివరాలు కోరిందని చెప్పాడు. చట్టప్రకారమే మృతదేహాలను పూడ్చానని వారికి మాజీ పౌర కార్మికుడు తెలిపాడు.
కానీ చట్ట విరుద్ధంగా వాటిని పాతిపెట్టినట్లు చెప్పాలని 2023 డిసెంబరు నుంచి ఆ బృందం ఒత్తిడి తెచ్చింది. ఆ తరువాత అదే బృందం మాజీ పౌర కార్మికుడిని కర్ణాటకకు తీసుకొచ్చింది. ఆ బృందమే ఓ పుర్రెను సమకూర్చింది. ఆ పుర్రెను తీసుకువెళ్లి కార్మికుడు.. చట్టవిరుద్ధంగా మృతదేహాలను పూడ్చిపెట్టినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల ముందు ఏం చెప్పాలనేది ప్రతిరోజూ అతనికి ముగ్గురు సలహాలు ఇచ్చేవారు. అంతా వారు చెప్పినట్లే చేశానని సిట్‌కు మాజీ పౌర కార్మికుడు వివరించినట్టు సమాచారం. సిట్ అధికారులు ఫిర్యాదుదారుడు చెప్పిన అంశాలను రికార్డు చేసినట్టు తెలిసింది. కానీ ఈ విషయమై అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ వ్యవహారం కర్ణాటక అసెంబ్లీలో రచ్చకు దారితీసింది.
ఒక్క పురుషుడికి సంబంధించిన అస్థిపంజరం మాత్రం నదీ తీరంలో లభించిందని చెప్పుకున్నారు. ఆ తరవాత ఎన్ని చోట్ల తవ్వకాలు జరిగినా బయటపడిందేమీ లేదు. కానీ ఈ ఆలయంపై జరిగిన తప్పుడు ప్రచారానికి లెక్కే లేదు.. ఏమీ దొరకకపోయినా ఏదో దొరికిపోయినట్లుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేశారు. నిజానికి ఓ చోట వందల మందిని చంపి పూడ్చిపెట్టడం అనేది జరిగే పనేనా అన్న విషయం మాత్రం ఎవరూ ఆలోచించలేదు. ఈ రోజుల్లో ఎవరిపైనైనా ఎటాక్ చేయాలంటే వారిపై తప్పుడు ప్రచారాలు చేయడమే పెద్ద మార్గం అనుకుంటున్నారు. అందు కోసం చిన్న వ్యక్తులతో సంచలనాత్మక ఫిర్యాదులు ఇప్పించి.. అప్పట్నుంచి కథలు అల్లేస్తున్నారు. Dharmasthala Mass Burial Case.
శతాబ్దాలుగా, శ్రీ ధర్మస్థల మంజునాథేశ్వర ఆలయం కేవలం ప్రార్థనా స్థలం కంటే చాలా ఎక్కువ. ఇది ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించింది, అప్పుల నుండి కుటుంబాలను విముక్తి చేసింది, మద్యపానానికి వ్యతిరేకంగా పోరాడింది, గ్రామీణ యువతకు విద్యను అందించింది మరియు నిశ్శబ్దంగా లక్షలాది మందిని పేదరికం నుండి బయటకు తీసుకువచ్చింది. అయినప్పటికీ నేడు, దాని పేరు అన్ని తప్పుడు కారణాల వల్ల ముఖ్యాంశాలలోకి వస్తోంది. ఇక మరోవైపు ఇదే విషయమై ర్ణాటక విధానసభలో సభ్యులు పారిశుద్ధ్య కార్మికుడికి లై డిటెక్టర్ పరీక్షలు చేయించాలని డిమాండ్ చేశారు.
Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q