ఆయనకి గర్ల్ ప్రెండ్సే ముద్దు.. కూతురంటే..?

Mohammed Shami & Hasin Jahan: టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ మరోసారి వార్తల్లో నిలిచాడు. అతడి మాజీ భార్య హసీన్ జాహన్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. షమీని స్త్రీలోలుడిగా అభివర్ణించారు. ప్రియురాళ్ల పిల్లలను మంచి స్కూళ్లలో చదివిస్తూ, కన్నకూతురి చదువును మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. షమీకి, హసీన్ జాహన్‌కు ఐరా అనే కుమార్తె ఉన్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో తాజాగా హసీన్‌ జహాన్‌ ఓ శుభవార్తను పంచుకుంటూనే.. షమీపై మరోసారి ఆరోపణలు చేసింది. తన కూతురికి మంచి స్కూల్‌లో అడ్మిషన్‌ దొరకవద్దని తన శత్రువులు కుట్రలు చేశారని . అయితే, అల్లా వారికి బుద్ధి చెప్పాడంటూ తన కూతురు ఐరాకు ఓ ఇంటర్నేషన్‌ స్కూల్‌లో సీటు వచ్చిందని సోషల్ మీడియాలో పంచుకుంది. ‘ఐరా తండ్రి ఓ బిలియనీర్. అయినా కూతురి స్కూల్ ఫీజుకు మాత్రం డబ్బులు ఇవ్వడు. ఉంపుడుగత్తెల పిల్లలను మంచి స్కూళ్లలో చదివిస్తున్నాడని…. కూతురి చదువుకు మాత్రం డబ్బులు లేవని చెబుతున్నాడని హసీన్ తెలిపారు.

అయితే షమీ తన గర్ల్‌ఫ్రెండ్స్‌ను విమానాల్లో బిజినెస్ క్లాస్‌ల్లో తీసుకెళ్లడానికి లక్షలు ఖర్చు చేస్తాడుని… కూతురుని మాత్రం పట్టించుకోడని ఆరోపించారు. అతడు ఒక స్త్రీలోలుడు’ అని హసీన్ జాహన్ విమర్శించారు. ఆడవాళ్ల పిచ్చిలో పడి.. తన కూతురికి కాకుండా.. తనకు ఇష్టమైన మహిళల పిల్లలను పెద్ద పెద్ద స్కూళ్లలో చదివించే ప్రయత్నాలు చేస్తున్నాడని ఆరోపించింది. కానీ కూతురి చదువుకి డబ్బు ఇచ్చేందుకు మాత్రం అతడికి మనసు రాదు’’ అంటూ హసీన్‌ జహాన్‌ షమీపై ఆరోపణలు గుప్పించింది. కాగా సీనియర్‌ పేస్‌ బౌలర్‌ షమీ ప్రస్తుతం టీమిండియాకు దూరంగా ఉన్నాడు.

మాజీ మోడల్ అయిన జాహన్ 2014 లో మహ్మద్ షమీని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2015లో ఒక కూతురు పుట్టింది. మహ్మద్ షమీపై గృహ హింస ఆరోపణలు చేసింది. మ్యాచ్‌ ఫిక్సింగ్‌లు చేస్తున్నాడని ఆరోపించింది. ఇతర స్త్రీలతో వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నాడని పేర్కొంది. అయితే హసీన్ జాహన్ 2018 నుంచి షమీకి దూరంగా ఉంటున్నారు. . కాగా, షమీ నెలకు రూ.4 లక్షల భరణం చెల్లించాలని కలకత్తా హైకోర్టు ఇటీవల ఆదేశించింది. జాహన్ కోసం నెలకు రూ.1.50 లక్షలు, కుమార్తె కోసం నెలకు రూ.2.50 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. Mohammed Shami & Hasin Jahan.

చివరగా ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన ఈ బెంగాల్‌ పేసర్‌.. ఫిట్‌నెస్‌ సమస్యల వల్ల ఇటీవల ఇంగ్లండ్‌- భారత్‌ టెస్టు సిరీస్‌ ఆడలేకపోయాడు. తదుపరి దులిప్‌ ట్రోఫీలో ఈస్ట్‌ జోన్‌ తరఫున షమీ బరిలోకి దిగే అవకాశం ఉంది. మరీ ఏం జరుగుతుందో వేచి చూద్దాం.

Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q