
RK Roja Adudam Andhra: మాజీ మంత్రి, వైసిపి అధికార ప్రతినిధి ఆర్ కె రోజా “ఆడుదాం ఆంధ్ర” వ్యవహారంలో అరెస్టు కాక తప్పదని టాక్ వినిపిస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రోజాకు జైలు తప్పదని కూటమి నేతలుహెచ్చరికలు చేస్తున్నారు. విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో రోజా పాత్ర గూర్చి పేర్కొన్నట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో 40 కోట్ల రూపాయలు దుర్వినియోగమైనట్లు విజిలెన్స్ తేల్చినట్లు సమాచారం. అయితే రోజా అరెస్ట్ తప్పదా..? విజిలెన్స్ విచారణ నివేదిక ఆధారంగా
బాధితులపై చర్యలు తీసుకుంటారా?
మాజీ మంత్రి రోజా నాసిరకం క్రీడా సామాగ్రిని కొనుగోలు చేశారని, గ్రామీణ క్రీడలకు కొంత మొత్తం ఇచ్చి, మరి కొంత మొత్తాన్ని జేబులో వేసుకున్నారని అధికారులు గుర్తించారు. ప్రభుత్వం మారిన వెంటనే ఈ వ్యవహారానికి సంబంధించిన పద్దులను కంప్యూటర్లో నుంచి డిలీట్ చేసినట్లు కూడా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. మిగింపు ఉత్సవం పేరుతో కూడా భారీగా నిధులు దుర్వినియోగం జరిగినట్లు గుర్తించారు. దీనితో త్వరలో రోజా అరెస్టు తప్పదని టిడిపి వర్గాలలో జోరుగా ప్రచారం జరుగుతోంది. వైసిపి పాలనలో చోటు చేసుకున్న అవినీతి పైన కూటమి ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేయించింది.
ఆడుదాం ఆంధ్ర అవినీతి పైన విచారణ చేసిన విజిలెన్స్ అధికారాలు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఇందులో మాజీ మంత్రి రోజా, ఆమె సోదరుడితో పాటుగా బైరెడ్డి సిద్ధార్ద్ రెడ్డి పాత్ర పైన ఆరోపణలు ఉన్నాయి. ఆడుదాం ఆంధ్రాలో రూ.40 కోట్ల నిధులు దుర్వినియోగమైనట్లు ప్రాథమికంగా గు ర్తించినట్లు తెలిసింది. అప్పటి ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రాకు రూ.125 కోట్లు కేటాయించింది. క్రీడా పోటీల కోసం కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు అదనపు నిధులు కేటాయిం చినట్లుగా విజిలెన్స్ నివేదిక తేల్చినట్లు సమాచారం. అదే విధంగా విజేతలుగా వైసిపి కార్యకర్తలనే ఎంపిక చేసినట్లు విజిలెన్స్ గుర్తించినట్లు సమాచారం. కేవలం 47 రోజుల్లోనే భారీ మొత్తంలో ఖర్చు చేసినట్లుగా విచా రణలో ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. పార్టీ ప్రచా రం కోసం క్రీడా సామగ్రిపై వైసిపి స్టిక్కర్లు అంటించినట్టు తేలింది. క్రీడాకారులకు నాసిరకం కిట్లు సరఫరా చేసి నట్లు విజిలెన్స్ గుర్తించినట్లు సమాచారం.
ఇక అధికారంపోగానే వివరాలను కంప్యూటర్లో డిలీట్ చేసినట్లు గుర్తించారు. మొత్తం రూ.40 కోట్ల మేరకు నిధులు దుర్వినియోగం అయినట్లు నిర్ధారించినట్లు తెలిసింది. విజిలన్స్ విచారణలో కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గ్రామస్థాయిలో క్రీడలకు రూ.10 వేలు కేటా యించి, మరో రూ.10 వేలు జేబులో వేసుకున్నారని గుర్తించారు. అయితే ఖర్చు రూ. 20 వేలు చూపించినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. 2023 డిసెంబర్ నెలలో ప్రారంభమైన ఆడుదాం ఆంధ్రా ద్వారా ఎన్నికల పబ్లిసిటీ కోసం ఆయా వస్తువులపై జగన్ స్టికర్లను భారీగా అంటించారని అధికారులు గుర్తించారు. కూటమి ప్రభుత్వం అధి కారంలోకి వచ్చిన తరువాత కొత్త అధికారులు, మం త్రులు బాధ్యతలు తీసుకునే లోపలే వివరాలను డిలీట్ చేశారని విజిలెన్స్ తన నివేదికలో తెలిపినట్టు తెలిసింది. కాగా, ఈ అవినీతి సాగిన కాలంలో కీలకంగా వ్యవహ రించిన అప్పటి మంత్రి రోజా, ఆమె సోదరుడితో పాటు గా శాప్ మాజీ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్ద్ రెడ్డి పాత్రపైన ఫిర్యా దులు రావటంతో విజిలెన్స్ లోతుగా విచారణ చేసింది. పలు కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం.
మరో వైపు క్రీడా పరికరాల నాణ్యతపై తీవ్ర ఆరోపణలు వినిపి స్తున్నాయి. ఇక మిగిలిపోయిన క్రీడా కిట్లు ఏమయ్యా యనేదానిపై విచారణ జరుగుతంది. ఒక ఆటలో ఆడిన కిడ్స్ మరో ఆటకే పనికిరాకుండా పోయాయని కొందరు ఆటగాళ్లు అధికారులు దృష్టికి తీసుకుని వెళ్లారు. పరి కరాల కొనుగోలు, ముగింపు ఉత్సవాల పేరుతో భారీగా ఒకదాకలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇక రాష్ట్రవ్యాప్తంగా క్రీడా పోటీలు నిర్వహించి, విజేతలకు నగదు బహుమతులు, క్రీడా పరికరాలు, టీ షర్టులు పంపిణీ చేసింది అప్పటి ప్రభుత్వం. ఇక విశాఖపట్నంలో జరిగిన ముగింపు ఉత్సవం కోసం దాదాపు 2.7 కోట్లు, క్రీడా పరికరాల కొనుగోలుకు 37.5 కోట్లు, పోటీలనిర్వహణకు 14.99 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. కాగా ప్రస్తుతం విజిలెన్స్ దర్యాప్తు లో మాత్రం.. దాదాపు రూ.40 కోట్లకు పైగా నగదు దుర్వినియోగం అయినట్లు గుర్తించారు. దీంతో నివేదిక ఆధారంగా ఈ ఇద్దరి నేతలు క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతు న్నారు. RK Roja Adudam Andhra.
ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలనే లక్ష్యంతో మొదలైనా.. అవినీతి ఆరోపణలతో వివాదాస్పదంగా మారింది. ఇక అటు విజిలెన్స్ విచారణ ముగియడంతో.. కొందరు అధికారుల్లో ఆందోళన మొదలైందనే ప్రచారం జరుగుతోంది. లిక్కర్ స్కాంలో ఇప్పటికే పలువురు అధికారులను అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలోనూ అదే జరగబోతుందా అనే టెన్షన్ కొందరిలో కనిపిస్తోంది. ఏది ఏమైనా విజిలెన్స్ విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటే… ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా మారే అవకాశం ఉంది.
Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q