
Kurnool Papaya Farmers: ఒకప్పుడు లాభాల బాట పట్టించిన బొప్పాయి తోటలు ఇప్పుడు రైతులకు ఆర్థిక బరువుగా మారాయి. గత రెండు సంవత్సరాలుగా ఈ ప్రాంత రైతులు బొప్పాయి పంటను సాగు చేస్తూ మంచి ఆదాయం పొందారు. బెంగ ళూరు సహా పలు రాష్ట్రాలకు ఈ పండ్లు ఎగుమతి అవుతూ, రైతులకు జీవనాధారంగా నిలిచాయి. అయితే ఈసారి వర్షాలు అధికంగా కురవడం వల్ల తోటల్లో వైరస్ వ్యాప్తి చెందింది. దీంతో పంట దెబ్బతన్న వైనం పై మెగా 9టీవీ ప్రత్యేక కథనం..
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కందనాతి పంచా యతీ వెంకటగిరి గ్రామంలో దాదాపు 60 నుంచి 70 ఎకరాల్లో బొప్పాయి ని రైతులు సాగు చేస్తున్నారు. అనంతపురం నుంచి మొక్క లను తెచ్చు కోవడానికి ఒక్కో ఎకరానికి కనీసం 15,000 నుంచి 20,000 రూపాయలు ఖర్చవు తుందని, మొక్కలు చనిపోతే మరలా కొత్త మొక్కలు తెచ్చు కోవడానికి డబుల్ ఖర్చు అవుతోందని తెలిపారు. పోయిన సంవ త్సరం బొప్పాయి పంట బాగా రావడంతో రైతులు సంతోషిం చారు. కానీ ఈసారి పరిస్థితి విరుద్ధంగా మారిందని ఆయన వేదన వ్యక్తం చేశారు.
అంతేకాకుండా తోటల్లో సేంద్రియ ఎరువులు వాడటం, గొర్రెల పొలాన్ని ఆపడం వంటి చర్యల వల్ల ఒక్క ఎకరాకు 60 నుంచి 70 వేల వరకు ఖర్చు అవుతుందని రైతులు చెబుతు న్నారు. కానీ ఖర్చుతో పోల్చితే ఈసారి పంట దిగుబడి శూన్యా నికి దగ్గరగా పడిపోతుందన్న ఆందోళన వారిలో వ్యక్తమవు తోంది. Kurnool Papaya Farmers.
వాయిస్….రెండు సంవత్సరా లుగా ఈ బొప్పాయి పంటే మా జీవనా ధారంగా మారింది. ఇప్పుడు వైరస్ దెబ్బకు మొత్తం తోట నష్టపోతుందనే భయం పట్టుకుంది. ఇంత వరకు కష్టపడి వేసిన డబ్బు, శ్రమ అన్నీ వృథా అవుతు న్నాయి అని రైతులు ఆవేదన చెందుతున్నారు.రైతుల సమ స్యలను పరిష్కరించేం దుకు ప్రభుత్వమే ముందుకు రావా లని, పంట రక్షణకు అవస రమైన సాంకేతిక సహాయం, ఆర్థిక సాయం అందించాలని వారు కోరుతున్నారు. లేకపోతే బొప్పాయి సాగు పూర్తిగా మా నుకోవాల్సి వస్తుందని గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q