అల్లు అర్జున్ తో విజయ్ సేతుపతి..?

AA22xA6′ update: ‘పుష్ప’ 2 తో భారీ సక్సెస్ అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి సినిమాను కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. హాలీవుడ్ రేంజ్ లో వారియర్, టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే మేకర్స్ తెలిపారు. ఆల్మోస్ట్ 800 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు పనిచేస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ పై ఆడియన్స్ లో భారీ హైప్ నెలకొంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఓ లేటెస్ట్ అప్డేట్ బయటికొచ్చింది..

అట్లీ ప్రాజెక్ట్ కోసం అల్లు అర్జున్ రీసెంట్ గానే ముంబై వెళ్ళాడు. అక్కడే సినిమాకు సంబంధించి వర్క్ షాప్ జరిగింది. నవంబర్ మొదటి వారం నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. తాజాగా ఈ సినిమాలో ఓ తమిళ్ స్టార్ నటిస్తాడని తెలుస్తుంది. తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి… అల్లు అర్జున్ అట్లీ సినిమాలో నటించబోతున్నాడని తాజా సమాచారం బయటికొచ్చింది. అయితే విజయ్ సేతుపతి ఇందులో విలన్ గానా లేక ఏదైనా కీలక పాత్ర చేస్తున్నాడా? అనేది తెలియాల్సి ఉంది.

గతంలో విజయ్ సేతుపతి అట్లీ ‘జవాన్’ సినిమాలో విలన్ గా నటించి బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అట్లీ అడిగితే విజయ్ సేతుపతి వెంటనే ఒప్పుకుంటాడు. ఆ బాండింగ్ తోనే విజయ్ సేతుపతి అట్లీ అల్లు అర్జున్ సినిమాలో చేస్తున్నాడని తెలుస్తుంది. నిజానికి అల్లు అర్జున్ – విజయ్ సేతుపతి కాంబో ‘పుష్ప’ తోనే ఉండాల్సింది. పుష్ప లో ఫాహాద్ ఫాజిల్ పోషించిన భన్వర్ సింగ్ సికావత్ రోల్ మొదటగా సేతుపతి దగ్గరికే వెళ్లిందట. కానీ నా టైం లో డేట్స్ ఎడ్జస్ట్ అవ్వకపోవడంతో మక్కల్ సెల్వన్ పుష్ప లో నటించలేకపోయారు. AA22xA6′ update.

ఇక ఎట్టకేలకు ఇప్పుడు అట్లీ డైరెక్ట్ చేయనున్న ప్రాజెక్ట్ లో బన్నీతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక అట్లీ – అల్లు అర్జున్ సినిమాలో బన్నీ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తోంది. మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, జాన్వీ కపూర్ లు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారని సమాచారం. 2027లో ఈ సినిమా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q