జెమిని సురేష్ హీరోగా ‘ఆత్మకథ’ సినిమా ప్రారంభం

Aathma Katha వారాహి ఎంటర్టైన్మెంట్ ప్రైవేటు లిమిటెడ్ బ్యానర్ పై శ్రీనివాస్ గుండ్రెడ్డి రచన, దర్శకత్వంలో ప్రముఖ నటుడు జెమిని సురేష్ హీరోగా అఖిల నాయర్ హీరోయిన్‌గా రూపొందుతున్న చిత్రం ‘ఆత్మకథ’(Aathma Katha). సమ్మెట గాంధీ, బలగం విజయలక్ష్మి, చింటూ ధనరాజ్, తాగుబోతు రమేష్, మహేష్ విట్టా, నూకరాజు, గుర్రపు విజయ్ కుమార్, సుదర్శన్ రెడ్డి, బాబా శంకర్ తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్ర కథను నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్న కుమార్ అందించగా.. జెమిని సురేష్ తల్లి సుబ్బలక్ష్మి తొలి క్లాప్ కొట్టి చిత్రాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా జెమిని సురేష్ మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. నేను మీ జెమిని సురేష్. ఇది హీరోగా నా తొలి చిత్రం. నా 18 సంవత్సరాల కల నేడు నెరవేరుతోంది. ఒక మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రావాలి అనుకున్నాను. డైరెక్టర్ శ్రీనివాస్ గారు ఆత్మకథ చిత్రంతో అవకాశం ఇచ్చారు. నా ఈ చిత్ర పూజ కార్యక్రమానికి నాకు దేవుడు లాంటి వ్యక్తి జెమిని కిరణ్ గారు వచ్చి ఆశీర్వదించినందుకు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాను. నా తొలి చిత్రానికి మా అమ్మ క్లాప్ కొట్టడం అనేది మరింత సంతోషకరం. మీడియా నుండి వచ్చిన తొలి హీరో నేనే కాబట్టి మీడియా వారు ఉంటే నాకు కచ్చితంగా సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. ప్రేక్షకులు నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

సీనియర్ నటుడు సమ్మెట గాంధీ మాట్లాడుతూ… “ఆత్మకథ అనే చిత్రంలో నటించే అవకాశం నాకు జెమిని సురేష్ ద్వారా వచ్చింది. ఈ చిత్రంలో నా పాత్ర ఎంతో కీలకం. ఇటీవల కాలంలో ఇటువంటి చిత్రం రాలేదు.” అన్నారు.

దర్శకుడు శ్రీనివాస్ గుండ్రెడ్డి మాట్లాడుతూ… “నేను ఇప్పటికే ఒక హిందీ సినిమాకు, నాలుగు కన్నడ చిత్రాలకి, అలాగే ఒక తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించాను. కథని హీరోగా అనుకుని ఆత్మకథ అనే చిత్రాన్ని రచించాను. ఈ చిత్రంలో జెమిని సురేష్ గారు, సమ్మెటి గాంధీ గారు రెండు స్తంభాలు వంటి వారు. శ్రేయాస్‌ను అతి చిన్న వయసులోనే సంగీత దర్శకునిగా తీసుకోవడానికి కారణం అతని టాలెంట్. ” అన్నారు.

సంగీత దర్శకుడు శ్రేయాస్ మాట్లాడుతూ… “నా పేరు శ్రేయాస్. గ్రేడ్ 6 చదువుతున్నాను. నేను ఇప్పటికే ఐదు ఇన్స్ట్రుమెంట్లు ప్లే చేస్తున్నాను. ఎన్నో సంగీత కోర్సులు కూడా నేర్చుకున్నాను. ” అన్నారు.