సమంత షాకింగ్ డెసిషన్..!

Samantha Shocking Decision: టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలో వరుస సినిమాలు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన సమంత.. ఇప్పుడు కెరీర్ పరంగా కాస్త డౌన్ అయింది. ఎప్పుడైతే తనకు మౌయోసైటిస్ అనే వ్యాధి సోకిందో అప్పటినుంచి సినిమాలకు దూరంగా ఉంది. కానీ ఈ దశలో ఆమె చూపించిన ధైర్య సాహసాలు ఎంతోమందికి స్ఫూర్తినిచ్చాయి. ఇప్పుడు ఆ వ్యాధి నుంచి కోలుకుని, మళ్లీ సినిమాలలో చురుగ్గా పాల్గొంటుంది. ముఖ్యంగా బాలీవుడ్ వెబ్ సిరీస్‌‌లపై దృష్టి పెట్టి, కొత్త ప్రాజెక్టులకు సైన్ చేసింది. దీంతో సమంత ఫ్యాన్స్ హ్యాపీ ఫీలయ్యారు. అయితే తాజాగా ఈ హీరోయిన్ ఓ షాకింగ్ డెసిషన్ తీసుకుంది. ఆమె డెసిషన్ తో ఫ్యాన్స్ ఫుల్ డిసప్పాయింట్ అవుతున్నారు. ఇంతకీ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యేంతలా సమంత ఏం డెసిషన్ తీసుకుంది?

టాలీవుడ్ లో కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, ప్రయోగాత్మక చిత్రాలలో నటించి, ప్రతి సినిమాలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకుంది. ‘మనం’, ‘రంగస్థలం’, ‘మజిలీ’, ‘ఓ బేబీ’ వంటి చిత్రాలు సమంత నటనకు మరో నిదర్శనంగా నిలిచాయి. హీరో నాగ చైతన్యతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న సమంత, ఇండస్ట్రీలో ఒక ఆదర్శ జంటగా నిలుస్తుందని అభిమానులు ఆశించారు. కానీ దురదృష్టవశాత్తు, వారి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. వారిద్దరి మధ్య తలెత్తిన అభిప్రాయభేదాల కారణంగా విడాకులు తీసుకున్నారు. అటు నాగ చైతన్య శోభితను వివాహం చేసుకోగా, సమంత మాత్రం ఒంటరిగానే తమ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.

తాజాగా సమంత కీలక నిర్ణయం తీసుకుంది. ఇక సినిమాలను తగ్గించేయాలని ఆమె భావిస్తోంది. దీనిపై సమంత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నట్లు చెప్పిన సమంత, ఇప్పుడు తన జీవితంలో శారీరక, మానసిక ఆరోగ్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నానని స్పష్టం చేసింది. గతంలో మాదిరిగా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండకుండా, తన శరీరం చెప్పే మాట విని, తక్కువ సంఖ్యలో సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. Samantha Shocking Decision.

అయితే, సినిమాల సంఖ్య తగ్గినా, నాణ్యతలో మాత్రం రాజీ పడనని, ప్రేక్షకుల మనసుకు నచ్చే కథలనే ఎంచుకుంటానని సామ్ పేర్కొంది. సమంత తీసుకున్న ఈ నిర్ణయంతో ఆమె ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఇక చివరగా ‘శుభం’ అనే సినిమాలో గెస్ట్ రోల్ లో మెరిసిన సమంత ప్రజెంట్ తెలుగులో ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా కూడా ఆమెనే కావడం విశేషం. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షలకుల ముందుకు రానుంది.

Also Read: https://www.mega9tv.com/cinema/comedian-ramachandra-confined-to-bed-after-suffering-a-stroke-and-blood-clot-in-his-brain/