
Agni 5 Missile Test Launch: భారత్ దగ్గర చాలా రకాల మిస్సైల్స్ ఉన్నాయి. కానీ అగ్ని -5 మిస్సైల్ సత్తానే వేరు. దీని పేరు చెబితేనే శత్రుదేశాలకు వణుకుపుడుతుంది. తాజాగా అగ్ని -5 మిసైల్స్ ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. 5 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను అగ్ని 5 పర్ఫెక్ట్ గా చేరుకోగలదు. పైగా అణువార్ హెడ్ లను తీసుకువెళ్లగలదు. అందుకే దీని పేరు చెబితే శత్రుదేశాలకు నిద్రఉండటం లేదు. అయితే ఇప్పుడు దీనిని ఎందుకు ప్రయోగించారు..? ఈ అగ్ని-5 మిస్సైల్స్ ప్రత్యేకతలు ఏంటి..? తరుచూ భారత్ అగ్ని-5ను ఎందుకు ప్రయోగిస్తుంది..? దీనిని చాందీపూర్ నుంచే ఎందుకు ప్రయోగిస్తున్నారు..?
అగ్ని-5 అనేది భారతదేశం రూపొందించిన అత్యంత అధునాతన ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్. ఇది 5,000 కిలోమీటర్లకు పైగా దూరం గల లక్ష్యాలను ఖచ్చితంగా తాకగలదు. ఈ మిస్సైల్ మూడు-దశల ఘన ఇంధన ఇంజన్‌తో పనిచేస్తుంది. అలాగే రోడ్-మొబైల్, కానిస్టరైజ్డ్ ప్లాట్‌ఫారమ్ నుంచి ప్రయోగించవచ్చు. దీని వల్ల దీనిని సులభంగా ప్రయోగించవచ్చు. అగ్ని-5 MIRV సాంకేతికతను కలిగి ఉంది, అంటే ఒకే మిస్సైల్ మూడు నుంచి నాలుగు న్యూక్లియర్ వార్హెడ్లను తీసుకువెళ్లి వేర్వేరు లక్ష్యాలపై దాడి చేయగలదు. అంటే ఒకేసారి మల్టిఫుట్ టార్గెట్ ను ధ్వంసం చేయవచ్చు. గత ఏడాది మార్చిలో జరిగిన పరీక్షలో ఈ టెక్నాలజీని విజయవంతంగా పరీక్షించారు. తాజాగా చాందీపూర్‌లో జరిగిన పరీక్ష అన్ని ఆపరేషనల్, టెక్నికల్ పారామీటర్లను విజయవంతంగా చేరుకుంది. భారతదేశ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసింది. అప్పుడప్పుడు అగ్ని 5 లాంటి మిసైల్స్ ను ప్రయోగిస్తూ ఉండాలి. అప్పుడే పాకిస్థాన్ వంటి దేశాలు తోకజాడించకుండా ఉంటాయి. ఇటీవల పాకిస్థాన్ తరుచూ తమ వద్ద అణుబాంబు ఉందంటూ బెదిరిస్తోంది. కానీ భారత్ ఈ బెదిరింపులకు భయపడటం లేదు. తన ప్రయోగాలతో సత్తా ఏంటో చూపిస్తోంది.
అగ్ని-5 భారత్ కు ఎందుకు అంత ముఖ్యమైంది?
అగ్ని-5 భారతదేశ రక్షణ వ్యూహంలో కీలకమైన భాగం. ఎందుకంటే ఇది చైనా ఉత్తర భాగాలతో సహా ఆసియా, యూరప్‌లోని కొన్ని ప్రాంతాలను కవర్ చేయగల సుదూర న్యూక్లియర్ సామర్థ్యం గల మిస్సైల్. న్యూక్లియర్ బాంబులు ఉండటం వేరు.. వాటిని చాలా దూరం వరకు తీసుకువెళ్లే మిసైల్స్ ఉండటం వేరు. భారత్ తన మీద ఎవరైనా దాడి చేసే వరకు అణుబాంబులను ప్రయోగించమనే సిద్ధాంతాన్ని ఫాలో అవుతోంది. ఒకవేళ శత్రువులు దాడి చేస్తే.. నిమిషాల వ్యవధిలో శత్రుదేశంలోని లక్ష్యాలపై భారత్ ఎదురుదాడి చేస్తోంది. దీనికి అగ్ని5 ఎంతో ఉపయోగపడుతుంది. దీనిలోని MIRV సాంకేతికత ద్వారా ఒకే మిస్సైల్ ద్వారా ఎక్కువ లక్ష్యాలను తాకగల సామర్థ్యం శత్రు మిస్సైల్ డిఫెన్స్ వ్యవస్థలను నాశనం చేసే శక్తి అగ్ని-5ని అత్యంత ప్రభావవంతమైన ఆయుధంగా మార్చింది. ఈ మిస్సైల్ 1.5 టన్నుల న్యూక్లియర్ పేలోడ్‌ను మోసుకెళ్లగలదు, రింగ్ లేజర్ గైరోస్కోప్, నావిక్, GPS వంటి అధునాతన గైడెన్స్ సిస్టమ్‌లతో అత్యంత ఖచ్చితత్వాన్ని అందిస్తుంది. ఈ పరీక్ష భారతదేశాన్ని అమెరికా, రష్యా, చైనా వంటి MIRV సాంకేతికత గల దేశాల సరసన నిలిపింది.

అగ్ని-5 పరీక్ష భారతదేశ న్యూక్లియర్ సామర్థ్యాలను బలోపేతం చేసింది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా వంటి దేశాల దగ్గరే ఇలాంటి సాంకేతిక టెక్నాలజీ ఉంది. అలాగే అగ్ని -5 భారతదేశానికి సెకండ్-స్ట్రైక్ సామర్థ్యాన్ని పెంచుతుంది. అంటే శత్రుదేశం నుంచి దాడి జరిగినప్పుడు గట్టిగా ప్రతిస్పందించే అవకాశాన్ని కల్పిస్తుంది. ఇది యుద్ధ సమయంలో భారత రక్షణ శక్తిని పెంచుతుంది. భవిష్యత్తులో, DRDO 7,500 కిలోమీటర్ల రేంజ్ గల అప్‌గ్రేడెడ్ వేరియంట్‌ను అభివృద్ధి చేస్తోంది, ఇది భారతదేశ స్ట్రాటజిక్ రీచ్‌ను మరింత విస్తరిస్తుంది. ఈ పరీక్ష భారతదేశ రక్షణ స్వావలంబన, సాంకేతిక ఆధునికతను ప్రపంచానికి చాటిచెబుతుంది.
ఇలాంటి ప్రయోగాలు చాందీపూర్ ఎందుకు జరుగుతాయి..?
ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్, దాని సమీపంలోని అబ్దుల్ కలాం దీవి భారతదేశ మిస్సైల్ పరీక్షలకు ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. బంగాళాఖాతానికి సమీపంలో ఉన్న ఈ ప్రాంతం మిసైల్స్ ప్రయోగాలకు భౌగోళికంగా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే సుదూర మిస్సైల్ పరీక్షలకు అవసరమైన విశాలమైన, ఖాళీగా ఉండే సముద్ర ప్రాంతం వీటికి అందుబాటులో ఉంది. భారతదేశ భౌగోళిక పరిమితుల వల్ల ఇంటర్కాంటినెంటల్ మిస్సైళ్లను విదేశీ గగనతలంలోకి ప్రవేశించకుండా పూర్తి దూరం పరీక్షించడం సాధ్యం కాదు. చాందీపూర్, అబ్దుల్ కలాం దీవి ఈ సమస్యను పరిష్కరిస్తాయి, ఎందుకంటే ఇవి మిసైల్స్ ను టెస్ట్ చేసేందుకు ఉపయోగపడే సముద్ర మర్గానికి దగ్గరగా ఉన్నాయి. అబ్దుల్ కలాం దీవిలో మిస్సైల్ భాగాల రవాణాకు రైలు లైన్లు, భద్రమైన లాంచ్ సైట్లు ఉన్నాయి. ఈ పరీక్షల సమయంలో భారత నౌకాదళం యుద్ధనౌకలను మోహరిస్తుంది, ఇవి మిస్సైల్ మార్గాన్ని ట్రాక్ చేస్తాయి, టెలిమెట్రీ డేటాను సేకరిస్తాయి. ఈ లక్షణాలు చాందీపూర్ను భారతదేశ మిస్సైల్ టెస్టులకు కేరాఫ్ అడ్రెస్ గా మారుస్తున్నాయి. Agni 5 Missile Test Launch.
చాందీపూర్‌లో ఏ ఇతర మిస్సైళ్లను పరీక్షించారు?
చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్, అబ్దుల్ కలాం దీవిలో భారతదేశ రక్షణ అవసరాల కోసం వివిధ మిస్సైళ్లను పరీక్షిస్తుంటారు. అగ్ని-5తో పాటు, అగ్ని-ప్రైమ్ , పృథ్వీ-II, అగ్ని-I, ప్రళయ్ వంటి మిస్సైళ్లను ఇక్కడ పరీక్షించారు. అగ్ని-ప్రైమ్, అగ్ని-1, అగ్ని-2లను భర్తీ చేయడానికి రూపొందించిన కొత్త తరం మిస్సైల్. పృథ్వీ-II, ప్రళయ్ వంటి షార్ట్-రేంజ్ మిస్సైళ్లు సాంప్రదాయ, న్యూక్లియర్ వార్హెడ్లను మోసుకెళ్లగలవు. చాందీపూర్ భౌగోళిక స్థానం, సముద్ర మార్గం ఇలాంటి ప్రయోగాలకు అనుకూలంగా ఉంటుంది.
Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q