
China Pakistan Economic Corridor: చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ గురించి భారత్ తరుచూ ఆందోళన చెందుతూ ఉంటుంది. ఇప్పుడు దీనిలో ఆఫ్ఘనిస్తాన్ కూడా చేరింది. ఈ కారిడార్ ను ఆప్ఘనిస్తాన్ వరకు విస్తరించేందుకు రెడీ అవతున్నారు. ఈ విస్తరణ వల్ల దక్షిణ, మధ్య ఆసియాలో వాణిజ్య మార్గాలను మార్చడంతో పాటు, భారతదేశానికి కొత్త సవాళ్లను తెచ్చిపెడుతోంది. అసలు ఈ కారిడార్ రూట్ ఎలా ఉంటుంది? ఇది భారతదేశానికి ఎంత దగ్గరగా వస్తుంది? ఈ విషయంలో భారతదేశం ఎందుకు ఆందోళన చెందుతోంది? ఇప్పుడు భారత్ ఏం చేయాలి..? ఇది నిజంగా మనకు ప్రమాదమా..?
చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ అంటే ఏమిటి?
CPEC అంటే చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్, ఇది చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో ఒక కీలక భాగం. ఈ కారిడార్ చైనా జిన్‌జియాంగ్ ప్రాంతంలోని కాశ్గర్‌ను పాకిస్తాన్‌లోని గ్వాదర్ ఓడరేవుతో కలుపుతుంది. దాదాపు 2,500 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. రోడ్లు, రైల్వేలు, పవర్ ప్రాజెక్టుల ద్వారా ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యం, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం దీని లక్ష్యం. 2015లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌లో 60 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. ఇది పాకిస్తాన్‌లో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు, చైనాకు అరేబియా సముద్రం ద్వారా ప్రపంచ వాణిజ్య మార్గాలకు సులభమైన యాక్సిస్ ను అందిస్తుంది. ఇప్పుడు ఈ కారిడార్‌ను ఆఫ్ఘనిస్తాన్ వరకు కు విస్తరించేందుకు చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నిర్ణయించాయి. ఇది ఆ ప్రాంతంలో ఆర్థిక, రాజకీయ లెక్కలను మార్చవచ్చు.
CPEC ఆఫ్ఘనిస్తాన్‌కు ఎలా విస్తరిస్తోంది?
ఇటీవల కాబూల్‌లో జరిగిన త్రైపాక్షిక సమావేశంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, ఆఫ్ఘనిస్తాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ ఈ విస్తరణపై ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ప్రాజెక్ట్ ఆఫ్ఘనిస్తాన్‌లోని పెషావర్-కాబూల్ రహదారి నెట్‌వర్క్‌ను కరాకోరం హైవేతో కలపడం ద్వారా గ్వాదర్ నుంచి కాబూల్ వరకు కొత్త రోడ్డు మార్గం ఏర్పడుతుంది. ఇది పురాతన సిల్క్ రోడ్‌ను పునరుద్ధరించే ప్రయత్నంగా చెబుతున్నారు. దీనిని చైనాను ఆఫ్ఘనిస్తాన్ ద్వారా ఇరాన్‌తో కూడా కలపవచ్చు. ఆఫ్ఘనిస్తాన్‌లోని లిథియం, రేర్ ఎర్త్ ఖనిజాల వంటి వనరులను చైనా ఈ కారిడార్ ద్వారా సులభంగా యాక్సెస్ చేయాలని చూస్తోంది. ఈ విస్తరణ ఆఫ్ఘనిస్తాన్ ఆర్థికాభివృద్ధికి దోహదపడవచ్చు, కానీ భద్రతా సవాళ్లు, రాజకీయ సంక్లిష్టతలు ఈ ప్రాజెక్ట్‌ను సవాలుగా మార్చాయి.
CPEC రూట్ మ్యాప్ ఎలా ఉంటుంది?
CPEC ప్రస్తుత రూట్ చైనాలోని కాశ్గర్ నుంచి పాకిస్తాన్‌లోని గ్వాదర్ వరకు విస్తరించి ఉంది, ఇది కరాకోరం హైవే ద్వారా గిల్గిట్-బాల్టిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ మీదుగా వెళుతుంది. ఆఫ్ఘనిస్తాన్‌కు విస్తరణతో, ఈ కారిడార్ గ్వాదర్, క్వెట్టా, పెషావర్, గిల్గిట్, జలాలాబాద్, కాబూల్, కందహార్, హెల్మంద్, నిమ్రోజ్ వంటి నగరాలను కలుపుతుంది. దీనితోపాటు పెషావర్-కాబూల్ నెట్‌వర్క్‌ను కరాకోరం హైవేతో కలపడం ఎక్కువగా ఉపయోగమని నిపుణులు భావిస్తున్నారు.
ఈ కారిడార్ భారతదేశానికి ఎంత దగ్గరగా వస్తుంది?
CPEC విస్తరణ రూట్ భారతదేశం సరిహద్దులకు చాలా దగ్గరగా వస్తుంది, ముఖ్యంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతంలో దీనిని నిర్మిస్తారు. ఈ రూట్ జమ్మూ కాశ్మీర్, లడఖ్ కు సమీపంలో ఉంటుంది. వాఖాన్ కారిడార్, ఆఫ్ఘనిస్తాన్‌లోని ఈశాన్య భాగంలో ఉన్న 350 కిలోమీటర్ల సన్నని భూభాగం, భారతదేశం వాయవ్య సరిహద్దులకు కూడా దగ్గరగా ఉంది. ఈ ప్రాంతం జిన్‌జియాంగ్‌తో సరిహద్దును పంచుకుంటుంది, ఇది చైనా ఆక్రమణలో ఉన్న అక్సాయ్ చిన్‌కు సమీపంలో ఉంటుంది. ఈ రూట్‌లు భారతదేశ సరిహద్దుల నుంచి కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటాయి, ఇది భారతదేశానికి ఆందోళనలను కలిగిస్తోంది.
భారతదేశం ఎందుకు ఆందోళన చెందుతోంది?
భారతదేశం CPECని 2013 నుంచి వ్యతిరేకిస్తోంది, ఎందుకంటే ఇది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ద్వారా వెళుతుంది. ఇది భారతదేశానికి చెందిన భూభాగం. ఈ విస్తరణ ఆఫ్ఘనిస్తాన్‌లోకి పోవడం వల్ల భారతదేశ ఆందోళనలు మరింత పెరిగాయి. మొదట, ఈ కారిడార్ భారతదేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తుందని భారతదేశం భావిస్తోంది. రెండవది, ఇది చైనా-పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య త్రైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుంది, ఇది భారతదేశ రీజనల్ ప్రభావాన్ని దెబ్బతీస్తుంది. మూడవది, ఈ కారిడార్ ఇరాన్ లోని చబహర్ ఓడరేవు, ఇంటర్నేషనల్ నార్త్-సౌత్ ట్రాన్స్‌పోర్ట్ కారిడార్ వంటి ప్రాజెక్టులకు పోటీగా మారవచ్చు. అదనంగా, ఈ రూట్‌లు జైష్-ఎ-మొహమ్మద్, లష్కర్-ఎ-తొయిబా వంటి ఉగ్రవాద సంస్థలకు ఆయుధాలు, నిధులు, ఉగ్రవాదుల రవాణాకు సహాయపడవచ్చని భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు హెచ్చరిస్తున్నాయి.
ఈ రోడ్డు మార్గం పూర్తయితే.. ఈ ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉందని భారత్ ఆందోళన చెందుతోంది. జైష్-ఎ-మొహమ్మద్, లష్కర్-ఎ-తొయిబా వంటి సంస్థలు ఈ కొత్త రోడ్డు మార్గాలను ఉపయోగించుకుని భారతదేశంలోకి ఉగ్రవాదులను, ఆయుధాలను పంపే ప్రమాదం ఉంది. ఆఫ్ఘనిస్తాన్ గతంలో ఈ గ్రూపులకు ఆశ్రయం ఇచ్చిన చరిత్ర ఉంది, ఇప్పుడు చైనా-పాకిస్తాన్ మద్దతుతో ఈ ప్రమాదం మరింత పెరుగుతుందని ఆందోళనలు ఉన్నాయి. దీనికి తోడు చైనా స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ వ్యూహంలో భాగంగా గ్వాదర్ ఓడరేవు అభివృద్ధి భారతదేశ ఆరేబియా సముద్రంలోని సముద్ర భద్రతకు ప్రమాదంగా మారే అవకాశం ఉంది. China Pakistan Economic Corridor.
CPEC ఆఫ్ఘనిస్తాన్ విస్తరణ దక్షిణ, మధ్య ఆసియాలో రీజనల్ డైనమిక్స్‌ను గణనీయంగా మార్చవచ్చు. ఈ కారిడార్ ఆఫ్ఘనిస్తాన్ ఆర్థికాభివృద్ధికి దోహదపడవచ్చు, ముఖ్యంగా దాని ఖనిజ వనరులను చైనాకు అందుబాటులోకి వస్తాయి. ఇది భారతదేశం ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు సవాలుగా మారవచ్చు. ఈ కారిడార్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య దౌత్య సంబంధాలను బలోపేతం చేస్తుంది, ఇది భారతదేశం రీజనల్ ఇన్‌ఫ్లుయెన్స్‌ను బలహీనపరచవచ్చు. భారతదేశం ఈ పరిణామాలను దగ్గరగా గమనిస్తూ, తన దౌత్య, ఆర్థిక వ్యూహాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.
Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q