ఒకే వేదికపై ప్రభాస్, అనుష్క..!

Prabhas Anushka : ప్రభాస్ – అనుష్క జోడీ తెలుగు సినీ ప్రేక్షకులకు ఎంత స్పెషలో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ జంట ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీతో ఎన్నో హిట్స్ అందించడమే కాకుండా, వారిపై వచ్చిన గాసిప్స్ కూడా ఎప్పటికప్పుడు హాట్ టాపిక్‌గానే నిలిచాయి. అయితే ఈ ఇద్దరూ చాలా కాలంగా తెరపై కలిసి కనిపించలేదు. ఇటీవల జరిగిన ‘బాహుబలి రీయూనియన్’ ఈవెంట్‌కి కూడా అనుష్క హాజరుకాలేకపోవడంతో అభిమానులు కొంత నిరాశకు గురయ్యారు.

కట్ చేస్తే.. ఇప్పుడు మరోసారి బాహుబలి టీంతో కలిసి అనుష్క మళ్లీ కనిపించనుంది. ముఖ్యంగా ప్రభాస్‌తో కలిసి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనబోతోందని తాజా సమాచారం. ఈ స్పెషల్ ప్లాన్‌ను ఎస్.ఎస్. రాజమౌళి స్వయంగా సిద్ధం చేసినట్లు టాక్. 2015లో విడుదలైన ‘బాహుబలి: ది బిగినింగ్’ సినిమా విడుదలై ఈ ఏడాది తో పాటు దశాబ్దం పూర్తవుతోంది. ఈ సందర్భంగా బాహుబలి రెండు భాగాల‌ను ఒక్క సినిమాలా కట్ చేసి, ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో ప్రపంచవ్యాప్తంగా భారీగా రీ-రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.Prabhas Anushka.

ఈ రీ-రిలీజ్‌ను గ్రాండ్‌గా ప్రమోట్ చేయాలని బాహుబలి టీం నిర్ణయించగా, దానికి భాగంగా ఇప్పటికే ప్రభాస్-రానా కాంబినేషన్‌లో ఓ ఇంటర్వ్యూ వీడియో కూడా రూపొందించారు. ఇక ఇప్పుడు ప్రభాస్-అనుష్క ఇంటరాక్షన్‌ను కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఐడియాకు అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లో ఉన్నారు. అనుష్క నటించిన ‘ఘాటి’ సినిమా సెప్టెంబర్ 5న విడుదల కానుండటంతో, ఆమె సినిమాకు సంబంధించిన ప్రమోషన్లతో పాటు బాహుబలి స్పెషల్ ఇంటర్వ్యూకు కూడా టైం కేటాయించనున్నారు.

తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ తదితర కీలక నటులతో కలిసి పలు ఈవెంట్లు కూడా నిర్వహించాలన్నది మేకర్స్ ప్లాన్. ఒక కొత్త సినిమాగా ఫీల్ వచ్చేలా, ఈ రీ-రిలీజ్‌కి ప్రమోషన్ భారీగా ఉండబోతోంది. టాలీవుడ్‌లో రెండు పార్ట్‌ల సినిమాలకు దారి చూపిన రాజమౌళి, ఇప్పుడు ఈ ప్రత్యేక విడుదలతో మరోసారి ట్రెండ్ సెట్ చేయబోతున్నారన్నమాట.