పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య ఏం జరుగుతోంది..?

Bangladesh Pakistan Conspiracy: బంగ్లాదేశ్-పాకిస్తాన్ మధ్య ఏం గుడుపుటానీ జరుగుతోంది..? షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత, పాకిస్తాన్ మంత్రి ఇషాక్ దార్ ఢాకా పర్యటనతో.. కొత్త డిప్లొమాటిక్ గేమ్ స్టార్ట్ అయినట్లు కనిపిస్తోంది. ఇది భారత్‌కు ముందస్తు అలర్ట్‌గా మారింది..? ఈ టూర్, జరిగిన ఒప్పందాలు ఇవన్నీ భారత్‌కు రాజకీయంగా, అంటు రక్షణ పరణంగా సవాళ్లుగా మారునున్నాయా..? షేక్ హసీనా పతనం వెనుక పాకిస్తాన్ హస్తం ఉందా? పాకిస్థాన్, బంగ్లాదేశ్ దగ్గర అయితే భారత్‌కు ఎందుకు ఇబ్బంది? అసలు భారత్ భయం ఏంటి..?

భారత్ కు ఓ కొత్త ఆందోళన మొదలైంది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ బంగ్లాదేశ్ లో పర్యటించారు. ఇది 13 ఏళ్ల తర్వాత పాక్ నుంచి బంగ్లాదేశ్‌కు జరిగిన అత్యంత ఉన్నత స్థాయి పర్యటన. షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత బంగ్లాదేశ్‌లో ఏర్పడిన ఇంటరిమ్ గవర్నమెంట్‌తో సంబంధాలు పెట్టుకునేందుకు ఈ పర్యటన ఒక వ్యూహాత్మక అడుగుగా భారత్ చూస్తోంది. ఇషాక్ దార్ బంగ్లాదేశ్ ఇంటరిమ్ లీడర్ ముహమ్మద్ యూనస్, విదేశాంగ సలహాదారు తౌహిద్ హొస్సేన్‌తో సమావేశాలు నిర్వహించి, ట్రేడ్, రక్షణ సహకారంపై చర్చలు జరిపారు. భారత్ దృష్టిలో, ఈ పర్యటన కేవలం సాధారణమైంది కాదు, బంగ్లాదేశ్‌ను పాక్-చైనా కూటమిలోకి లాగే ఒక హ్యూహం కనిపిస్తోంది. ఈ రెండు దేశాల చర్చలు దక్షిణాసియా రాజకీయాల్లో భారత్‌కు కొత్త సవాల్‌గా మారింది.

షేక్ హసీనా పతనం వెనుక పాక్ హస్తం?
షేక్ హసీనా ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో హఠాత్తుగా పతనమైన తర్వాత, బంగ్లాదేశ్ రాజకీయాల్లో అస్థిరత నెలకొంది. హసీనా పాలనలో బంగ్లాదేశ్ ఇండియాతో దగ్గరి సంబంధాలను కలిగి ఉండేది. పాకిస్తాన్‌తో సంబంధాలు అతి తక్కువగా ఉండేవి. అయితే హసీనా పతనం వెనుక పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ISI, ఫండమెంటలిస్ట్ గ్రూపుల హస్తం ఉందని పలువురు విశ్లేషకులు అనుమానిస్తున్నారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమాత్-ఎ-ఇస్లామీ వంటి పాక్-సానుకూల గ్రూపులు హసీనా వ్యతిరేక ఆందోళనల్లో పాత్ర పోషించాయని ఆరోపణలు ఉన్నాయి. భారత్ దృష్టిలో, హసీనా పతనం పాక్-చైనా కూటమి రీజనల్ ఇన్‌ఫ్లుయెన్స్ పెంచే కుట్రలో భాగమే అంటున్నారు.

ఇషాక్ దార్ ఢాకా పర్యటనలో బంగ్లాదేశ్‌తో ఆరు ఒప్పందాలు, మెమోరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ కుదిరాయి. దౌత్య పాస్‌పోర్ట్ హోల్డర్లకు వీసా లేకుండా ఎంట్రీ, జాయింట్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్, స్ట్రాటజిక్ స్టడీస్, స్టేట్ న్యూస్ ఏజెన్సీ సహకారం వంటివి ఇందులో ఉన్నాయి. అలాగే, బంగ్లాదేశ్ 50 వేల టన్నుల రైస్ ఇంపోర్ట్, కరాచీ-చిట్టగాంగ్ మధ్య డైరెక్ట్ షిప్పింగ్, ఫ్లై జిన్నా ద్వారా ఎయిర్ కనెక్టివిటీపై చర్చలు జరిగాయి. భారత్ దృష్టిలో, ఈ ఒప్పందాలు కేవలం ఆర్థిక, సాంస్కృతిక సహకారం కోసం కాదు, బంగ్లాదేశ్‌ను పాక్-చైనా ఇన్‌ఫ్లుయెన్స్ జోన్‌లోకి లాగే స్ట్రాటజిక్ ప్లాన్‌గా కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్‌తో ఇండియా 13 బిలియన్ డాలర్లు ట్రేడ్ రిలేషన్‌ను కలిగి ఉంది, ఈ ఒప్పందాలు ఆ ఆర్థిక సంబంధాలను అస్థిరపరిచే అవకాశం ఉందని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

బంగ్లాదేశ్-పాకిస్తాన్ సంబంధాలు భారత్‌కు ఎందుకు ఇబ్బంది?
బంగ్లాదేశ్-పాకిస్తాన్ సంబంధాలు బలపడటం భారత్‌కు రాజకీయ, ఆర్థిక, రక్షణ రంగాల్లో సవాళ్లను తెచ్చిపెడుతోంది. బంగ్లాదేశ్ భారత్‌తో 4,100 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది, ఇది తూర్పు భారత్ భద్రతకు కీలకం. షేక్ హసీనా పాలనలో బంగ్లాదేశ్ ఇండియాతో బలమైన రక్షణ, ట్రేడ్ సహకారం కలిగి ఉంది, ఉగ్రవాద నిరోధక చర్యల్లో రెండు దేశాలు కీలకంగా వ్యవహరించాయి. ఇప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో సంబంధాలను బలోపేతం చేయడం, ముఖ్యంగా చైనాతో దాని రక్షణ సహకారం, బెంగాల్ బే రీజన్‌లో భారత్‌కు వ్యూహాత్మక ఒత్తిడిని పెంచుతోంది. భారత్ దృష్టిలో, ఇది పాక్-చైనా కూటమి ఇండియాను చుట్టుముట్టే కుట్రలో భాగం అని భావిస్తున్నారు. బంగ్లాదేశ్‌లో పాక్ ఇన్‌ఫ్లుయెన్స్ పెరిగితే, బెంగాల్-అస్సాం సరిహద్దు భద్రత, ఈశాన్య రాష్ట్రాల స్థిరత్వం అస్థిరమవుతుందని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

బంగ్లాదేశ్‌తో పాకిస్తాన్ సంబంధాలు బలపడటం భారత్ రక్షణ వ్యూహానికి పెద్ద సవాల్ గా భావించవచ్చు. బంగ్లాదేశ్ ఇప్పటికే చైనాతో రక్షణ సహకారం కలిగి ఉంది, ఇందులో సబ్‌మెరైన్ బేస్, ఫైటర్ జెట్స్, ట్యాంక్స్ వంటివి ఉన్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ రక్షణ సహకారంపై ఫోకస్ చేయడం ఇండో-పసిఫిక్ రీజన్‌లో చైనా-పాక్ ఇన్‌ఫ్లుయెన్స్‌ను మరింత బలపరుస్తుందని భారత డిఫెన్స్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో పాక్ ISI, ఫండమెంటలిస్ట్ గ్రూపులు బంగ్లాదేశ్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరించాయని భారత్ ఆరోపిస్తోంది. ఇప్పుడు ఇషాక్ దార్ పర్యటనతో జమాత్-ఎ-ఇస్లామీ, BNP వంటి గ్రూపులతో సమావేశాలు ఈ ఆందోళనలను మరింత పెంచాయి. బెంగాల్ బే, తూర్పు సరిహద్దుల్లో భారత్ భద్రతా వ్యూహం మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. Bangladesh Pakistan Conspiracy.

ప్రస్తుత పరిణామాలను భారత్ తీవ్రంగా పరిశీలిస్తోంది. బంగ్లాదేశ్‌తో భారత్ బలమైన ఆర్థిక సంబంధాలను, రక్షణ సహకారాన్ని కలిగి ఉంది, కానీ పాకిస్తాన్ డిప్లొమాటిక్ మూవ్స్ ఈ సంబంధాలను అస్థిరపరిచే అవకాశం ఉందని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. భారత్ ఇప్పుడు బోర్డర్ సెక్యూరిటీని బలోపేతం చేస్తోంది, బెంగాల్-అస్సాం సరిహద్దులో ఇంటెలిజెన్స్ బలోపేతం చేస్తోంది. అలాగే, బంగ్లాదేశ్ ఇంటరిమ్ గవర్నమెంట్‌తో డిప్లొమాటిక్ చర్చలను మరింత బలోపేతం చేయడానికి కొత్త వ్యూహాలను రూపొందిస్తోంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తూ, సార్క్ సమావేశాల పునరుద్ధరణ, రీజనల్ కోఆపరేషన్‌లో భారత్ ఆధిపత్యాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ డిప్లొమాటిక్ గేమ్‌లో భారత్ తన స్ట్రాటజిక్ పొజిషన్‌ను గట్టిగా నిలబెట్టాలని చూస్తోంది.