పార్టీ మారుతున్న గంగుల కమలాకర్..?

Karimnagar MLA Gangula Kamalakar: గత సమైక్య పాలనలో నిరాదరణకు గురైన కరీంనగరానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అవిరామ కృషి చేస్తున్నారు. కళ తప్పిన కరీంనగరాన్ని ఆరు దశాబ్ధాలలో ఎన్నడూ రానన్నీ నిధులు గత ప్రభుత్వంలో కోట్ల నిధులను తీసుకొచ్చి అన్ని రంగాల్లో అభివృద్ది పరచి మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీఠ వేశారు. గంగుల శ్రమను గుర్తించిన అప్పటి ప్రభుత్వం తనవంతుగా కేబుల్ బ్రిడ్జ్, మానేర్ రివర్ ఫ్రంట్ వంటి ప్రాజెక్టులకు భారీగా నిధులు కెటాయించి కరీంనగర్ ను స్మార్ట్ సిటిగా తీర్చిదిద్దే ప్రయత్నానికి చేయూతనందించింది.

ఎన్నికల టైంలోనే కనిపించి….. గెలిచిన తర్వాత కనిపించకుండా పోవడం కాదని….. ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించే వాడే ప్రజాప్రతినిధి అని నిరూపిస్తున్నారు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. సివిల్ ఇంజనీరింగ్ లో పట్టా పుచ్చుకున్న ఆయన, ప్రజా సేవే ముఖ్యమంటూ రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన…. 2 వేల సంవత్సరంలో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి తొలిసారిగా మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించారు. నాటి మున్సిపాలిటీలో ప్రతిపక్ష నేతగా మున్సిపల్ సమస్యల పై తన గళాన్ని బలంగా వినిపించి పట్టణ రాజకీయాల పై అనతి కాలంలోనే తన ముద్రను వేసుకున్నారు. కరీంనగర్ మున్సిపాలిటీ కార్పోరేషన్ స్థాయికి ఎదగగా, 2005లో జరిగిన ఎన్నికల్లో తాను ప్రాతినిధ్యం వహించిన టిడిపికి కార్పోరేషన్ లో అత్యధిక స్థానాలు దక్కేలా చూశారు. కార్పోరేటర్ గా ప్రజా సమస్యలను ఎత్తిచూపుతూ పాలకుల వైఫల్యాలను ఎండగడుతూ ముందుకు సాగారు. దీంతో 2009లో సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు టిడిపి అధిష్టానం అవకాశం కల్పించడంతో టిడిపి, టిఆర్ఎస్ ఉమ్మడి అభ్యర్థిగా గంగుల కమలాకర్ తొలిసారిగా అసెంబ్లీ పోరుకు తలపడ్డారు…

తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్…. నాటి నుండే నియోజకవర్గ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు. అయితే మరోవైపు ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున్న కొనసాగుతుండడం…. ఉద్యమాల గడ్డ కరీంనగర్ నుంచి ప్రజలు కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని బలంగా కోరుకుంటుండడంతో సమైక్య ఆంధ్రకు మద్దతునిచ్చే టిడిపిలో ఉంటూనే ప్రత్యేక రాష్ట్రం కోసం గళమెత్తారు. అయితే అధిష్టానం తెలంగాణ పై తన వైఖరి స్పష్టం చేయకుండా, నాన్చుడు ధోరణి అవలంభిస్తూ, సరైన సమాధానం ఇవ్వకపోవడంతో అగ్రహించిన గంగుల తెలంగాణ పోరాటంలో నేను సైతం అంటూ టిడిపి కి గుడ్ బై చేప్పేశారు.

టిడిపి కి గుడ్ బై చెప్పి 2013 ఎప్రిల్ లో కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. అఫ్పటి వరకు టిడిపి అధిష్టానం సూచనల మేరకు నిదానంగా సాగిన గంగుల…. టిఆర్ఎస్ లో చేరిన తర్వాత తన ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఉవ్వెత్తున ఎగిసి పడ్డ ఉద్యమంలో కెసిఆర్ కు అండగా నిలిచారు. తెలంగాణ సాధనలో భాగస్వాములయ్యారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడంలో తనవంతు పాత్రను పోషించారు.

నియోజకవర్గ అభివృధ్ధికి, తెలంగాణ రాష్ట్ర సాధనకోసం గంగుల కమలాకర్ కృషిని గుర్తించిన ఉధ్యమ నేత కెసిఆర్, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత వచ్చిన తొలి ఎన్నికల్లో మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు. తిరిగి పోరాటంలో నిలిచిన ఎమ్మెల్యే గంగులను ఓడించేందుకు వ్యతిరేక శక్తులు చేతులు కలిపాయి. గంగులను ఓడించేందుకు ఆన్ లైన్ వోటింగ్ సర్వే అంటూ పన్నాగాలు పన్నాయి. అయినప్పటికీ గంగుల వెనకడుగు వేయకుండా ముందుకు సాగారు. ఈ ఎన్నికల్లో కరీంనగర్ ప్రజలు గంగులకు 24 వేల 754 ఓట్ల మేజార్జీనిచ్చి 2వ సారి అసెంబ్లీకి పంపించారు. తన చేసిన అభివృద్ధిని చూసి ముచ్చటగా మూడోసారి కూడా అసెంబ్లీకి పంపడంతో కరీంనగర్ నియోజకవర్గంను గతంలో ఎన్నడు లేని విధంగా కరీంనగర్ను అభివృద్ధి దిశలో నడిపించారు. గత సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయగా తను చేసిన అభివృద్ధిని చూసి కరీంనగర్ ప్రజలు నాలుగోసారి పట్టం కట్టారు. కానీ ఈసారి తన పార్టీ ప్రభుత్వంలో లేకపోవడంతో తాను చేయవలసిన అభివృద్ధి పనులు నత్త నడకగా కొనసాగుతున్నాయి.

తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు తెలంగాణ ఉద్యమం పైనే దృష్టి సారించిన ఎమ్మెల్యే గంగుల…. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కరీంనగర్ అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగారు…. మాజీ సిఎం కెసిఆర్, అప్పటి మంత్రులు ఈటెల రాజేందర్, కెటిఆర్, హరీష్, మాజీ ఎంపి వినోద్ కుమార్, సహాకారంతో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రానన్ని నిధులను కరీంనగర్ కు తీసుకొచ్చి అభివృధ్ధి చేసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కరీంనగర్ పై తనకున్న ప్రేమను చాటుకుంటూ అప్పటి సిఎం హోదాలో తొలిపర్యటన కరీంనగర్ నుంచే ప్రారంభించి…. నగరంలోని ప్రధాన రహదారుల నిర్మాణం కోసం 47 కోట్ల రూపాయలను మంజూరు చేయడంతో ఆ రహదారులను అభివృద్ధి చేసుకున్నారు.

కరీంనగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్ది పర్యాటకంగా అభివృద్ది చేసేందుకు 5 వందల కోట్లతో మానేర్ రివర్ ఫ్రంట్, 150 కోట్లతో సస్పెన్షన్ బ్రిడ్జ్ లను తీసుకురావడంతో పాటు నగరంలోని రోడ్లను 119 కోట్లతో అభివృద్ది చేశారు. మానేర్ రివర్ ఫ్రంట్ పనులను చేయవలసి ఉంది. అంతే కాకుండా నగరంలోని శనివారం మార్కెట్ లోని రైతుబజార్ ను 5 కోట్ల రూపాయలతో ఆధునీకరించి, ఇటు నగర ప్రజలతో పాటు అటు రైతులకు అందుబాటులో ఉండే విధంగా తీర్చిదిద్దారు…. మరో వైపు నగరంలో సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను అభివృద్ది పతంలో నడిపించారు. ఇదంతా ఒక ఎత్తైతే నగరంలోని ఇళ్ళ మీదుగా ఉన్న హైటెన్షన్ కేబుళ్ళతో గత 20 నుంచి 30 సంవత్సరాలుగా పలువురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది అవయవాలను కోల్పోయి జీవఛ్ఛవాలు గా మారారు…. దీని పై ప్రత్యేక దృష్టి సారించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు…. సుమారు 8 కోట్ల రూపాయలతో పోల్ షిఫ్టింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు… ఇళ్ళ మధ్యనున్న కరెంట్ పోళ్ళను, హైటెన్షన్ కేబుల్స్ ను తొలగించారు.

అంతే కాకుండా నగరాభివృధ్ధి కోసం గత ప్రభుత్వంలో రెండు బడ్జెట్లలో 2 వందల కోట్ల రూపాయలను తీసుకువచ్చి నగరాన్ని సుందరనగరంగా తీర్చిదిద్దారు … మిషన్ భగీరథ పథకం కింద తెలంగాణలోనే మొదటిసారిగా నగర వాసులకు 24 గంటల నీటి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నారు…. అంతేకాకుండా వెయ్యి కోట్లతో నగరంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధునీకరణకు అప్పటి ప్రభుత్వంలో నిధులు మంజూరయ్యాయి.

రైతులకు సాగునీటి కోసం మిషన్ కాకతీయలో భాగంగా గత ప్రభుత్వ సమయంలో రెండు విడుతల్లో సుమారు 15 కోట్ల రూపాయలతో 42 చెరువులను అభివృద్ధి చేయడంతో పాటు, 3వ విడుతలో రెండున్నర కోట్లతో మరో 11 చెరువులను అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకున్నారు. దీంతో గత ఏడాది ఎండాకాలంలో సైతం చెరువులన్నీ జలకళను ఉట్టిపడుతుండడమే కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భ జలాల మట్టం పెరగడంతో అన్నదాతల కళ్ళలో ఆనందం తొనీకిసాలాడింది. మరో వైపు గత సంవత్సరంలో కరీంనగర్ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలకు ఇటు ఎస్సారెస్పీ నీరు లేకపోవడం, మరోవైఫు భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో, చేతికందే పంటలు ఎండిపోతుండడంతో రైతులు పడుతున్న ఆవేదనను గ్రహించిన ఎమ్మెల్యే గంగుల వారి పంటలను ఎలాగైనా ఆదుకుంటానని హామి అప్పట్లో ఇచ్చారు.

ఎమ్మెల్యే అంటే నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వచ్చేవారన్న భావనను తొలగిస్తూ… నిరంతరం ప్రజల కోసం, ప్రజల మధ్య ఉంటూ గంగుల కమలాకర్ సరికొత్త రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. అసెంబ్లీ సమావేశాలు మినహా మిగతా సమయమంతా నియోజకవర్గానికి, ప్రజలకు అందుబాటులో తన కార్యాలయంలో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి అహర్నిషలు కృషి చేస్తూ…. ప్రతి పక్షాలకు పని లేకుండా చేసుకున్నారు. గత 6 దశాబ్ధాల కాలంలో జరగని అభివృద్దిని తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి బి ఆర్ ఎస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన కేవలం 3 సంవత్సరాలలో చేసి చూపించిన ఆయన శ్రమను నియోజకవర్గ ప్రజలు అభినందించారు…. Karimnagar MLA Gangula Kamalakar.

గత అసెంబ్లీ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఓడిపోవడంతో తన నియోజకవర్గంలో చేయవలసిన మానేర్ రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులు ఆగిపోయాయి. ఎమ్మెల్యే మాత్రం ప్రభుత్వంతో కొట్లాడైనా నిధులను తీసుకొచ్చి అభివృద్ధి చేయాల్సిన పనులను పూర్తి చేస్తానని అంటున్నారు… కరీంనగర్ నియోజకవర్గం ప్రజలు మాత్రం ఎప్పుడు రివర్ ఫ్రంట్ అవుతుందో ఎప్పుడు పర్యటక కేంద్రంగా మారుతుందోనని ఎదురుచూస్తున్నారు. మరీ ఏం జరుగుతుందో తెలియాలీ అంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే…