హిట్ కోసం ఆ డైరెక్టర్ నే నమ్ముకున్న నితిన్..!

Nithin Movie With Vikram Kumar: టాలీవుడ్ లవర్ బాయ్ నితిన్ నుంచి హిట్ సినిమా చూసి చాలా ఏళ్లు అయిపోయింది. ఎన్నో అంచనాల మధ్య వస్తున్న సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోతున్నాయి. దిల్ రాజు ప్రొడక్షన్స్ లోనే నితిన్ చివరి సినిమా తమ్ముడు విడుదలైంది. ఆ సినిమా ఊ హించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయితే వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ అనే సినిమాను నితిన్ చేస్తున్నట్లు ఇదివరకే అనౌన్స్ చేశారు.

ప్రస్తుతం ఆ సినిమా డిలే అవుతున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి ‘ఎల్లమ్మ’ ప్రాజెక్టును పక్కన పెట్టినట్లు సమాచారం వినిపిస్తుంది. దీంతో ఈసారి హిట్ కొట్టాలని తనకు అచొచ్చిన డైరెక్టర్ నే నమ్ముకున్నాడు. గతంలో తాను ఇలాగే వరుస ప్లాప్స్ లో ఉన్నప్పుడు తనకు సక్సెస్ అందించిన ఆ డైరెక్టర్.. ఈసారి కూడా హిట్ ఇస్తాడని ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నాడట.

నితిన్ ప్రస్తుతం వరుస ప్లాపుల్లో ఉన్నాడు. ఈ హీరో సక్సెస్ రుచి చూసి సుమారు ఐదేళ్లవుతుంది.2020 లో వచ్చిన ‘భీష్మ’ నితిన్ కు ,మంచి సక్సెస్ ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన చెక్, రంగ్ దే, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్, రాబిన్ హుడ్ తో పాటూ మొన్నొచ్చిన తమ్ముడు సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరిచాయి. నితిన్ ఇలా వరుస అపజయాలు చూడటం ఇదేం మొదటి సారి కాదు. గతంలో రాజమౌళి ‘సై’ తర్వాత అతనికి వరుస ప్లాప్స్ పలకరించాయి. ఆ తరువాత విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇష్క్’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు.Nithin Movie With Vikram Kumar.

ప్రెజెంట్ అదే సిచ్యువేషన్ లో ఉన్న నితిన్.. మరోసారి విక్రమ్ కే కుమార్ నే నమ్ముకున్నాడని తెలుస్తోంది. నితిన్ ప్రస్తుతం విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో నితిన్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అప్పుడు వరుస డిజాస్టర్లు వచ్చినప్పుడు ఇష్క్ సినిమాతో మంచి హిట్ ఇచ్చి సక్సెస్ ట్రాక్ లో నిలబెట్టిన విక్రం కే కుమార్.. ఇప్పుడు మరోసారి నితిన్ కి హిట్ ఇస్తాడా అనేది అందరిలో ఉన్న క్యూరియాసిటీ. మరోవైపు విక్రమ్ కే కుమార్ అద్భుతమైన సినిమా తీస్తే అది కేవలం నితిన్ కు మాత్రమే కాకుండా విక్రమ్ కే కుమార్ కూడా ప్లస్ అవుతుంది.

నితిన్ – విక్రమ్ కె కుమార్ ల లేటెస్ట్ ప్రాజెక్ట్ స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్కనుందట. ఈ సినిమాలో నితిన్ హార్స్ రైడ‌ర్ గా క‌నిపించ‌నున్నాడ‌ని అంటున్నారు. భారీ బ‌డ్జెట్ తో ఈ మూవీ తెర‌కెక్క‌నుంద‌ని తెలుస్తోంది. నితిన్ వ‌రుస ఫ్లాపుల్లో ఉన్న‌ప్ప‌టికీ మేక‌ర్స్ అవేమీ ప‌ట్టించుకోకుండా క‌థ‌పై న‌మ్మ‌కంతో ఈ సినిమాను భారీ బ‌డ్జెట్ తో నిర్మించ‌డానికి రెడీ అవుతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను డిసెంబర్ లో మొద‌లుపెట్టి 2026 సమ్మర్ లో రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నార‌ట‌.

Also Read:https://www.mega9tv.com/cinema/kgf-villain-actor-dinesh-passed-away/