
Nalgonda minister’s new camp office: ఆ జిల్లా కేంద్రంలో అట్టహాసంగా ప్రారంభమైన మంత్రి కొత్త క్యాంపు కార్యాలయం ఎందుకు వివాదాలకు కేరాఫ్ అవుతోంది. ఏకంగా మంత్రి ఆఫీసు మీదే ప్రతిపక్షాలు మాటల తూటాలు పేలుస్తున్నాయి. ధర్నా చౌక్ ఉన్న ప్రాంతం పక్కనే మంత్రి క్యాంప్ ఆఫీస్ ఏర్పాటుతో, ధర్నా చౌక్ మార్చేస్తారన్న అనుమానాలు వస్తున్నాయి.
నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్లో దాదాపు 13 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన మంత్రి క్యాంపు కార్యాలయాన్ని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఇంతవరకు బాగానే ఉన్నా, క్యాంప్ ఆఫీస్ ఓపెనింగ్ కాంట్రవర్సిలకు కేరాఫ్ అయింది. నిజాం కాలం నుంచి నల్లగొండ నడిబొడ్డున ఉన్న క్లాక్ టవర్ సెంటర్లో రహదారులు, భవనాల శాఖ అతిథి గృహంగా పేరు గడించింది. గత బీఆర్ఎస్ హయాంలో పాత భవనాన్ని కూల్చేసి ఏడున్నర కోట్లతో నూతన బిల్డింగ్ నిర్మాణాన్ని చేపట్టారు. అయితే భవనం కంప్లీట్ అయ్యేలోపు ప్రభుత్వం మారింది. ఆ శాఖ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రావడంతో, బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన MLA క్యాంపు కార్యాలయంలోకి ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ షిఫ్ట్ చేశారు. క్లాక్ టవర్ సెంటర్లో నూతనoగా నిర్మిస్తున్న భవనానికి కొన్ని మార్పు, చేర్పులతోపాటు అదనంగా 6 కోట్ల రూపాయలు కేటాయించి కోమటిరెడ్డి క్యాంప్ ఆఫీస్ గా మార్చి నిర్మాణం పూర్తిచేశారు.
అయితే దశాబ్దాలుగా పట్టణ నడిబొడ్డున ఉన్న రోడ్లు భవనాల శాఖ గెస్ట్ హౌస్ కూల్చివేసి, ఆ స్దలంలో కొత్తగా నిర్మించిన బిల్డింగ్ ను మంత్రి క్యాంప్ ఆఫీస్ గా మార్చడంపై బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అభ్యంతరం తెలుపుతున్నాయి. క్యాంప్ ఆఫీస్ ప్రారంభోత్సవం రోజునే బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఆ కార్యక్రమాన్ని అడ్డుకునే యత్నం చేయడం.. పోలీసుల ముందస్తు అరెస్టులతో ఉద్రిక్తతలకు కారణమైంది. గత ప్రభుత్వ హాయాంలో నల్లగొండ పట్టణంలో నియోజకవర్గ క్యాంపు కార్యాలయం నిర్మించారు. అయితే వాస్తు దోషం పేరుతో అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అందులో అడుగుపెట్టలేదు. దీంతో ఆపార్టీకి చెందిన కొందరు నేతలు తమ వ్యక్తిగత కార్యకలాపాలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని వినియోగించుకోవడం వివాదాస్పదంగా మారింది. ఇక మంత్రి క్యాంప్ కార్యాలయానికి ఇందిరా భవన్ పేరుపెట్టడం కూడా వివాదానికి కారణం అవుతోంది. Nalgonda minister’s new camp office.
రాజకీయ పార్టీల విమర్శలు, ప్రతి విమర్శలతో క్యాంప్ కార్యాలయం ప్రారంభోత్సవం నల్లగొండ టౌన్ లో పొలిటికల్ హీట్ పెంచగా.. ధర్నాలు, రాస్తారోలు, నిరాహార దీక్షలకు, ర్యాలీలకు ధర్నా చౌక్ గా పిలువబడే క్లాక్ టవర్ ప్రాంతంలో.. మంత్రి క్యాంప్ కార్యాలయం నిర్మించడంతో.. శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని పోలీసు అధికారుల భావన. ఇకనుంచి.. క్లాక్ టవర్ సెంటర్ వేదికగా నిరసనలు, ధర్నాలు, ఆందోళనలకు అవకాశం ఉండదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇక.. నిరసనలకు బదులుగా.. మంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడి కార్యక్రమాలు రొటీన్ గా మారుతాయనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇకపై మంత్రి క్యాంపు కార్యాలయం భద్రత.. స్థానిక పోలీసులకు సవాల్ గా మారే అవకాశం ఉందని జిల్లా కేంద్ర పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇది ఎక్కడికి దారితీస్తుందోననే అధికార పార్టీలో వక్తం అవుతుండగా.. క్యాంపు కార్యాలయం వద్ద భద్రత పోలీసులకు సవాల్ గా మారే చాన్స్ ఉందనే చర్చ జరుగుతుంది.