
Tirumala Ghee Controversy: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం ఎంత వరకు వచ్చింది. అవినీతిపై టీటీడీ విజిలెన్స్ ఏర్పాటు చేసిన అధికారుల బృందం నివేదిక ఇచ్చిందా. ఒకవేళ అదే జరిగితే, నివేదికలో గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్రమాలు ఏ మేరకు జరిగినట్లు తెలుస్తోంది. నివేదిక ప్రకారం ఎంత మంది సిబ్బందిపై వేటు పడే అవకాశం ఉంది.
సీఎం చంద్రబాబు సూచనలతో టీటీడీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కల్తీ నెయ్యిపై విచారణ మొదలు పెట్టారు. తర్వతా టిటిడిలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై నివేదిక సిద్దం చేశారట. ఈ నివేదికను 8 నెలలు ముందే రాష్ట్ర ప్రభుత్వానికి, టిటిడి ఉన్నతాధికారులకు సమర్పించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఇందులో ప్రభుత్వం నుంచి డిప్యూటేషన్ మీద వచ్చిన అధికారులతో పాటు టిటిడిలో పనిచేస్తున్న దాదాపు 40 నుంచి 50 మంది మీద అవినీతి మరకలు ఉన్నట్లు తెలుస్తోంది. కల్తీ నెయ్యి వ్యవహారం, పర్చేసింగ్ డిపార్ట్మెంట్, టిటిడి ఇంజనీరింగ్ విభాగం, ఎస్టేట్ విభాగం ఇలా కొన్ని విభాగాల్లో ఎక్కువ అవినీతి జరిగినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నివేదిక ఇచ్చారట.
అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం చర్యలు తీసుకోపోవడంపై పెద్ద చర్చ నడుస్తోంది. అవినీతి అధికారులపై చర్యలు అడ్డుకుంటున్నది ఎవరన్నదీ అంతు చిక్కడం లేదట. టిటిడిలో పనిచేస్తున్న 45 మందిపై చర్యలకు విజిలెన్స్ సిఫార్సు చేసినా, చర్యలు లేకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోందట. సాక్షాత్తు టిటిడి చైర్మన్ బి ఆర్ నాయుడే అవినీతి చేసిన వారిని బదిలీ చేయాలని చెప్పినా కూడా పట్టించుకునే వారే లేరట. అంతేకాదు, కీలక స్థానాలలో గత ప్రభుత్వ హయాంలో ఉన్న సిబ్బందినే ఎందుకు కొనసాగిస్తున్నారనే దానిపై కూడా ఎవ్వరికీ క్లారిటీ రావడం లేదట. టిటిడిలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదనీ, చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో తెలియడం లేదంటున్నారు కూటమి నేతలు.
తిరుమల తిరుపతి దేవస్థానాలలో ప్రక్షాళన చేస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టిటిడిపై విజిలెన్స్ విచారణకు అదేశించారు. అందులో బాగంగా విజిలెన్స్ అధికారులు యుద్ద ప్రాతిపాదికన విచారణ నిర్వహించారు. ఈ సమయంలోనే టిటిడికి సరఫరా అయ్యే నెయ్యి కల్తీ ఇష్యూ బయటకు రావడంతో దానిపై సిట్ ఏర్పాటు చేయడం తర్వాత సుప్రీం అధ్వర్యంలో సిబిఐ నిర్వహాణలో సిట్ ఏర్పాటు చేయడం ప్రస్తుతం ఇందులో ఎఅర్ డైయిరీతో పాటు బొలేబాబా డైయిరీ, వైష్ణవి డైరీ నిర్వాహకులు అంతా కేసులో ఉన్నారు. ఇందులో ఉద్యోగులు కూడా అవినీతికి పాల్పడినట్లు సిబిఐ సిట్ నిర్ధారించింది. ఇందులో కొంతమంది అప్రూవర్ గా మారినట్లు సమాచారం. అయితే అవినీతికి పాల్పడిన ఉద్యోగుల వివరాలు టిటిడి ఉన్నతాధికారులకు తెలిపిన వారిపై చర్యలు మాత్రం తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి.
టిటిడి ఇంజనీరింగ్ విభాగం అత్యంత అవినీతి మయంగా మారిందనే విమర్శలు తీవ్ర స్థాయిలో వినపడుతున్నాయి. గత ప్రభుత్వంలో ఇద్దరి చైర్మన్ల పదివి కాలంలో అనేక అక్రమ దందాలు నడిచినట్లు విజిలెన్స్ నివేదిక ఇచ్చిందంట. ఏకంగా ఇంజనీరింగ్ పనుల విషయంలో స్వీమ్స్ నిర్మాణాలు, పద్మావతి నూతన అసుపత్రి పనులతో పాటు గోవింద రాజ సత్రాల కూల్చివేత పనులపై కూడా విచారణ చేసిన విజిలెన్స్, అనేక అక్రమ దందాలు నడిచినట్లు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఉద్యోగుల పాత్రపై సమగ్రంగా నివేదికలో పొందుపర్చినట్లు తెలుస్తోంది. అక్రమ ప్రమోషన్లతో పాటు అర్హత లేని వారికి ప్రమోషన్లు ఇచ్చినట్లు నిర్దారించిందట. దీంతో పాటు మెకానికల్ విభాగ అధిపతిని టెక్నికల్ ఇన్ చార్జిగా నియమించారు. వాహానాల కొనుగొళ్లతో పాటు అద్దె వాహనాలపేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు నివెదికలో పొందుపర్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు డైరీ డైరెక్టర్ బాధ్యతలు నిర్వహించిన హారినాథ్ రెడ్డి పాత్రపై కూడా విజిలెన్స్ నివేదికలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
టీటీడీ ప్రక్షాళన అన్నది కేవలం మాటలకే పరిమితం అవుతుందన్న విమర్శిలు వినిపిస్తున్నాయి. దాదాపు ఆరు సంవత్సారాలుగా పాతుకు పోయిన సిబ్బంది కీలక స్థానాలలో కొనసాగుతున్నారు. వీరు గత పాలకుల అదేశాలను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇంజనీరింగ్,ఎస్టేట్ విభాగాలలో ఇది జరుగుతోందట. మరో వైపు మార్కెటింగ్ విభాగంలో జీడిపప్పు, ఇతర దినుసల కొనుగొలులో అనేక అక్రమాలు చోటు చేసుకున్నట్లు సమాచారం. మరోవైపు ఎస్టేట్ విభాగంలో హోటల్స్ టెండర్లతో పాటు షాపులు, తట్టల దందా పెద్ద ఎత్తున నడిచిందట. దళారులను పెట్టుకొని వసూల్లు కార్యక్రమాలు జరిగాయని కూడా విజిలెన్స్ సాక్ష్యాలతో సహా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పుడు కూడా అప్పట్లో పనిచేసిన ఓ ఉన్నతాధికారి చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. Tirumala Ghee Controversy.
తన కోవర్టులు టిటిడిలో ఉన్నారని వారి ద్వారా పిన్ టు పిన్ తనకు తెలుస్తుందంటు గత చైర్మన్ బహిరంగంగా చెప్పినప్పిటికి ప్రస్తుత పాలకులు ఎందుకు స్పందించడం లేదన్న ప్రశ్న వినిపిస్తోంది. దీనికితోడు పరకామణి కేసులో పోరాటం చేస్తున్న టిటిడి పాలక మండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డికి సహకరించి ఉంటే పరిస్తితి వేరుగా ఉండేదని అంటున్నారు. గత ప్రభుత్వ పాలనలో టిటిడిలో తప్పిదాలు జరిగాయని ప్రజలు గట్టిగా విశ్వసించారు.కాని ప్రస్తుత పాలకులకు అధారాలతో విజిలెన్స్ నివేదిక ఉన్నా చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.