గంగా ఎక్స్‌ప్రెస్‌.. వరల్డ్ రికార్డ్..!

Ganga Express Highway: భారత్‌లోనే అతి పొడవైన గంగా ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణంలో ప్రపంచ రికార్డులు సృష్టించారు. కేవలం 24 గంటల్లో 34.24 లేన్ కిలోమీటర్ల రోడ్డు నిర్మించారు. ఈ అద్భుత నిర్మాణం గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. అసలు ఈ ప్రాజెక్ట్ రికార్డులకు ఎక్కడానికి ఎలాంటి కృషి ఉంది..? ఈ ఎక్స్ ప్రెస్ వే ప్రత్యేకత ఏంటి.? ఉత్తర్ ప్రదేశ్ కు ఎలా ఉపయోగం..?

ఉత్తర్ ప్రదేశ్ లోని గంగా ఎక్స్ ప్రెస్ వే రోడ్డు నిర్మాణం రికార్డుల కెక్కింది. హర్దోయ్-ఉన్నావ్ జిల్లాల మధ్య కేవలం 24 గంటల్లో 34.24 లేన్ కిలోమీటర్ల కాంక్రీట్ రహదారి, 10 కిలోమీటర్ల మెటల్ బీమ్ క్రాష్ బ్యారియర్స్ నిర్మించారు. అదానీ రోడ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ లిమిటెడ్, పటేల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కలిసి ఈ రికార్డు సాధించాయి. ఈ అద్భుత నిర్మాణం గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. ఇక గంగా ఎక్స్‌ప్రెస్‌వే ప్రత్యేకతలు చూస్తే నిజంగా ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. మీరట్ నుంచి ప్రయాగ్‌రాజ్ వరకు 594 కిలోమీటర్ల పొడవు, 6-లేన్ యాక్సెస్-కంట్రోల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే, భవిష్యత్తులో 8 లేన్లకు విస్తరణ సామర్థ్యం ఉంది. దీని మొత్తం ఖర్చు రూ. 37,350 కోట్లు. స్పీడ్ లిమిట్ గంటకు 120 కిలోమీటర్లు. అలాగే షాజహాన్‌పూర్‌లోని జలాలాబాద్ వద్ద 3.5 కిలోమీటర్ల ఎమర్జెన్సీ ఎయిర్‌స్ట్రిప్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్స్ కోసం నిర్మించారు. ఇప్పటికే ఇక్కడ యుద్ధ విమానాలతో టెస్టింగ్ కూడా పూర్తి చేశారు. అయితే ప్రపంచ స్థాయి రికార్డులకు ఎక్కిన ఈ రహదారి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

మే 17, 2025 ఉదయం 5 గంటల నుంచి మే 18, 2025 ఉదయం 5 వరకు నాన్-స్టాప్ నిర్మాణం చేపట్టి అరుదైన రికార్డు సాధించింది గంగా ఎక్స్ ప్రెస్ వే. 34.24 లేన్ కిలోమీటర్ల బిటుమినస్ కాంక్రీట్ వేశారు, దీని కోసం 20,105 మెట్రిక్ టన్నుల మెటీరియల్ ఉపయోగించి, 171,210 చదరపు మీటర్ల ఉపరితలం కవర్ చేశారు. అదే 24 గంటల్లో 10 కిలోమీటర్ల మెటల్ బీమ్ క్రాష్ బ్యారియర్స్ ఏర్పాటు చేశారు, ఇంజనీర్లు, యంత్రాలు, కార్మికులు, మెటీరియల్స్ సమన్వయంతో 24 గంటలు అవిశ్రాంతంగా పనిచేయడం వల్ల ఈ రికార్డు సాధ్యమైంది.

గంగా ఎక్స్‌ప్రెస్‌వే 12 కీలక జిల్లాలను అనుసంధానిస్తుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే మీరుట్ నుంచి ప్రయాగ్‌రాజ్ వరకు ప్రయాణ సమయాన్ని 12 గంటల నుంచి 8 గంటలకు తగ్గిస్తుంది. ప్రాజెక్ట్ పనులు రెండు దశల్లో జరుగుతున్నాయి. ఫేజ్-1లో 484 కిలోమీటర్లు గత ఏడాది డిసెంబర్ నాటికి పూర్తికాగా.., ఫేజ్-2లో 110 కిలోమీటర్లు నాటికి పూర్తి కానున్నాయి. బలియా వరకు ఎక్స్‌టెన్షన్ ప్లాన్‌తో మొత్తం పొడవు 999 కిలోమీటర్లకు చేరనుంది.

ఉత్తర్ ప్రదేశ్ కు ఎలా ఉపయోగం..?
గంగా ఎక్స్‌ప్రెస్‌వే ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు గేమ్-చేంజర్‌గా మారనుంది. వివిధ ఇండస్ట్రియల్ క్లస్టర్స్‌ను అనుసంధానించడం ద్వారా పారిశ్రామిక విస్తరణను సులభతరం చేస్తుంది. రవాణా ఖర్చులను తగ్గించి, వ్యవసాయ రంగం, తయారీ ఉత్పత్తుల రవాణాను సుగమం చేస్తుంది. వాణిజ్యం, టూరిజం, సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించి ప్రాంతీయ అభివృద్ధిని ఉత్తేజపరుస్తుంది. ప్రయాణ సమయం తగ్గడంతో జీవన నాణ్యత మెరుగుపడుతుంది.

గంగా ఎక్స్‌ప్రెస్‌వే ఆధునిక ప్రమాణాలతో రూపొందించబడింది. గంగా, రామ్‌గంగ నదులపై రెండు ప్రధాన వంతెనలు, యుద్ధ విమానాలు కూడా ల్యాండ్ అయ్యేలా నిర్మించారు. షాజహాన్‌పూర్‌లోని జలాలాబాద్ వద్ద ఎయిర్‌స్ట్రిప్ ప్లాన్ చేశారు. ప్రయాణికుల సౌకర్యం కోసం తొమ్మిది పబ్లిక్ అమెనిటీ కాంప్లెక్స్‌లు నిర్మిస్తున్నారు. పర్యావరణ అనుకూల పద్ధతులతో జీవవ్యవస్థలను రక్షిస్తూ నిర్మాణం సాగుతోంది . 6-లేన్ డిజైన్, భవిష్యత్ ట్రాఫిక్ పరిస్థితులను హ్యాండిల్ చేయడానికి 8-లేన్లకు విస్తరణ సామర్థ్యం ఉంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉత్తరప్రదేశ్ గ్లోబల్ స్టాండర్డ్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్టేట్‌గా ఎదుగుతోంది అని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఉత్తరప్రదేశ్ ఎక్స్‌ప్రెస్‌వే ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ అద్భుత ప్రణాళిక, సాంకేతిక నైపుణ్యం, అంకితభావంతో ఈ విజయాన్ని సాధించిందని తెలిపారు. జూన్ నాటికి గంగా ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం 84% పూర్తయింది. ఒరిజినల్ ప్లాన్ ప్రకారం 2025 మహా కుంభమేళా ముందు పూర్తి కావాల్సి ఉంది, కానీ కొన్ని ఆలస్యాల వల్ల ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభం కానుంది. బలియా వరకు ఎక్స్‌టెన్షన్ ప్లాన్‌తో మొత్తం 999 కిలోమీటర్ల పొడవుతో ఇది భారత్‌లో అతి పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే అవుతుంది. ఇది దేశంలోనే అతి పొడవైన స్టేట్-ఓన్డ్ ఎక్స్‌ప్రెస్‌వే రికార్డును కైవసం చేసుకుంటుంది. Ganga Express Highway.

గంగా ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణంలో సాధించిన 24 గంటల ప్రపంచ రికార్డు భారత ఇంజనీరింగ్ సామర్థ్యం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ వేగాన్ని ప్రపంచానికి చాటింది! ఉత్తరప్రదేశ్ ఆర్థిక రూపాంతరంలో ఈ ప్రాజెక్ట్ ఒక మైలురాయిగా నిలుస్తుంది. 12 జిల్లాలను అనుసంధానిస్తూ, రవాణా ఖర్చులను తగ్గిస్తూ, ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తూ, ఈ ఎక్స్‌ప్రెస్‌వే ఉత్తరప్రదేశ్‌ను గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హబ్‌గా మారుస్తుంది.

Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q