
Modi’s Government GST reduction: GST తగ్గింపు పై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రధాని మోడీ GST లో కీలక మార్పులు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో అసలు వేటిపై తగ్గిస్తారనే చర్చలు ఊపందుకున్నాయి. ఈ జీఎస్టీ తగ్గింపుతో సామాన్యులకు ఊరట ఇచ్చేలా కొన్ని కీలక వస్తువుల ధరలు తగ్గే ఛాన్స్ ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
జీఎస్టీ శ్లాబ్‌లను సరళీకరించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ ఈమేరకు వివరాలు వెల్లడించారు. కేంద్రం 5, 18 శాతం జీఎస్టీ శ్లాబ్‌లను మాత్రమే ఉంచాలని యోచిస్తున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ 3, 4 తేదీల్లో 56వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరగనుంది. ఇందులో దీనిపై చర్చించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. పలు వస్తువులు, సేవల రేట్లను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
కేంద్రం ప్రతిపాదించిన ఐదు శాతం పన్ను పరిధిలోకి హోటల్ గదుల అద్దెలు, 100 రూపాయల సినిమా టికెట్లు, బ్యూటీ సర్వీసెస్ ఉంటాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. గ్యాంబ్లింగ్, క్యాసినో, బెట్టింగ్, ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు, రేస్ క్లబ్‌లపై 40 శాతం పన్ను విధించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. 30 క్యాన్సర్ చికిత్సలో వాడే మందులు, అరుదైన వ్యాధుల ఔషధాలు పూర్తిగా టాక్స్ ఫ్రీ శ్లాబ్‌లో ఉంటాయని అంచనా వేస్తున్నారు. మెడికల్ ఆక్సిజన్, అయోడిన్, పొటాషియం ఐయోడేట్ 12% నుంచి 5%కి చేరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
సిమెంట్‌పై ప్రస్తుతం ఉన్న 28శాతం జీఎస్టీ రేటును 18శాతానికి తగ్గించే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ఈ తగ్గింపు నిర్మాణ రంగానికి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఊతమిస్తుంది. వినియోగదారులకు కూడా ఇళ్ల నిర్మాణం మరింత చౌకగా మారే అవకాశం ఉంది.
వ్యక్తులు కొనుగోలు చేసే టర్మ్ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా పాలసీలపై జీఎస్టీని సున్నాకి తగ్గించే ప్రతిపాదన కూడా కౌన్సిల్ ముందుకు రానుంది. ఈ చర్య ఆరోగ్య బీమాను ప్రోత్సహించి, దేశంలో బీమా పరిధిని పెంచేందుకు తోడ్పడుతుంది. ఇక ఆహార, వస్త్ర వస్తువులన్నింటినీ 5శాం పన్ను శ్లాబ్‌లోకి తీసుకురావాలని ప్రతిపాదించారు. ఇది ఆహార, వస్త్ర పరిశ్రమలలో వర్గీకరణ సమస్యలను తొలగించి, పన్ను విధానాన్ని మరింత సులభతరం చేస్తుంది.
ప్రీమియం ఎయిర్ టికెట్లు 18% శ్లాబ్‌లో, వ్యవసాయానికి ఉపయోగపడే ఎరువులు, మైక్రోన్యూట్రియెంట్స్, డ్రిప్ ఇరిగేషన్, ట్రాక్టర్లపై 5% జీఎస్టీ, టెక్స్టైల్, హ్యాండీక్రాఫ్ట్స్, సింథటిక్ యార్న్, కార్పెట్స్, టెర్రకోటా వస్తువులు, కొన్ని రకాల ఫుట్‌వేర్‌ను 5% జీఎస్టీ శ్లాబ్‌లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. విద్యకు ఉపయోగపడే మ్యాప్స్, అట్లాసులు, షార్పెనర్లు, పెన్సిల్స్, క్రేయాన్స్, ఎక్సర్సైజ్ బుక్స్‌పై 5% జీఎస్టీ విధిస్తారని అంచనాలున్నాయి.
ఈ ప్రతిపాదనలు జీఎస్టీ వ్యవస్థను సరళీకృతం చేసి, పన్ను విధానంపై ఉన్న గందరగోళాన్ని తగ్గించడానికి ఉపయోగపడనున్నాయి. అయితే పశ్చిమ బెంగాల్ వంటి కొన్ని రాష్ట్రాలు 40శాం పన్ను పరిమితిని మరింత పెంచాలని కోరాయి. కానీ అధికారులు ఇది చట్టపరమైన సవరణలను కోరుతుందని, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. Modi’s Government GST reduction.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో జీఎస్టీ వ్యవస్థను పూర్తిగా పునఃపరిశీలించే అవకాశం ఉంది. వివిధ పన్ను శ్లాబ్‌లను కేవలం రెండు ప్రధాన శ్లాబ్లుగా ఏకీకృతం చేయాలని కౌన్సిల్ భావిస్తోంది. కొన్ని విలాసవంతమైన వస్తువులపై 40శాతం పన్ను కొనసాగించవచ్చు. 8ఏళ్ల క్రితం జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి పన్ను వ్యవస్థను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, వినియోగదారులకు, ప్రభుత్వానికి ప్రయోజనం కలిగేలా సమతుల్యం చేయడానికి ఈ సమావేశం ఒక ముఖ్యమైన వేదిక కానుంది. ఈ నిర్ణయాలన్నీ అమలైతే, ప్రజలకు ధరల భారం తగ్గే అవకాశం ఉంది.
Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q