భార‌త్‌-పాక్ మ్యాచ్‌టిక్కెట్ ఎంతో తెలిస్తే షాక్..!

Asia Cup India Pakistan Match: భార‌త్‌- పాకిస్తాన్ మ‌ధ్య క్రికెట్ యుద్ధానికి రంగం సిద్ధమవుతుంది. ఆసియాక‌ప్‌- 2025లో భాగంగా దుబాయ్ వేదిక‌గా సెప్టెంబ‌ర్ 14వ తేదీన ప్రత్యర్థులు తాడోపేడో తెల్చుకోనున్నారు. ఈ దాయుదుల పోరు కోసం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌ను చాలా మంది ఫ్యాన్స్ స్టేడియానికి వెళ్లి చూసేందుకే ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దీంతో భార‌త్‌- పాక్ మ్యాచ్ క్రేజుని బ్లాక్ మార్కెట్లు సొమ్ము చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ దాయాదుల పోరుకు సంబంధించి బ్లాక్ మార్కెట్‌లో ఒక్కో టిక్కెట్ ధ‌ర‌ ఏకంగా రూ.15.75 లక్షలు ప‌లికిన‌ట్లు సమాచారం.

అయితే, ఇండియా- పాక్ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్ల అమ్మకాలను ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఒక‌ట్రెండు రోజుల్లో టిక్కెట్లు విక్రయించే ఛాన్స్ ఉంది. కానీ, కొన్ని థ‌ర్డ్ పార్టీ వెబ్‌సైట్‌లు మాత్రం క‌చ్చితంగా టిక్కెట్లు ఇస్తామ‌ని ఫ్యాన్స్ నుంచి అందినకాడికి దోచేసే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక, ఇదే విష‌యంపై ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు సైతం రియాక్ట్ అయింది..

ఇక, ఆసియాక‌ప్ టిక్కెట్లను ఇంకా విడుదల చేయలేదు.. రెండు రోజుల్లో అమ్మకం స్టార్ట్ చేస్తాం.. ఫ్యాన్స్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే టిక్కెట్లు కొనుగోలు చేసుకోవాలని సూచిస్తుంది. థ‌ర్డ్ పార్టీ వెబ్‌సైట్లలో టికెట్లను కొని మోసపోవద్దని ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఆసియాక‌ప్‌లో భార‌త్‌-పాక్ జ‌ట్లు 3 సార్లు పోటీ పడనున్నాయి. ఈ రెండు జట్లే ఫైనల్‌కి వెళితే సెప్టెంబర్ 28న మరోసారి భార‌త్‌, పాక్ మ్యాచ్ జ‌ర‌గనుంది. Asia Cup India Pakistan Match.

మ‌రోవైపు పెహల్గమ్ ఉగ్రదాడి తర్వాత భారత్‌-పాక్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తమయ్యా‍యి. దీంతో ఆసియాకప్‌లో పాక్‌తో మ్యాచ్‌ను భారత్ బహిష్కిరించాలనే డిమాండ్లు వస్తున్నాయి.

Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q