
Kadapa District Development: ఎన్నికల ముందు కడప జిల్లాలో పర్యటించిన చంద్రబాబు నాయుడు జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులకు చేయుతున్న కల్పిస్తామన్న వాగ్దానాన్ని నిలబెట్టుకునే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నారా. మాజీ సీఎం సొంత ఇలాగా చంద్రబాబు మార్కు నిలబెట్టుకోగలనున్నారా. వైసిపి నేతలు తప్పుడు ప్రచారానికి చంద్రబాబు నారా లోకేష్ చెక్ పెట్టనున్నారా. రాష్ట్రంలోనే కడప జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందా.. గడిచిన ఐదు సంవత్సరాలలో వైసిపి నేతలు కడప అభివృద్ధి పై దృష్టి సారించలేదా.ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంతో కొప్పర్తికి మహర్దశ పట్టుకుందా. జగన్ హయాంలో కనీసం సొంత జిల్లాను కూడా అభివృద్ధి చేసుకోలేదా.
దివంగత సీఎం రాజశేఖర్రెడ్డి కడప అభివృద్ధిలో తన మార్కు చూపించారట.జగన్ తానే 30 ఏళ్ల పాటు సీఎం అని చెప్పుకున్నారు కానీ సొంత జిల్లా అభివృద్ధిపై తన మార్కు చూపించ లేదట. అందుకే జనం కూడా ఎన్నికల్లో కర్ర కాల్చి వాత పెట్టారట.ఇప్పుడు కడప జిల్లా అభివృద్దికి చంద్రబాబు చర్యలు చేపడుతున్నారట.జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం ఉంది. అయితే ఇకడ రాజకీయ నాయకులకు పర్సంటేజీలు, కంపెనీలలో బలవంతపు వాటా ఇచ్చే అవసరం లేకపోతే పరిశ్రమలు పెద్దఎత్తున ఏర్పాటవుతాయట. వైసీపీ హయాంలో కొప్పర్తి లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే భాగస్వామ్యం అడిగేవారని ఆరోపణలున్నాయట. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇదే ధోరణి కొనసాగుతోందని సమాచారం. దీంతో ఇక్కడ పరిశ్రమల స్థాపనకు ముందుకు రావడం లేదని తెలుస్తోందట. ఇప్పుడు చంద్రబాబు సర్కారు పరిశ్రమల ఏర్పాటు లక్ష్యంగా ఆడుగులు వేస్తోందట. పెద్దఎత్తున పరిశ్రమలు వచ్చేందుకు రాయితీలు ఇస్తోంది. కడప జిల్లా రాజకీయాలపై సీఎం చంద్రబాబు నాయుడుకు మంత్రి నారా లోకేశ్కు అవగాహన ఉందట. అందుకే పరిశ్రమల స్థాపనలో వేలు పెడితే తాటతీస్తామన్న కూటమి నేతలను హెచ్చరించారట. దీంతో ఇప్పుడు పలు పరిశ్రమలు కడప వైపు చూస్తున్నాయట. జిల్లాకు మాత్రమే కాదు రాష్ట్రానికి మణి హారంగా ఉన్న కొప్పర్తి పారిశ్రామికవాడలో ప్రత్యక్షంగా 2400 మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించే విదంగా పరిశ్రమలు మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా ప్రారంభానికి సిద్ధమ పతున్నాయట. Kadapa District Development.
కడప నగర శివారులోని కొప్పర్తి పారిశ్రామిక వాడలో 600 ఎకరాల్లో మెగా ఇండస్ట్రియల్ హజ్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ పలు పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారట.జిల్లాలో అన్ని వసతులు ఉండటంతో పారిశ్రామికవాడలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఔత్సాహికులు వస్తున్నారట.ఇప్పటికే పలువురు పారిశ్రామిక వేత్తలకు భూములు కేటాయించారట. కొందరు ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారట.పరిశ్రమల ఏర్పాటుతో కొప్పర్తికి కళ సంతరించుకుంటోందట. సుమారు రూ.50కోట్ల వ్యయంతో టెక్స్ట్ నో ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ద్వారా దుస్తుల తయారీ, సూటు, ఇతరత్రా తయారుకానున్నాయట.130 కోట్లతో టెక్నోడోమ్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ పరిశ్రమ ప్రారంభించనున్నారు.దీంట్లో ఎస్ఈడీ టీవీలు, ముల్టీమీడియా స్పీకర్లు ఇతర ఆడియోకు సంబంధించిన విబాగా లన్నీ ఇక్కడ తయారవుతాయట.2400 మందికి ఉపాధి కల్పిస్తుందట.విటన్నింటినీ మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా సెప్టెంబర్ 2వ తేదీన ప్రారంభించనున్నారట.ఈ మేరకు జిల్లా అధికారులు ఇప్పటికే ఆఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారట. మరి చూద్దాం కొప్పర్తి పారిశ్రామికవాడలో పరిశ్రమలు ఏర్పడడంతో కడప జిల్లా అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్న లేదా అన్నది మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q