
Tarak’s political entry: కొద్దిరోజులుగా జూనియర్ ఎన్టీఆర్ పేరు సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ తారక్‌పై చేసిన కామెంట్లతో అభిమానులు భగ్గుమన్నారు. సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే ఆ తర్వాత క్షమాపణలు చెప్తారని అందరూ భావించారు. అదీ లేకపోవడంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీకి తగిన బుద్ది చెప్తామని తారక్ ఫ్యాన్స్ వార్నింగ్ ఇచ్చారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీ గురించి ఆయన సోదరి నందమూరి సుహాసిని క్లారిటీ ఇచ్చారు. తారక్ పొలిటికల్ ఎంట్రీ పై సుహాసిని చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
ప్రతి పరిశ్రమలోను వారసత్వం అనేది ఉంటుంది. అలానే రాజకీయాల్లో కూడా వారసత్వం ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ స్థాపించారు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు. పార్టీ పెట్టిన కొన్ని నెలల వ్యవధిలోనే ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు. ఆ తరువాత ఆ పార్టీకి సంబంధించి ఎన్నో అవకతవకలు జరిగాయి. ఇక ప్రస్తుతం అదే పార్టీకి ముఖ్యమంత్రిగా సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు.
అయితే ఆ పార్టీ ఎన్టీఆర్ ఫ్యామిలీకి సంబంధించింది అని, నారా ఫ్యామిలీది కాదు అని కొన్ని వివాదాలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీని నడిపించి ముందుకు తీసుకు వెళ్లవలసింది జూనియర్ ఎన్టీఆర్ అంటూ కొంతమంది అభిమానులు అంటుంటారు. ఒకప్పుడు ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లో బిజీగా ఉండేవారు.
2009 సంబంధించి ప్రచారం కూడా చేశారు. కానీ ఆ తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరం అయిపోయారు. ఇప్పుడు కూడా పెద్దగా రాజకీయ విషయాలకి స్పందించరు. ఈ తరుణంలో ఎన్టీఆర్ సోదరి నందమూరి సుహాసిని తారక్ పొలిటికల్ ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చారు.
నేను 2018 నుంచి రాజకీయాల్లోనే యాక్టివ్ గానే ఉంటున్నాను. అని చెబుతూ జూనియర్ ఎన్టీఆర్ గురించి స్పందించారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో బిజీగా ఉన్నారు. తప్పకుండా అవకాశం కలిగినప్పుడు ఆయనే ఎంట్రీ ఇస్తారు అంటూ సుహాసిని ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం పైన క్లారిటీ ఇచ్చారు. మరోవైపు ఏ సభ జరిగిన కూడా ఎన్టీఆర్ అభిమానులు సీఎం అని అరుస్తుంటారు. ఇక రీసెంట్ గా అనంతపూర్ ఎమ్మెల్యే ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి. పెద్ద ఎత్తున ఎన్టీఆర్ అభిమానులంతా కూడా ర్యాలీలు కూడా చేశారు. Tarak’s political entry.
తెలుగుదేశం పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడల్లా నేను ఉన్నాను అంటూ, కార్యకర్తలు అందరికీ భరోసా ఇస్తూ ముందుకెళ్లారు. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా గాని, మహిళలకు ఎప్పుడూ అండగా ఉండి, వాళ్లకు కండక్టర్లుగా కూడా అవకాశం కలిగించారు. అలానే రాజ్యసభలో కూడా తెలుగులోనే మాట్లాడి, తెలుగు వాళ్లకి గుర్తింపు ఉండాలి అని తెలుగులో అడిగారు. నందమూరి తారక రామారావు గారికి హరికృష్ణ గారు ఎప్పుడు తోడుగా ఉన్నారు. అలాంటి కొడుకు ఎవరూ ఉండరు. అలానే అలాంటి నాన్నగారు ఎవరికి ఉండరు అంటూ తన తండ్రి హరికృష్ణ వర్థంతి సందర్భంగా మాట్లాడారు.
Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q