
Neha Shetty In ‘OG’: హీరోయిన్స్ గా రాణించి ఆ తర్వాత సైలెంట్ అయిన ముద్దుగుమ్మలు మన దగ్గర చాలా మంది ఉన్నారు. అలాగే టాలీవుడ్ లో హీరోయిన్స్ గా మెప్పించి.. ఆ తర్వాత అవకాశాలు తగ్గి స్పెషల్ సాంగ్ లో మెరుస్తున్న భామలు చాలా మందే ఉన్నారు .. అటు ఓవర్ నైట్ లో స్టార్ డమ్ తెచ్చుకున్న హీరోయిన్స్ కూడా ఉన్నారు. ఇక చాలా మంది స్టార్ హీరోయిన్స్ ఓ వైపు మెయిన్ లీడ్ గా సినిమాలు చేస్తూనే ఛాన్స్ దొరికితే స్పెషల్ సాంగ్స్ లోనూ అదరగొడుతున్నారు. సమంత, తమన్నా, శ్రీలీల ఇలా చాలా మంది హీరోయిన్స్ స్పెషల్ సాంగ్స్ లోనూ మెరుస్తున్నారు. ఇప్పుడు మరో ముద్దుగుమ్మ కూడా స్పెషల్ సాంగ్ తో అదరగొట్టనుంది. అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న OG సినిమాలో. పవన్ పక్కన చిందేసే ఛాన్స్ కొట్టిసిన ఆ లక్కీ హీరోయిన్ ఎవరు?
‘ ఓజీ ’. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాపై భారీ అంచనాలున్నాయి. దసరా కానుకగా సెప్టెంబర్ 25న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు వచ్చిన ఫస్ట్ లుక్స్, గ్లింప్స్, టీజర్, సింగిల్స్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇందులో నటించిన నటీనటులు కూడా ఎక్కడికి వెళ్లినా హైప్ ఇచ్చేలా సంగతులు చెబుతుండటంతో ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్‌తో పాటు ఆడియన్స్ ఆసక్తిగా ఉన్నారు.
‘ఓజీ’ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ క్రేజ్ మధ్య మరో హాట్ బ్యూటీ రంగప్రవేశం చేయనుందనే వార్త హల్చల్ చేస్తోంది. డీజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిన నేహా శెట్టి ఓజీ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ షాప్ ఈవెంట్లో పాల్గొన్న నేహా శెట్టి ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే ఏ పాత్రలో నటిస్తోందన్నది మాత్రమే వెల్లడించలేదు. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఇందులో నేహా.. ఐటెమ్ సాంగ్‌లో పవన్ తో కలిసి స్టెప్పులేయడమే కాకుండా ఓ చిన్న క్యారెక్టర్లోనూ మెరవనుందట. ‘ఓజీ’లో చాలా చిన్న పాత్రలో నటిస్తున్నా తన కెరీర్‌కి ఇది టర్నింగ్ పాయింట్ అవుతుందని ఈ హాట్ బ్యూటీ అనుకుంటోందట.
కర్ణాటకలోని మంగళూరుకు చెందిన నేహా శెట్టి 2014లో మిస్ మంగళూరు టైటిల్ గెలుచుకుని మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. 2015లో మిస్ సౌతిండియా పోటీలో రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత 2016లో కన్నడ సినిమా ‘ముంగారు మలే 2’తో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన తనయుడు హీరోగా వచ్చిన ‘మెహబూబా’ చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కోసం తెలుగు కూడా నేర్చుకుంది. ఆ చిత్రం ఫ్లాఫ్ కావడంతో ఆమెకు అవకాశాలు పెద్దగా రాలేదు. Neha Shetty In ‘OG’.
దీంతో కాస్త గ్యాప్ తీసుకుని న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో యాక్టింగ్ కోర్సు చేసింది. ఆ తర్వాత తెలుగులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, గల్లీ రౌడీ చిత్రాల్లో నటించింది. 2022లో వచ్చిన ‘డీజే టిల్లు’తో ఆమె కెరీర్న్ టర్న్ అయింది. అందం, అభినయంతో రాధిక పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అలరించింది. ఆ తర్వాత విశ్వక్ సేన్ సరసన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లోనూ ఛాన్స్ దక్కించుకుంది. ప్రస్తుతం సరైన అవకాశాలు లేని నేహా శెట్టికి ‘ఓజీ’తో గోల్డెన్ డేస్ వస్తాయేమో చూడాలి.
Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q