
Megastar as Prabhas’ father: మెగాస్టార్ చిరంజీవి 70 ఏళ్ళ వయసులోనూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ అనే సోషియో ఫాంటసీ మూవీలో నటిస్తోన్న ఆయన.. అనిల్ రావిపూడి డైరెక్షన్లో ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా చేస్తున్నారు . ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది. అలాగే బాబీతో ‘మెగా 158’, శ్రీకాంత్ ఓదెలతో ‘మెగా 159’ ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. ఇన్ని ప్రాజెక్టులు లైన్లో ఉన్న మెగాస్టార్.. ఇప్పుడు ప్రభాస్ సినిమాలో నటిస్తున్నారట. అది కూడా డార్లింగ్ కి తండ్రి పాత్రల్లో కనిపించబోతున్నట్లు ఓ న్యూస్ బయటికొచ్చింది.
మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ ప్రభాస్ ఇద్దరినీ ఒకే ఫ్రేమ్ లో చూపించాలని ప్లాన్ చేస్తున్నారట డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఆయన ఏ ప్రెస్మీట్లో పాల్గొన్నా, మీ అభిమాన హీరో ఎవరంటే.. వెంటనే మెగాస్టార్ చిరంజీవి అని చెబుతారు. దీన్ని గమనించిన ఫ్యాన్స్ మెగాస్టార్‌తో ఒక్క సినిమా ప్లాన్ చెయ్ అంటూ.. రోజూ సోషల్ మీడియాలో సందీప్‌కు రిక్వెస్ట్‌లు పెడుతుంటారు. అయితే ఇప్పుడు అదే నిజం అయ్యేలా కనిపిస్తోంది. మెగాస్టార్ తో ఫుల్ ఫ్లెడ్జ్ గా సినిమా కాకపోయినా ఆయన కోసం ఓ గెస్ట్ రోల్ ని వంగా ప్రిపేర్ చేసాడట.
మ్యాటర్ ఏంటంటే.. ప్రభాస్ – సందీప్ వంగా కాంబోలో తెరకెక్కనున్న స్పిరిట్ మూవీలో మెగాస్టార్ చిరంజీవి ఓ గెస్ట్ రోల్ చేయబోతున్నారని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ‘యానిమల్’లో బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ ఎలా అయితే హైలైట్ అయిందో. ‘స్పిరిట్’లోనూ అంతకు మించేలా చిరంజీవికి పాత్రని వంగా డిజైన్ చేసాడని అంటున్నారు. ఈ వార్తలో ఎంత నిజం ఉందనేది తెలియదు కానీ, ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్‌లో అయితే ఇదే హాట్ టాపిక్‌గా మారింది. Megastar as Prabhas’ father.
సందీప్ రెడ్డి వంగ ఇటీవలే ‘స్పిరిట్’ సినిమాలో ప్రభాస్ తండ్రి పాత్రకు మెగాస్టార్ చిరంజీవిని సంప్రదించినట్లుగా ప్రచారం నడుస్తుంది. ఈ రోల్ చిరు హీరోయిజం ఉట్టిపడేలా ఉంటుందని ప్రచారం జరుగుతుంది. అయితే చిత్రయూనిట్ నుంచి మాత్రం దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ ఇది నిజమై, చిరంజీవి ఇందులో నటిస్తే మాత్రం ఇండస్ట్రీ రికార్డులు బద్దలవ్వాల్సిందేనని మూవీ లవర్స్ అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..
Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q