
Government General Hospital Eluru: ఏలూరు సర్వజన ఆసుపత్రి, ఒకప్పుడు ఉభయ గోదావరి గోదావరి జిల్లాలో ఎంతో గొప్ప పెరు గడించిన ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో వైద్యం అందని అగమ్యగోచరంగా మారిందని ఆరోపిస్తున్నారు. వేలకి వేలు కార్పొరేట్ ఆసుపత్రులకు చెల్లించి వైద్యం చేయించులేక.. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వైద్యం పై ఆదరపడతారు ఉమ్మడి జిల్లా ప్రజలు. ఇప్పుడు వైద్యం అందక రోగులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.. పేద రోగులకు శాపంగా మారిన ఏలూరు సర్వజన ఆసుపత్రి పై మెగా 9 స్పెషల్ రిపోర్ట్
ఏలారు జిల్లా కేంద్రంలో ఉన్న సర్వజన ఆసుపత్రికి జిల్లా నలుమూల నుంచి నిత్యం రెండువేల మందికి పైగా రోగులు వైద్యం కోసం వస్తూ ఉంటారు. ఒకప్పుడు 400 పడకల కలిగి ఉన్న జిల్లా ఆసుపత్రిని మెడికల్ కాలేజీ గా మార్చారు. మెడికల్ కాలేజీ గా మారిన తర్వాత ఆసుపత్రి అభివృద్ధి చెందుతుంది ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందుతుందని భావించిన రోగులకు మాత్రం సర్వజన ఆసుపత్రి శాపంగా మారిందని ఆరోపిస్తున్నారు. వైద్యం కోసం ఆసుపత్రికి వస్తున్న రోగులకు సరైన వైద్యం అందని పరిస్థితి ఈ ఆసుపత్రిలో నెలకొన్నది..అనారోగ్యంతో ఆసుపత్రికి వస్తున్నా రోగులకు అక్కడ వైద్యులు చుక్కలు చూపిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఐదేళ్ల వైసిపి పాలనలో సర్వజన ఆస్పత్రిని పట్టించుకునే నాధుడే లేడని రెండేళ్ల పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న మాజీ మంత్రి ఆళ్ల నాని సొంత నియోజకవర్గంలో ఉన్న ఆసుపత్రి అభివృద్ధిని గాలికి వదిలేసారని అప్పట్లో విమర్శలు గట్టిగానే వినిపించాయి..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆసుపత్రి అభివృద్ధి చెందుతుందని భావించినప్పటికీ ఏలూరు సర్వజన ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలపై ఇంకా ప్రభుత్వం దృష్టి సారించలేదు. రోగులకు వైద్య సేవలనుంచే వైద్యుల కొరత ఈ ఆసుపత్రిలో తీవ్రంగా ఉన్నప్పటికీ వైద్య ఆరోగ్య శాఖకు పట్టనట్లు వ్యవహరిస్తోందిని మండిపడుతున్నారు రోగులు. సరోజన ఆసుపత్రిలో ఇతర విభాగాల్లో పనిచేసేందుకు వందమంది డాక్టర్ల వరకు అవసరం ప్రస్తుతం అందులో సగం మంది డాక్టర్లు కూడా లేని పరిస్థితి.. ప్రతిరోజు వెయ్యికి పైగా ఓపీలు వస్తూ ఉంటాయి.ఓపిరాయించుకుని వైద్యం చేయించుకునేందుకు వస్తున్న రోగులకు తమ రోగాన్ని నయం చేసే వైద్యుడు లేక ఉన్న వైద్యులతో గంటల తరబడి లైన్ లో నిలబడి వైద్యం చేయించుకుని తమకు వచ్చిన రోగం నయం అవుతుందో లేదో తెలియక వెనుతిరిగి వెళ్ళిపోతున్నారు.. జిల్లా సర్వజన ఆసుపత్రిలో ముఖ్యమైన గుండె కిడ్నీ వంటి వ్యాధులను చూసే వైద్యులు ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం..
ఇదిలా ఉండగా యాక్సిడెండ్,ఎమెర్జెన్సీ కేసులు గాని ఏ చిన్న సమస్యతో ఆసుపత్రికి వస్తే అక్కడి వైద్యులు కనీసం రోగి పరిస్థితిని కూడా చూడకుండా విజయవాడ,గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రులకు రిఫరల్ చేస్తున్నారు .. బ్రెయిన్ స్ట్రోక్ కార్డియాటిక్ అత్యవసర కేసులను రెఫర్లు చేయడం వల్ల మార్గమధ్యలోనే చాలా మరణాలు సంభవిస్తున్నాయి . జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు సైతం జిల్లా ఆసుపత్రిలో రోగులకు సరైన వైద్యం అందడం లేదని, వైద్యం చేసేందుకు డాక్టర్ లు కుడా అందుబాటులో లేరని ఆస్పత్రి చైర్మన్గా ఉన్న కలెక్టర్ కు పిర్యాదు కూడా చేశారట… Government General Hospital Eluru.

ఇంకా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి విభాగానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. 2014 నుంచి 19 వరకు జిల్లా ప్రసూతి ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు మెరుగైన వైద్య సేవలు అందించేవారు.. అయితే గత ఐదు సంవత్సరాల నుంచి ప్రసూతి వైద్యశాలలో గర్భిణీ స్త్రీలు వైద్యం పొందాలంటేనే భయపడిపోతున్నారు.. ప్రస్తుతం ప్రసూతి ఆసుపత్రిలో 150 మంది వరకు గర్భిణీలు ఓపి సేవలు పొందెందుకు వస్తూ ఉంటారు ప్రతిరోజు 15 పైగా ప్రసవాలు జరుగుతుంటాయి.. ఆపరేషన్ చేయించుకున్న గర్భిణి స్త్రీలు కుట్లు పగిలిపోయి ఇన్ఫెక్షన్ సోకి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.. నెలల తరబడి ఆసుపత్రిలోనే వైద్యం పొందుతూ ఉండే పరిస్థితి ఏర్పడింది.. గర్భిణీ స్త్రీలకు ఎందుకు కుట్లు పగిలిపోతున్నాయి ఇన్ఫెక్షన్ ఎందుకు సోగుతుంది అని నిర్ధారణకు కూడా వైద్యులు రావడం లేదు.. పెద్దపెద్ద కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి లక్షల్లో డబ్బులు పోసి వైద్యం పొందలేని గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ ఆసుపత్రినే నమ్ముకుని వస్తుంటే వారికి సరైన వైద్యం అందించకుండా నరకాన్ని చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. డాక్టర్ల కొరత వల్ల కింద సాయి సిబ్బందితో గర్భిణీ స్త్రీలకు కుట్లు వేయించడం తరచూ డాక్టర్లు గర్భిణీ స్త్రీలను అబ్జర్వేషన్ చేయకపోవడం కింద స్థాయి సిబ్బంది గర్భిణీ స్త్రీలకు వైద్యం చేయడం వల్ల ఆపరేషన్ ఫెయిల్ అయ్యి కుట్లు పగిలి మళ్లీ ప్రైవేట్ ఆస్పత్రి వైపుకు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ చేయడానికి ఇప్పటివరకు కనీసం రేడియాలజిస్ట్ని నియమించలేని పరిస్థితిలో ఉంది ఈ సర్వజన ఆసుపత్రి
ఆసుపత్రిలో రోగులకు నిర్వహించాల్సిన స్కానింగ్ , ఇతర పరీక్షలు బయట ల్యాబ్ లకు పంపిస్తున్నారని , వాటి వల్ల పేదలు అదనంగా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది అని అంటున్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా పట్టించుకుని ఏలూరు సర్వజన ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా లో పలువురు కోరుతున్నారు..