నేను ట్రెండ్ ఫాలో అవ్వను సెట్ చేస్తాను.!

Deputy CM Pawan Kalyan: జనసేన అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాలనలో వడివడిగా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వంలో నెంబర్ 2 గా ఉన్న పవన్ పాలనలో కూడా తనదైన ముద్ర వేస్తున్నారు. అభివృద్ధి దిశగా ఏపీని నడిపే ప్రయత్నం చేస్తున్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ తన బాధ్యతల్ని పర్ ఫెక్ట్ గా నిర్వహిస్తున్నారు. పవన్ కల్యాణ్ తనకు కేటయించిన అటవీ , పంచాయతీరాజ్, పర్యావరణ శాఖల విషయంలో తనదైన ముద్ర వేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ పాలన పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. జనసేన అధినేతగా మారుమూల గ్రామాల సమస్యలపై గళం విప్పిన పవన్, ఇప్పుడు అధికారంలోనూ అదే తరహలో పనిచేస్తున్నారు. ముఖ్యంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖల్లో అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు.

‘పల్లె పండుగ’, మినీ గోకులాలు, పంట కుంటలు లాంటి కార్యక్రమాలతో పవన్ పేరు పల్లెల్లో మారుమోగింది. చిన్నచిన్న మార్పులతో పెద్ద ఫలితాలు తీసుకురావడంలో పవన్ సక్సెస్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి నిధులు తీసుకురావటంలో కూడా పవన్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. అడవి ఏనుగుల దాడులతో ఇబ్బందులు పడుతున్న ఏపీ రైతులకు ఇక ఊరట కలిగించేందుకు కర్ణాటక నుండి కుంకీ ఏనుగులు తీసుకువచ్చారు పవన్. గత ప్రభుత్వాలు సాధించలేని దాన్ని పవన్ చేసి చూపించారు.

ప‌ల్లె పండుగ కార్య‌క్ర‌మం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 4,500 కోట్ల నిధుల‌తో 30,000 పనులు చేపట్టింది. ఈ ప‌నుల‌లో 3,000 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, 500 కిలోమీటర్ల తారు రోడ్లు, వ్యవసాయ కుంటలు, పశువుల శాలలు, ఇంకుడు గుంతల నిర్మాణం వంటి అనేక‌ అభివృద్ధి పనులను ఉన్నాయి..

గ్రామాల్లోవ్యవసాయానికి అనుబంధంగా రైతులు పశుపోషణ పై ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. అలాంటి వారికి అండగా ఉడేందుకు ఏపీ ప్రభుత్వం మినీ గోకులాలను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్ర వ్యాప్తగా 12,500 గోకులాలను డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం వేదికగా ప్రారంభించారు. పాడి రైతులకు ఎంతో అవసరమయ్యే గోకులాలను గత ఐదేళ్ల వైసీపీ పాలనలో కేవలం 268 నిర్మిస్తే కూటమి ప్రభుత్వం కేవలం ఆరు నెలల కాలంలోనే 12,500 నిర్మించింది. ఇది కూటమి ప్రభుత్వం మరియు పవన్ కళ్యాణ్ నిబద్ధతకు నిదర్శనం.

ఇటీవల కాలంలో జనావాసాల్లోకి వస్తున్న వన్య ప్రాణుల సంఖ్య పెరుగుతుంది. ప్రధానంగా ఉమ్మడి చిత్తూరు, పార్వతీపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏనుగులు జనావాసాల్లోకి రావడం ఎక్కువగా జరుగుతుంది. ఇలా ఏనుగులు గుంపులు గుంపులుగా జనావాసాల్లోకి రావడం, పంటలు నాశనం చేయడం చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రజలకు ప్రాణహాని కలిగిస్తుంటాయి. ఈ సమయంలో అలాంటి ఏనుగులను తిరిగి అడవుల్లోకి తరిమేందుకు అటవీ శాఖ ప్రయత్నిస్తున్నా, సత్ఫలితాలు వచ్చేవి కాదు . ఈ నేపథ్యంలోనే ఆ సమస్యకు సరైన పరిష్కారం చూపడానికే కుంకీ ఏనుగులు అవసరం అని అధికారులు పవన్ కి చెప్పడం, దీంతో ఆయన వెంటనే రియాక్ట్ అవ్వడం, కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఈ కుంకీ ఏనుగులను తెప్పించారు. వీటితో ఏపీ రైతులకు ఊరట కలిగించారు పవన్ కల్యాణ్. గత ప్రభుత్వాలు సాధించలేని దాన్ని పవన్ చేసి చూపించారు.

ఇక అటవీ భూముల ఆక్రమణలపై పవన్ తీసుకున్న చర్యలు మరింత చర్చకు దారి తీసాయి. వైసీపీ నేత పెద్దిరెడ్డి, సజ్జల కుటుంబ భూవివాదాలు ఆయనే స్వయంగా స్పందించిన తీరు చూసి ప్రతిపక్ష నేతలు వనికిపోయారు. అధికారం ఉంది కదా అని అక్రమాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టనని గతంలో చెప్పిన పవన్ ఇప్పుడు వారి లెక్కలు తేల్చే పనిలో పడ్డారు. Deputy CM Pawan Kalyan.

పవన్‌కల్యాణ్‌ తన శాఖ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సారి గ్రామ సభల్ని నిర్వహించి రికార్డు సృష్టించేలా చేశారు. గ్రామంలోని ప్రజలందరూ భాగస్వాములయ్యేలా చేశారు. సమస్యలను అధికారుల, ప్రజాప్రతినిధుల దృష్టికి వచ్చేలా చేశారు. అలాగే పంచాయతీలకు నిధులు విడుదల చేయటం .పారిశుద్ధ్యం, వ్యర్ధాల నిర్శహణ పై దృష్ఠి పెట్టారు, వేల కోట్లు నిధులు కేటాయించి పల్లెల్లో అభివృద్ధి కారక్యక్రమాలను ప్రారంభించారు. రోడ్లు కూడా లేని గిరిజ గ్రామలపై ఫోకస్ పెట్టి తల్లిబాట కార్యక్రమం ద్వారా రోడ్లు వేయిస్తున్నారు. గిరిజన గ్రామాల పట్ల పవన్ కళ్యాణ్ చూపుతున్న శ్రద్ధ, సానుభూతి ప్రజల్లో విశేష స్పందన వచ్చింది. పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా రికార్డ్ స్థాయలో పల్లెబాట ద్వారా గ్రామాల్లో 3 వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేయించారు.

రాష్ట్రానికి సుస్థిర పాలన అందించేందుకు ప్రస్తుత ఎన్డీయే కూటమి కనీసం 15 ఏళ్ల పాటు కొనసాగాల్సిన అవసరం ఉందని పదే పదే చెప్పే పవన్ ఆదిశగా అడుగులు వేస్తున్నారు.

Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q