13 ఏళ్ళ తర్వాత తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్..!

Parvati Melton Pregnancy: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్ ‘జల్సా’ సినిమాతో పార్వతి మెల్టన్ టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రంలో ఇలియానాతో కలిసి స్క్రీన్ షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఆ తర్వాత ఆమెకు సరైన అవకాశాలు రాలేదు. మహేష్ బాబు ‘దూకుడు’ చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ లో మాత్రమే కనిపించి, నెమ్మదిగా సినిమాలకు దూరమైపోయింది.

2005లో ‘వెన్నెల’ సినిమాతో తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఫస్ట్ మూవీతోనే తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఆ తర్వాత గేమ్, మధుమాసం, అల్లరి అల్లరి వంటి చిత్రాల్లోనూ నటించి, తక్కువకాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నా స్టార్ స్టేటస్ ను మాత్రం అందుకోలేకపోయింది.

2012లో ‘యమహో యమ’ అనే సినిమాతో చివరిసారిగా తెరపై కనిపించిన ఆమె, అదే సంవత్సరంలో అమెరికాకు చెందిన వ్యాపారవేత్త షంసు లాలానీను వివాహం చేసుకొని, నటనా జీవితానికి గుడ్‌బై చెప్పారు.ఇప్పుడు, దాదాపు 13 ఏళ్ల తర్వాత, పార్వతి మెల్టన్ తన జీవితంలో మరో మధుర ఘట్టాన్ని ప్రారంభించబోతోంది. ఇటీవల ఆమె గర్భవతిగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, తల్లి కాబోతున్న విషయాన్ని తెలియజేశారు. Parvati Melton Pregnancy.

కాన్సెప్ట్ బేస్డ్ ఫోటోషూట్లతో ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పార్వతి.. తాజాగా బేబీ బంప్‌తో కనిపించిన ఫోటోలు షేర్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.ఈ ఫోటోలు చూసిన అభిమానులు, సినీ వర్గాలు, సన్నిహితులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. “కాబోయే తల్లి”గా పార్వతికి పెద్ద ఎత్తున విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.