
Jubilee Hills By Election: హైదరాబాద్‌లోని కీలక నియోజకవర్గం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు రంగం రెడీ అవుతోంది. బీఆర్ ఎస్ నాయకుడు మాగుంట గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక, ఇక్కడ నుంచి ఎవరు పోటీ చేస్తారు? ఎవరు గెలుస్తారు? రాజకీయ పోరు ఎలా ఉంటుందన్నది పక్కన పెడితే.. కేంద్ర ఎన్నికల సంఘం తాజాగాదీనిపై కీలక అప్డేట్ ప్రకటించింది. ఈ నియోజకవర్గంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు? ఎన్ని పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి? ఒకవేళ ఓటరు జాబితాలో పేరు లేకపోతే..ఏంచేయాలి? కొత్తగా నమోదైన ఓటర్లకు అవకాశం.. ఇలా అనేక విషయాలతో తాజాగా సర్క్యులర్ జారీ చేసింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక నిర్వహణకపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు పూర్తి చేస్తోంది. అక్టోబర్ లో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో- ఓటర్ల జాబితా పునః సమీక్ష, మార్పులు- చేర్పులు, ఓటింగ్ ప్రక్రియ, పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు వంటి చర్యలపై ఫోకస్ పెట్టింది. . నవంబర్ లో అక్టోబర్ చివరివారం/నవంబర్ లో పోలింగ్ నిర్వహించే ఛాన్స్ లేకపోలేదు.
శాసన సభ్యుడు మాగంటి గోపీనాథ్ కన్నుమూత వల్ల ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అవసరమైన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్ లో ఆయన తుదిశ్వాస విడిచారు. ఖాళీ అయిన ఈ స్థానాన్ని దక్కించుకోవడానికి మూడు పార్టీలు రంగంలోకి దిగాయి. దీన్ని నిలబెట్టుకోవడానికి బీఆర్ఎస్, తమ ఖాతాలో వేసుకోవడానికి అధికార కాంగ్రెస్ తో పాటు బీజేపీ వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంది.
ఈ పరిస్థితుల మధ్య తాజాగా ఈసీ ఆదేశాలు ఇచ్చింది. ఈ ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకుని ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులపై కసరత్తు పూర్తి చేస్తోంది. దీనికి సంబంధించిన తేదీలను వెల్లడించింది. పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ ప్రక్రియ కిందటి నెల 28వ తేదీన ఆరంభమైంది. త్వరలో దీన్ని పూర్తి చేయనుంది. ఇక మరోవైపు ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురింది.
కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారిక వెబ్ సైట్ లో ఈ ఓటర్ల జాబితా అందుబాటులోకి వచ్చింది. ఈ జాబితాకు సంబంధించి అభ్యంతరాలు, ఫిర్యాదులను ఏవైనా ఉంటే ఈ నెల 17వ తేదీ వరకు స్వీకరిస్తారు. స్వీకరించిన అభ్యంతరాలు, ఫిర్యాదుల పరిష్కారం ఈ నెల 25వ తేదీ నాటికి పూర్తవుతుంది.
చివరిగా- తుది ఓటర్ల జాబితాను ఈ నెల 30వ తేదీన ప్రింట్ చేయనున్నారు.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3,92,669 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,04,288 మంది పురుషులు కాగా, 1,88,356 మంది మహిళలు. ఇతరుల కేటగిరీలో 25 మంది ఓటర్లు నమోదయ్యారు. నియోజకవర్గంలో 407 పోలింగ్ స్టేషన్లు 139 వేర్వేరు భవనాల్లో ఏర్పాటు చేయబడ్డాయి. ఇది పూర్తయిన తర్వాత షెడ్యూల్ వెలువడుతుంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే దీన్నీ నిర్వహించనుంది ఈసీ. Jubilee Hills By Election.
ఇక, తాజాగా ఎన్నికల సంఘం ఇచ్చిన వివరాలు.. కొత్త ఓటర్ల నమోదుకు ఇచ్చిన గడువును పరిశీలిస్తే.. ఎన్నికల ప్రక్రియ దాదాపు ప్రారంభమైందనే అధికారులు చెబుతున్నారు. మరో 50-60 రోజుల్లోనే ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. సాధారణంగా కొత్త ఓటర్ల నమోదు.. ఉన్నవారి పేర్లు, ఊర్లు మార్పు వంటివి ప్రతి ఎన్నికలకు 50 రోజుల ముందు చేపడతారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప పోరుకు సంబంధించి తాజాగా ఎన్నికల సంఘం ఇచ్చిన సర్క్యులర్‌ను బట్టి.. మరో 50-60 రోజుల్లోనే ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. దీంతో రాజకీయ సందడి ఓ రేంజ్‌లో మొదలు కానుంది.
Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q