అనంత టీడీపీ అధ్యక్ష పదవి ఎవరికి.?

Anantapur District TDP President: పార్టీ అధికారంలో ఉండటంతో ఆ పదవికి యమ క్రేజ్ వచ్చింది. పదవి వస్తె జిల్లా పార్టీ మొత్తం తమ చేతుల్లో ఉంటుంది అన్న ఆశ.. ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఏమాత్రం తీసిపోని విధంగా ఆ పదవి ఉంటుంది. నిన్నటి వరకు నామినేటెడ్ పై ఆశలు పెట్టుకొని నిరాశ చెందిన వారంతా… ఇప్పుడు ఆ పదవి పై గురి పెట్టారు. ఇంతకీ ఆ పదవి కోసం రేసులో ఉన్నదెవరు..? అధిష్టానం మదిలో ఉన్నదెవరు..? కుల సమీకరణలకు కు ప్రాధాన్యం ఇస్తారా..? లేక విధేయతకు పట్టం కడుతారా..? టీడీపీ నేతలను అంతగా ఆశ పడుతున్న ఆ పదవి ఏది..?

పార్టీ అధికారంలోకి వచ్చింది..  జిల్లా నేతల్లో ఒక టెంక్షన్… నామినేటెడ్ పోస్టుల కోసం తెలుగుదేశం పార్టీలో ఒక ఉత్కంఠ ఆసక్తి కనిపిస్తోంది. దీని కారణం నిన్నటి మొన్నటి వరకు నామినేటెడ్ పదవులు కోసం ఆశగా ఎదురు చూశారు. అందులో కొంత మందికే మాత్రమే నామినేటెడ్ పదవులు దక్కాయి. పదవులు రాని వారు నిరాశకు గురయ్యారు. ఇప్పుడు జిల్లా పార్టీ కమిటీల నియామకం చేపట్టడంతో నేతల్లో మరోసారి ఆశలు చిగురించాయి. ముఖ్యంగా  అనంతపురం జిల్లాలో ఈ కమిటీల ఎంపిక తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. అనంతపురం జిల్లా కమిటీల ఎంపిక విషయంలో పార్టీ సీరియస్ గా ఫోకస్ పెట్టింది. జిల్లాకు ఒక అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, 7మంది ఉపాధ్యక్షులు, 7మంది కార్యదర్శులు, 7మంది అధికార ప్రతినిధులు ఇలా చాలా పెద్ద లీస్ట్ ఉంటుంది. పార్టీ ప్రతిపక్షంలో ఉంటే.. జిల్లా నేతలతో సమన్వయం చేసుకొని ముందుకు సాగేందుకు సీనియర్ నాయకునికి బాధ్యతలు అప్పగించేవారు. కానీ ఇప్పుడు పార్టీ అధికారంలో ఉండటంతో అధ్యక్ష పదవి చాలా కీలకంగా మారింది.

ప్రస్తుతం జిల్లాలో  చాలా మంది నాయకులు ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు. గడచిన ఎన్నికల్లో  ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ కోసం ప్రయత్నించి నిరాశ చెందిన వారు.. ఎమ్మెల్సీల కోసం ట్రై చేసి నిరాశ చెందిన వారు, చాలా ఏళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్న వారు ఇందులో ఉన్నారు. పార్టీ కోసం అనేక సంవత్సరాలుగా కష్టపడిన తమకు ఏవైనా రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ పదవులైనా ఇస్తారా అంటే అదీ దక్కలేదు. అందుకే ఇప్పుడు అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్నారు.  ప్రస్తుతం పార్టీ అధికారంలో ఉండటంతో అది చాలా కీలకం అని చెప్పాలి. జిల్లాలో ఏ కార్యక్రమం జరిగినా మంత్రుల కంటే ఎక్కువ గౌరవం ఉంటుంది.  అన్ని నియోజకవర్గాల్లో వెళ్లే అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యేలతో పాటు వారికి తగిన గుర్తింపు, ప్రధాన్యత ఉంటుంది. పార్టీ మొత్తం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. పేరుకు పార్టీ పదవైనా దాదాపు క్యాబినెట్ తరహాలో ఉంటుంది. పైగా ఇప్పుడు పార్టీ అధ్యక్షుడిగా రాణిస్తే.. భవిష్యత్ లో మంచి అవకాశాలు దక్కే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఈ పదవిపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు.

శింగనమల నియోజకవర్గానికి చెందిన ఆలం నర్సనాయుడు ముందు వరుసలో ఉన్నారని టాక్ వినిపిస్తుంది. మరో వైపు పార్టీలో సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి కూడా అధ్యక్షా పదవి పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. ముక్యంగా గత ఎన్నికల్లో అనంతపురం స్థానం నుంచి పోటీ చేస్తాడు అనుకున్నారు అని పార్టీ తీసుకున్న నిర్ణయంతో నిరాశ చెందారు. మరోవైపు జిల్లాలో చాలామంది నేతలు ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. వారిలో గడ్డం సుబ్రహ్మణ్యం, జేఎల్ మురళీ, తలారి ఆదినారాయణ  లాంటి వారు కీలకంగా ఉన్నారు. ఈ నియమకాల కోసం త్రీమెన్ కమిటీలను ఏర్పాటు చేశారు. వారు స్వయంగా వచ్చిన దరఖాస్తులు స్వీకరించారు. అధ్యక్ష పదవుల విషయంలో కుల సమీకరణలు కూడా ఉంటాయి అని సమాచారం.   ఆలం నర్సానాయుడుకి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ఇప్పటి వరకు కీలకమైన పదవి ఏదీ ఆయనకు దక్కలేదు. కమూడు దశాబ్ధాలుగా పార్టీ కోసం పని చేస్తున్నారు. శింగనమల ఎస్సీ రిజర్వ్ కావడంతో పోటీ చేసే అవకాశం లేదు. అందుకే ఈసారి నామినేటెడ్ పోస్టు వస్తుందని భావించారు. Anantapur District TDP President.

ఇక మరోవైపు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ప్రస్తుతం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన కూడా రేసులో ఉన్నట్టు ప్రచారంలో ఉంది. కానీ ఆయన అధిష్టానం ముందు ఆయన తన ప్రతిపాదన ఉంచారా లేదా అన్నది తెలియాలి. అడిగారా లేదా అన్నది క్లారిటీ లేదు. ఇక పార్టీలో సీనియర్ లీడర్ గా ఉన్న గడ్డం సుబ్రహ్మణ్యం కూడా రేసులో ఉన్నారు. వీరందరూ కూడా కమ్మసామాజిక వర్గం కావడంతో మైనస్ గా మారే అవకాశం ఉంది. ఇప్పటికే అదే సామాజిక వర్గానికి చెందిన పయ్యావుల కేశవ్ కు మంత్రి గా కొనసాగుతున్నారు. ఈ కుల సమీకరణలో  బలిజ సామాజిక వర్గానికి చెందిన జేఎల్ మురళీకి కూడా రేసులో ఉన్నారు..  రెడ్డికి సామాజిక వర్గం నుంచి.. శింగనమలకు చెందిన రామలింగా రెడ్డి…  బీసీ సామాజిక వర్గం నుంచి తలారి ఆదినారాయణ  రేసులో ఉన్నారు.

ఈ పరిణామాలతో అనంతపురం జిల్లా అధ్యక్ష పదవి ఎంపిక  అధిష్టానానికి కత్తి మీద సాములా తయారైంది. అధిష్టానం మదిలో ఏముంది.. కుల సమీకరణాల బేరీజు వేసుకొని అధ్యక్ష పదవిని ఎంపిక చేస్తారా..  లేక విధేయతకు పట్టం కడతారా అన్న ఉత్కంఠ  కొననసాగుతోంది.

Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q