‘ఓజీ’ రిలీజ్ డేట్ సీక్రెట్.. బాక్సాఫీస్ కి చుక్కలే..!

OG Release Date: ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ చూసిన ‘ఓజీ’ పేరే వినిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఎంటర్టైనర్ పై ప్రేక్షకుల్లో రోజుకో రేంజ్ లో అంచనాలు పెరుగుతున్నాయి. ‘రన్ రాజా రన్’, ‘సాహో’ సినిమాలతో తన డైరెక్షన్ స్కిల్స్ నిరూపించుకున్న సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, భారీ హైప్ మధ్య సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఇదే సమయంలో మొదటగా ‘ఓజీ’కి పోటీగా బాలకృష్ణ నటిస్తున్న ‘అఖండ 2’ కూడా రిలీజ్ కావాల్సి ఉండేది. కానీ, టెక్నికల్ పనుల్లో జాప్యం వల్ల ఆ సినిమా వాయిదా పడింది. దీంతో ఈ దసరాకు ‘ఓజీ’ ఏకైక మెగా రిలీజ్గా థియేటర్లలో దుమ్మురేపనుంది.

ఇది పవన్ సినిమాకి కలిసొచ్చే అవకాశం కావొచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి దసరా పండగను లాంగ్ వీకెండ్ కింద లెక్క వేసుకున్న ‘ఓజీ’ టీం.. భారీ కలెక్షన్లను దృష్టిలో పెట్టుకొని సెప్టెంబర్ 25న సినిమాను విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ రిలీజ్ డేట్ చుట్టూ 8 రోజుల వరుస సెలవులు ఉండటంతో, బాక్సాఫీస్ వద్ద ఓజీ భారీ వసూళ్లు రాబట్టడంఖాయంగా కనిపిస్తోంది.

ఓజీ మూవీ రిలీజ్ డేట్ కు 8 రోజులు కలిసి వస్తుండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సెప్టెంబర్ 25న రిలీజ్ డే, సెప్టెంబర్ 26, 27, 28 వీకెండ్, సెప్టెంబర్ 30న హాలీడే, అక్టోబర్ 1న ఆయుధ పూజా, అక్టోబర్ 2న గాంధీ జయంతితో పాటు విజయ దశమి, అక్టోబర్ 3న తెలంగాణలో సెలవు కావడంతో ఓజీ బాక్సాఫీస్ వసూళ్లకు మంచి ముహూర్తంగా భావించారు. ఇంత మంచి ఛాన్స్ టాలీవుడ్ లో ఇటీవల ఏ సినిమాకు రాలేదనే చెప్పాలి. ఓజీ కంటెంట్ కి ఆడియన్స్ కనెక్ట్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే బాక్సాఫీస్ దగ్గర పవన్ ఊచకోత చూడటం గ్యారెంటీ అని చెప్పొచ్చు. OG Release Date.

ఓజీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, ఫైర్‌స్ట్రామ్ గ్లింప్స్, ‘సువ్వి సువ్వి’ పాట సినిమాపై క్రేజ్‌ని రెట్టింపు చేశాయి. పవన్ బర్త్‌డే సందర్భంగా వచ్చిన తాజా గ్లింప్స్ వీడియో మరింత ఆసక్తికరంగా ఉండటంతో ఫ్యాన్స్ ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. ఈ వీడియోలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ పాత్రను పరిచయం చేస్తూ, అతని మాటల ద్వారా OGకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పించడం వైవిధ్యంగా అనిపించింది. ఆయన విలన్ పాత్ర పవన్ పాత్రకు ఎంతటి పవర్‌ఫుల్ ఛాలెంజ్‌గా నిలుస్తుందో ఈ చిన్న గ్లింప్స్‌తోనే స్పష్టమైంది. ఇక చాలా కాలంగా ఎదురుచూస్తున్న OG ట్రైలర్ కూడా త్వరలో రాబోతుందని టాక్. అందుకే ఫ్యాన్స్‌తో పాటు నార్మల్ ఆడియన్స్ సైతం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q