శిల్పా శెట్టికి భారీ షాక్..!

Shilpa Shetty Case: బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శిల్పాశెట్టికి భారీ షాక్ తగిలింది. ముంబై పోలీసులు శిల్పాకు ఆమె భర్త రాజ్ కుంద్రాకు చుక్కలు చూపిస్తున్నారు. ఓ బిజినెస్‌మెన్‌ని 60 కోట్ల మేరకు మోసం చేశారనే కేసు ఇప్పటికే శిల్పా శెట్టి దంపతులపై నమోదైంది. ఈ కేసునే పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. విచారణలో కూడా స్పీడ్ పెంచారు. అందుకే శిల్పాశెట్టి కపుల్స్ ట్రావెల్ హిస్టరీని అనుక్షణం పరిశీలిస్తున్నారు పోలీసులు. ఈ చీటింగ్ కేసులో ఇప్పటికే ఆ కంపెనీ ఆడిటర్ ను పోలీసులు విచారించారు. అయితే కేసు నుంచి శిల్పాశెట్టి దంపతులు తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీంతో పోలీసులు వారు దేశం విడిచి వెళ్లకుండా వారిపై లుకౌట్ నోటీసలు జారీ చేశారు. ఈ సర్క్యులర్ తో శిల్పా దేశం విడిచి వెళ్లడానికి వీల్లేదు. ఒకవేళ ఈ రూల్స్ ను బ్రేక్ చేస్తే ఇమ్మిగ్రేషన్‌, సరిహద్దు నియంత్రణ పాయింట్ల వద్ద అధికారులు వారిని అరెస్ట్ చేసే వీలుంటుంది. ప్రెజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే త్వరలోనే వీరిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.

నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు ఈ మధ్యకాలంలో తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆర్థిక, వ్యాపారా లావాదేవీలకు సంబంధించి ఈ దంపతులుపై తరచూ కేసులు నమోదవుతున్నాయి. ఒక కేసులో ఇప్పటికే జైలుకు వెళ్లొచ్చాడు రాజ్ కుంద్రా. అయితే అంతా సెట్ అవుతుందని అనుకున్న తరుణంలోనే ఈ కపుల్స్ పై మరో చీటింగ్ కేసు నమోదైంది. ముంబైకి చెందిన ప్రముఖ బిజినెస్‎మెన్ దీపక్ కొఠారి వీరిద్దరిపై Financial Offenses Section లో చీటింగ్ కేసు పెట్టారు. శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా తనను 60 కోట్ల రూపాయల మేర మోసం చేసినట్లు ఫిర్యాదులో తెలిపారు. ఈ చీటింగ్ కేసుతో శిల్పా దంపతులను ముంబై పోలీసులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. వీరిద్దరి విషయంలో పోలీసుల చాలా సీరియస్ గానే ఉన్నారు. కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే వీరిపై తాజాగా లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

దీపక్ కొఠారి తన కంప్లైంట్ లో శిల్పా శెట్టి దంపతులపై సంచలన ఆరోపణలు చేశారు. పదేళ్ల క్రితం రాజేశ్​ ఆర్య అనే వ్యక్తి​ ద్వారా శిల్పా, కుంద్రాతో తనకు పరిచయం ఏర్పడిందని దీపక్ కంప్లైంట్ లో తెలిపారు. అప్పడు వీరిద్దరూ బెస్ట్​ డీల్​ టీవీకి డైరెక్టర్లుగా ఉన్నారని, ఆ కంపెనీలో వీరికి 87 శాతం కంటే ఎక్కువ వాటా ఉందన్నారు. దీంతో 2015లో రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి తన నుంచి 60 కోట్లు తీసుకున్నారని దీపక్ తెలిపారు. ఈ డబ్బుతో తమ బిజినెస్ ను ఎక్స్‎పాండ్ చేసుకుంటామని , తిరిగి డబ్బు చెల్లిస్తామని రాజ్ తనకు హామీ ఇచ్చారని చెప్పారు దీపక్. దీంతో రెండు ఇన్ స్టాల్ మెంట్లలో 60 కోట్లు చెల్లించానని దీపక్ తెలిపారు. 2015 ఏప్రిల్​లో మొదటి విడతగా 31కోట్ల95లక్షలు ఇచ్చానని, అదే సంవత్సరం జులైలో , 2016 మార్చి మధ్యలో 28కోట్ల 54లక్షలు అదనంగా అమౌంట్ ట్రాన్స్ ఫర్ చేశానని దీపక్ కంప్లైంట్ లో మెన్షన్ చేశారు. అలా మొత్తంగా తాను శిల్పా రాజ్ కుంద్రాలకు 60 కోట్ల 48 లక్షలకు పైగా అమౌంట్ ట్రాన్స్ ఫర్ చేశానని తెలిపారు దీపక్. అయితే ఆ డబ్బును బిజినెస్ కోసం వినియోగించకుండా,వారి పర్సనల్ నీడ్స్ కోసం ఈ దంపతులు ఖర్చు చేశారన్నది దీపక్ ప్రధాన ఆరోపణ.

డబ్బు ఇచ్చిన తర్వాత ఓ మీటింగ్ పెట్టి డబ్బును సకాలంలో చెల్లిస్తామని శెట్టి హమీ ఇవ్వడంతోనే తమ మధ్య ఒప్పందం కుదిరినట్లు దీపక్ క్లియర్ గా కంప్లైంట్ లో మెన్షన్ చేశారు. కానీ నెల తర్వాత సెప్టెంబర్ లో శిల్పా శెట్టి కంపెనీ డైరెక్టర్​ పదవికి రాజీనామా చేశారని ఆ వార్త తెలిసి షాక్ అయ్యానని అన్నారు దీపక్. ఆ తర్వాతే ఆ కంపెనీపై కోటీ 28లక్షల రూపాయల దివాలా కేసు బయటపడిందని, ఈ విషయాన్ని బయటకి చెప్పలేదని కంప్లైంట్ లో తెలిపారు. ఇక ఇది జరిగే రెండు రోజుల ముందే ముంబయి బాంద్రాలో ఉన్న పెద్ద రెస్టరంట్‌లలో ఒకటైన బాస్టియన్‌ను క్లోజ్ చేస్తున్నట్లు సోషల్‌ మీడియాలో ఓ న్యూస్ వైరల్‌ అయ్యింది. దీంతో నెట్టింట్లో అనేక కథనాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో స్పందించిన శిల్పా శెట్టి రెస్టారెంట్ మూసేస్తున్నామనే ప్రచారంలో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. దీనిని అక్టోబర్‌లో జుహులో ప్రారంభిస్తామని వివరణ ఇచ్చింది. అలా ఆ రూమర్ కి ఫుల్ స్టాప్ పడింది. Shilpa Shetty Case.

శిల్పా శెట్టి దంపతులపై ఆగస్టు 14న కేసు నమోదు అయ్యింది. ప్రస్తుతం ఈ కేసును ముంబై పోలీసుల ఆర్థిక నేరాల నివారణ విభాగం దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో భాగంగా ఈ దంపతులకు తాజాగా కోర్టు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. దీంతో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా దేశం దాటి వెళ్లడానికి లేదు.ఒకవేళ ప్రయత్నిస్తే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే అయితే తనపై వచ్చిన ఈ ఆరోపణలన్నీ ఫేక అని కోర్టు ద్వారానే సరైన సమాధానం ఇస్తానని రాజ్ కుంద్రా అంటున్నారు. మరి ఈ కేసు శిల్పాను ఎక్కడి వరకు తీసుకెళ్తుందో వెయిట్ అండ్ సీ…