ఎన్టీఆర్ పెన్సిల్ స్కెచ్ ను భారీ రేటుకు కొన్న అభిమాని.!

Buelah Ruby NTR Sketch: టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న ఫ్యాన్ బేస్ కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు. జపాన్, రష్యా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోనూ ఆయనకు విశేషమైన ఆదరణ ఉంది. RRR సినిమాతో తారక్‌కు గ్లోబల్ వైడ్ గుర్తింపు వచ్చింది. దాంతో ఆయన పాన్ ఇండియా రేంజ్‌లో వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే బాలీవుడ్‌లో వార్ 2 చిత్రంతో కనిపించిన ఎన్టీఆర్, హిందీ ఆడియెన్స్‌కి ఎంతో కనెక్ట్ అయ్యాడు.

ఈ సినిమాతో తారక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచాడు. ఇప్పుడు మరోసారి ఆయన పేరు హాట్ టాపిక్ అయింది. అయితే ఈసారి కారణం సినిమా కాదు. ఎన్టీఆర్ మీద ఒక అద్భుతమైన స్కెచ్ పేంటింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, ఆ స్కెచ్ భారీ ధరకు అమ్ముడవడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

బులా రూబీ అనే స్కెచ్ ఆర్టిస్ట్‌, తన పెన్సిల్ ఆర్ట్ లను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ ఉంటుంది. వివిధ తెలుగు సెలబ్రిటీల స్కెచ్‌లు గీసి తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా విక్రయిస్తుంది. ఇటీవలి కాలంలో ఆమె ఎన్టీఆర్ స్కెచ్ గీసి పోస్ట్ చేయగా, అది విపరీతంగా వైరల్ అయింది. ఆ స్కెచ్‌ను ఓ ఎన్టీఆర్ అభిమాని అమెరికా నుంచి సంప్రదించి, ఏకంగా 1650 అమెరికన్ డాలర్లకు (భారత కరెన్సీలో సుమారు రూ. 1.45 లక్షలు) కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా బులా రూబీ తన సోషల్ మీడియా అకౌంట్‌ ద్వారా ప్రకటించింది.

అంతేకాకుండా ఇప్పటి వరకు గీసిన తెలుగు సినీ హీరోల స్కెచ్‌లలో ఎన్టీఆర్ స్కెచ్‌కి వచ్చిన డిమాండ్, మరే స్కెచ్ కి రాలేదని, తన ఆర్ట్ వర్క్ ఇంత ఖరీదుకు అమ్ముడవుతుందని అస్సలు ఊహించలేదని, ఇది తనకు ఒక గొప్ప అనుభూతి అని ఆమె పేర్కొంది. ఈ స్కెచ్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఎన్టీఆర్ అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు. తారక్ మీద ఉన్న అభిమానాన్ని మరోసారి ఈ సంఘటన నిరూపించింది. Buelah Ruby NTR Sketch.

ఇక ఎన్టీఆర్ ప్రస్తుతానికి దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా సినిమా ‘డ్రాగన్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ లో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, టోవినో థామస్, బిజు మీనన్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.