SSMB29 బాక్సాఫీస్ టార్గెట్ ఫిక్స్..!

SSMB 29 Boxoffice Target: సూప‌ర్ స్టార్ మ‌హేష్‌ క‌థానాయ‌కుడిగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్నSSMB29 చిత్రం పాన్ ఇండియా కాదు పాన్ వ‌ర‌ల్డ్ అని నిన్న‌టితో క‌న్ప‌మ్ అయింది. .ఇప్పటివరకు ఇది కేవలం ఊహగా అనిపించినా, ఇటీవల కెన్యా ప్రభుత్వ పెద్దలతో జరిగిన సమావేశంతో ఇది ధృవీకృతమైంది. చిత్ర దర్శకుడు రాజమౌళి, కెన్యా ఉప ప్రధాని ముసాలియా ముదావాదితో భేటీ కావడం ద్వారా ఈ సినిమా గ్లోబల్ ప్రమాణాలపై విడుదల కానుందని అధికారికంగా తేలింది.

ఈ చిత్రం 120 దేశాల్లో విడుదల కానుంది. అంతేకాదు, ఈ ప్రాజెక్ట్ కోసం రాజమౌళి హాలీవుడ్‌కి చెందిన ప్రముఖ ప్రమోషన్, డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీలతో కలిసి పనిచేస్తున్నారు. షూటింగ్ నుండి విడుదల వరకు అంతా గ్లోబల్ స్టాండర్డ్ ప్రకారం ప్లాన్ చేస్తుండటంతో, ఇది భారతీయ సినిమా ఖ్యాతిని మరింతగా పెంచబోతున్న ప్రాజెక్ట్‌గా మారింది.ఈ సినిమా బ‌డ్జెట్ అక్ష‌రాలా 1200 కోట్లు అని తెలిసింది. ఇండియ‌న్ సినిమాల్లో ఇదో రికార్డు. ఇంత వ‌ర‌కూ ఏ భార‌తీయ చిత్రం ఇంత భారీ బ‌డ్జెట్ రూపొంద‌లేదు. దాంతో పాటు, ఈ సినిమా కోసం ఫిక్స్ చేసిన బాక్సాఫీస్ టార్గెట్ ఏకంగా రూ. 10,000 కోట్లు అని ట్రేడ్ వర్గాల్లో బలంగా ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే రాజమౌళి గతంలో తెరకెక్కించిన బాహుబలి రెండు భాగాలు కలిపి సుమారు 2500 కోట్ల వసూళ్లు సాధించగా, RRR సినిమాకు 1300 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. కానీ ఆ సినిమాల బడ్జెట్ రూ. 500 కోట్ల లోపే ఉండేది. అలాంటి రాజమౌళి, ఇప్పుడు రూ. 1200 కోట్లతో రూపొందిస్తున్న ఈ చిత్రం మరింత భారీ విజయం సాధిస్తుందన్న నమ్మకం విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.

ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రచార కార్యక్రమాలు, ప్రీమియర్ షోలు, మీడియా కవరేజ్‌ను పొందేందుకు రాజమౌళి ఇప్పటికే హాలీవుడ్ మార్కెటింగ్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు సమాచారం. ఈ స్థాయిలో వ్యూహాత్మక ప్రమోషన్‌తో ఒక తెలుగు చిత్రం ప్రపంచం మొత్తాన్ని కదిలించబోతోందంటే, ఇది ఇండియన్ సినిమాకు ఒక పెద్ద గర్వకారణం అని చెప్పడంలో సందేహం లేదు. SSMB 29 Boxoffice Target

అడ్వెంచరెస్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ థ్రిల్లర్‌గా సాగనున్న ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడిగా ప్రియాంక చోప్రా నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం షూటింగ్ ఈస్ట్ ఆఫ్రికాలోని కెన్యాలో జరుగుతోంది. అక్కడ అడవుల్లో కొన్ని కీలకమైన యాక్షన్ సీన్స్‌ను చిత్రీకరించారు.