పవన్ సినిమాలో రమణ గోగుల పాట..!

Ramana Gogula Song: ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాల కోసం ఆయన ఇచ్చిన ఆల్బమ్స్ అభిమానులకు ఓ స్పెషల్ ఎమోషన్. తమ్ముడు, బద్రి, జానీ, అన్నవరం లాంటి చిత్రాల సంగీతం ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో మారుమోగుతూనే ఉంది. పవన్‌ స్టైల్, యాటిట్యూడ్‌కు రమణ గోగుల వాయిస్ కాంబినేషన్ అదిరిపోయేది. ఆయన మ్యూజిక్ ఆల్బమ్స్ 90’s యూత్‌ను ఊరేగించాయి. తమ్ముడులోని “వయ్యారి భామ నీ హంసనడక” లాంటి పాటలు ఇప్పటికీ ఎవర్‌గ్రీన్ హిట్స్‌. తమ్ముడు, ప్రేమంటే ఇదేరా, బద్రి, జానీ, లక్ష‍్మీ, యోగి మూవీస్‌కి అదిరిపోయే సంగీతమందించారు రమణ గోగుల.

2013 తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైపోయిన ఈయన.. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వెంకటేశ్ ‘సంక్రాంతి వస్తున్నాం’ మూవీలో ‘గోదారి గట్టు మీద’ పాటతో బ్లాక్ బస్టర్ రీఎంట్రీ ఇచ్చారు. ఈ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలవడమే కాకుండా ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించడంలో ప్రధాన పాత్ర పోషించింది. ఈ పాటతో రమణ గోగుల మళ్ళీ సింగర్ గా బిజీ అయ్యారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలో రమణ గోగుల ఓ సాంగ్ పాడనున్నారట.

దాదాపు రెండు దశాబ్దాల తర్వాత పవన్ కళ్యాణ్, రమణ గోగుల కాంబినేషన్ మళ్లీ రిపీట్ కానుందనే వార్త ఫ్యాన్స్‌ని ఫుల్ హ్యాపీ చేసింది. తాజా సమాచారం ప్రకారం, పవన్ కల్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో రమణ గోగుల ఓ పాట పాడనున్నట్లు తెలుస్తోంది. Ramana Gogula Song.

పవన్ కళ్యాణ్ ఎనర్జీతో కూడిన డ్యాన్స్ స్టెప్స్, రమణ గోగుల ప్రత్యేకమైన వాయిస్, డీఎస్పీ అందించే మాస్ బీట్ అంటే థియేటర్స్‌లో ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పొచ్చు. మరోవైపు ఇటీవల జరిగిన సైమా అవార్డ్స్ కార్యక్రమంలో స్టేజ్ మీద ఉస్తాద్ భగత్ సింగ్ ఆల్బమ్ గురించి హింట్ ఇచ్చాడు. ఈ సినిమా కోసం పవన్ చేసే డ్యాన్సులు మాస్‌కు మరో లెవెల్‌లో ఉంటాయి. సాంగ్స్ కూడా గ్యారెంటీగా బ్లాక్‌బస్టర్ అవుతాయి అని చెప్పాడు.