
Pushpa 3 Update: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప’ చిత్రం, కలెక్షన్ల పరంగా కాదు, అవార్డుల పరంగానూ రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా దుబాయ్ వేదికగా నిర్వహించిన ‘సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్’ (SIIMA 2025) కార్యక్రమంలో పుష్ప 2: ది రూల్ సినిమాకు గొప్ప గుర్తింపు లభించింది. ఈ ఈవెంట్‌కు పుష్ప టీమ్ మొత్తం హాజరై సందడి చేసింది. అల్లు అర్జున్, రష్మిక మందన్నా, డైరెక్టర్ సుకుమార్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, అలాగే మైత్రీ మూవీ మేకర్స్ బృందం కలిసి ఈ అవార్డ్స్ ఫంక్షన్‌లో పాల్గొన్నారు. ఈ వేడుకలో భాగంగా, స్టేజ్‌పై జరిగిన సంభాషణలో డైరెక్టర్ సుకుమార్ ‘పుష్ప 3’ పై క్రేజీ అప్డేట్ ఇచ్చాడు.
పుష్ప సిరీస్‌కు వచ్చిన స్పందనతో దేశవ్యాప్తంగా అల్లుఅర్జున్ క్రేజ్ అసాధారణంగా పెరిగిపోయింది. ‘పుష్ప’, ‘పుష్ప 2’ సినిమాలు భారత బాక్సాఫీస్‌ను ఓ ఊపు ఊపేసాయి. ఈ క్రమంలో ‘పుష్ప 3 ఉంటుందా?’ అనే ఊహాగానాలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. చివరకు సైమా 2025 వేడుకలో, అవార్డు అందుకునే సమయంలో వ్యాఖ్యాత అడిగిన ప్రశ్నకు స్పందించిన సుకుమార్.. “పుష్ప 3 ఖచ్చితంగా వస్తుంది” అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే కొన్ని ప్రచారాల మేరకు ‘పుష్ప 3: ది ర్యాంపేజ్’ అనే టైటిల్‌తో ఒక పోస్టర్ కూడా వైరల్ అయినా, దానిపై అధికారిక సమాచారం లేకపోవడం వల్ల ఫ్యాన్స్ లో చాలామంది సందేహాలు వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు సుకుమార్ మాటలతో ఆ అనుమానాలకు తెరపడినట్లయింది. Pushpa 3 Update.
SIIMA అవార్డుల్లో ‘పుష్ప 2’ మొత్తం ఐదు విభాగాల్లో అవార్డులు దక్కించుకుంది.
1)ఉత్తమ నటుడు – అల్లు అర్జున్
2)ఉత్తమ నటి – రష్మిక మందన్నా
3)ఉత్తమ దర్శకుడు – సుకుమార్
4)ఉత్తమ సంగీత దర్శకుడు – దేవిశ్రీ ప్రసాద్
5)ఉత్తమ నేపథ్య గాయకుడు – శంకర్ మహదేవన్
అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ భారీ చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ కథానాయికగా నటిస్తున్నారన్నది ఇప్పటికే హైలైట్ అయింది. సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని 2027లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అట్లీ సినిమా పూర్తయ్యాకే బన్నీ పుష్ప 3 ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.