“వ్యూహనికి ప్రతి వ్యూహం”

CM Revanth Reddy: ‘సాధారణంగా పాలకులు’ తమకు వ్యతిరేకంగా ఉన్న వర్గాలను దూరం పెడతారు.కానీ రేవంత్ రెడ్డి సర్కారు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యూహత్మక అడుగులు వేస్తుంది. గత ప్రభుత్వం దూరం చేసుకున్న కీలక వర్గాలను దగ్గరకు తీసుకోవడం మొదలుపెట్టింది. పార్టీ అంతర్గత రాజకీయ కుమ్ములాటలను కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటోంది. రాజకీయాల్లో ఎత్తుకు పై ఎత్తు,వ్యూహనికి ప్రతి వ్యూహం సహజమే..రేవంత్ రెడ్డి కూడా అదేపనిని పక్కడబంధీగా అమలు చేస్తున్నారా!?.ప్రతి పక్షాలకు అవకాశం ఇవ్వకుండా వ్యూహత్మక రాజకీయాలకు తెర లేపారా??

“తెలంగాణ రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి దూకుడు స్వభావం అందరికి తెలిసిందే. అయితే పాలనలో ఆయన అనుసరిస్తున్న “నిశబ్ద వ్యూహం” అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒకవైపు బీఆర్ఎస్ ను అడుగడుగునా నిలదీస్తూనే, మరోవైపు గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వర్గాలను దగ్గరకు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగానే, వీఆర్ఓలు, మరియు ఉపాధ్యాయులను తమ వైపుకు తిప్పుకునే వ్యూహన్ని రచించారు రేవంత్. గత ప్రభుత్వం వీఆర్ఓలను “దొంగలుగా” చిత్రీకరించి, వారి వ్యవస్థను రద్దు చేసింది. దీని వెనుక అసలు కారణం ధరణి పోర్టల్ ద్వారా భూ దోపిడీకి పాల్పడటమేనని రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ఆరోపించారు. “అసలైన దొంగలు వాళ్ళు, మిమ్మల్ని నిస్సహాయుల్ని చేసి చెట్టుకొకరిని, పుట్టకొకరిని విసిరేశారు ” అంటూ వీఆర్ఓల మనసు గెలుచుకున్నారు.తిరిగి 5 వేల మందిని మళ్లీ విధుల్లోకి తీసుకుంటూ, గత ప్రభుత్వం వేసిన ముద్రను చెరిపే బాధ్యత కూడా మీదే అని వారిని ఈ పోరాటంలో భాగం చేశారు.. ఇదే వ్యూహంతో ఉపాధ్యాయులకు పారదర్శకంగా ప్రమోషన్లు, బదిలీలు కల్పించి వారి నమ్మకాన్ని కూడా గెలుచుకున్నారు.రాష్ట్ర ఉద్యోగులలో ఎక్కువ శాతం ఉన్న ఈ రెండు వర్గాల ఉద్యోగులను తమకు అనుకూలంగా మలుచుకోవడంలో సపలీకృతం అయ్యారు.

“రేవంత్ రెడ్డి వ్యూహం కేవలం ఉద్యోగులకే పరిమితం కాలేదు. ఇది మరింత ఉన్నత స్థాయిలో కొనసాగుతోందనే చర్చ జరుగుతుంది…కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి పై అసెంబ్లీ తీర్మానం పెట్టి ‘సిబిఐ దర్యాప్తు’ కోరారు. ఇది కేవలం అవినీతిపై పోరాటం మాత్రమే కాదు గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వర్గాలకు దగ్గర అయ్యేందుకే అనే చర్చ జోరుగా సాగుతుంది.రేవంత్ సర్కారు తనకున్న ప్రధాన ఎన్నికల హామీని నిలబెట్టుకోవడంతో పాటు, బీఆర్ఎస్ పార్టీని ఆత్మ రక్షణలో పడేసే వ్యూహాత్మక అస్త్రంగా దీనిని మార్చారు.. 42%బీసి రిజర్వేషన్ ల అమలు పై క్రియాశీలక అడుగులు వేస్తూ కేంద్రం లో అధికార బీజేపీని ఇరకాటంలో పెట్టారనే చర్చ జరుగుతుంది..ఇది అధికార పార్టీపై ఎదురుదాడికి బీఆర్ఎస్, బీజేపీ లకు అవకాశం లేకుండా చేస్తుందనేది క్యాడర్ మాట..

ఇక పార్టీ అంతర్గతంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం పార్టీలో తన స్థానానికి సవాలు విసురుతున్నా!, రాజగోపాల్ రెడ్డిని ఎదుర్కోవడంలో రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న వ్యూహం అత్యంత ఆసక్తికరంగా మారింది.. రాజగోపాల్ రెడ్డి సీఎం పై ఎంతగా విమర్శలు గుప్పించినా, రేవంత్ రెడ్డి మాత్రం నిశ్శబ్దంగా ఉంటున్నారు..అదే సమయంలో,తన కేబినెట్ లో కీలక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి వైపుకు ఫోకస్ చేసేలా చేసి, ” మరో పదునైన రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.ఈ అంతర్గత విభేదాలు రేవంత్ కు పరోక్షంగా రాజకీయ బలాన్ని పెంచుతున్నాయనే టాక్ నడుస్తుంది..! CM Revanth Reddy.

“మొత్తంగా, రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని స్పష్టమవుతోంది. ఆయన కేవలం దూకుడుగా మాత్రమే కాకుండా, తెలివైన వ్యూహాలతో, గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ.. అన్ని వర్గాల నమ్మకాన్ని గెలుచుకుంటున్నారు. “విశ్వాసం గల కుక్కను చంపాలంటే పిచ్చిదనే ముద్ర’ వేయాలనే సూత్రం అమలు చేస్తున్నారు.తన రాజకీయ ప్రత్యర్థులను ఒక అడుగు వెనక్కు నెడుతూ, తన పాలనను సుస్థిరం చేసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న ఈ నిశ్శబ్ద వ్యూహం భవిష్యత్తులో ఏ మేరకు ఫలితాలు ఇస్తుందో చూడాలి.