బాలీవుడ్ హీరోతో శ్రీలీల డేటింగ్.. ఫోటోలు వైరల్!

Sreeleela Karthik Aryan Dating: టాలీవుడ్‌ యంగ్ సెన్సేషన్‌ శ్రీలీల, ఇప్పుడు బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తోంది. హిందీలో ఓ ఫీల్-గుడ్ లవ్ స్టోరీగా నిలిచిన ఆషికి ఫ్రాంచైజీలో భాగంగా వస్తున్న ఆషికి 3లో ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో కార్తీక్ ఆర్యన్‌తో రొమాన్స్చేయనుంది . ఈ క్రేజీ కాంబినేషన్ మొదలైనప్పటి నుంచే వీరి మధ్య ప్రత్యేక అనుబంధం పెరుగుతున్నట్లు బీ-టౌన్ లో జోరుగా చర్చ జరుగుతోంది. అందుకు తగ్గట్లు శ్రీలీల బయట కార్తీక్ ఆర్యన్ తో పలుమార్లు కలిసి కనిపించడం ఆ పుకార్లకు ఊతమిస్తోంది.

కొన్ని రోజుల క్రితం కార్తీక్ తన సోదరి డాక్టరేట్‌ పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంట్లో ఏర్పాటు చేసిన సన్నిహిత పార్టీకి శ్రీలీల హాజరవడం, కార్తీక్ ఫ్యామిలీతో ఫ్రెండ్లీగా మెలగడం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఇప్పుడైతే ఈ బాండింగ్ మరింత పెరిగిందన్నసంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా ముంబైలో కార్తీక్ ఆర్యన్ నివాసంలో జరిగిన గణేశ్ చతుర్థి వేడుకలకు శ్రీలీల తన కుటుంబసభ్యులతో సహా హాజరయ్యింది.

ఈ పండుగ సందర్భంలో ఇద్దరూ తెలుపు దుస్తుల్లో జంటగా కనిపించగా, రెండు కుటుంబాలూ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.ఈ నేపథ్యంలో గతంలో కార్తీక్ తల్లి మాల తివారీ చేసిన కామెంట్లు మరలా వార్తల్లోకి వచ్చాయి. ఐఫా అవార్డుల వేడుకలో మాట్లాడుతూ ఆమె “మా కొడుక్కి కోడలిగా ఓ మంచి డాక్టర్ రావాలి” అని చెప్పిన విషయాన్ని నెటిజన్లు ఇప్పుడు గుర్తుచేసుకుంటున్నారు. Sreeleela Karthik Aryan Dating.

శ్రీలీల ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్ కావడం, ఆమెతో కార్తీక్ ఇటీవల సన్నిహితంగా ఉండడం చూసి అభిమానులు “ఇదే ఆ కోడలే కావచ్చు” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ రూమర్స్‌పై శ్రీలీల గానీ, కార్తీక్ గానీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ, ఇలా ఇద్దరూ తమ కుటుంబాలతో కలిసి పండుగలు జరుపుకోవడం, సోషల్ మీడియాలో వారి ఫోటోలు వైరల్ కావడం చూస్తే… వీరి మధ్య ఏదో బలమైన బంధం ఉందనే ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.