‘OG’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్..!

‘OG’ pre-release event: ప్రస్తుతం టాలీవుడ్‌ పరిస్థితి దారుణంగా మారింది. భారీ బడ్జెట్‌, స్టార్ కాస్ట్‌తో వస్తున్న కొన్ని పెద్ద సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద నిరాశ పరుస్తుండగా, చిన్న సినిమాలు మాత్రం ఆశ్చర్యకర విజయాలను నమోదు చేస్తున్నాయి. ఈ తరుణంలో తెలుగు ప్రేక్షకుల దృష్టంతా ఇప్పుడు ఓ మేజర్ రిలీజ్‌పై నిలిచింది – అదే పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ హై-వోల్టేజ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా, సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్, పాటలు సినిమా పై భారీ అంచనాలు పెంచాయి .

పవన్ కళ్యాణ్ స్టైల్, మ్యానరిజం, మాస్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇవన్నీ మళ్లీ ఒకసారి మాంచి హైప్ తీసుకురావడంలో సక్సెస్ అయ్యాయి. డీవీవీ దానయ్య నిర్మాణంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌కి మ్యూజిక్ అందిస్తున్న థమన్ ఇప్పటికే కొన్ని బీట్‌లతో ఫ్యాన్స్‌కి మ్యూజికల్ ఫీవర్‌ తేవడంలో సక్సెస్ అయ్యాడు. ఓవర్సీస్‌లో ప్రీ సేల్స్ ఇప్పటికే రికార్డు స్థాయిలో జరిగాయి. నార్త్ అమెరికాలో కొన్ని వేల టికెట్లు ప్రీ బుకింగ్‌లో అమ్ముడవ్వడమే కాక, ఈ క్రేజ్ అమెరికా మార్కెట్‌నే హైలైట్ చేసింది.

ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్ల వేగాన్ని పెంచారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 19న విజయవాడ, 21న హైదరాబాద్‌లో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్లను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా హైదరాబాద్‌ ఈవెంట్‌కి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. చిరు-పవన్ ఒకే వేదికపై కనిపిస్తే అది అభిమానులకే కాకుండా ఇండస్ట్రీకి ఓ సర్‌ప్రైజ్ కానుంది. దీనిపై మేకర్స్ నుంచి త్వరలోనే అనౌన్స్ మెంట్ రానుంది. ‘OG’ pre-release event.

‘ఓజీ’ సినిమాపై రోజు రోజుకీ పెరుగుతున్న ఊహాగానాలు, అభిమానుల ఉత్కంఠ మేకర్స్‌కి ఒకవైపు ఆనందం కలిగిస్తున్నా… మరోవైపు తలకిందులవ్వకూడదన్న చిన్న భయాన్ని కూడా కలిగిస్తున్నాయి. ఇప్పటివరకు టీజర్స్, గ్లింప్స్, సాంగ్స్‌తో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ గతంలో ఇదే తరహా హైప్ ఉన్న పలు చిత్రాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నారు.