ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం గల నేత.!!

Errabelli Dayakar Rao: ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం గల నేత… అసలు ఓటమి అంటే ఏంటో తెలియని నేత..అతని వ్యూహాల ముందు ఎంతటి వారైన చిత్తు కావాల్సిందే. కానీ ఇదంతా గతమే .గత ఎన్నికల్లో ఘోర ఓటమితో రాజకీయ భవిష్యత్తుని అంధకారంలో నెట్టేసుకొని ఇప్పుడు ప్రజా మద్దతు లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాలం చెల్లిన రాజకీయ ఎత్తుగడలతో ముందుకెళ్తున్నాడని విమర్శలు మూటగట్టుకున్నారు. ఇంతకీ ఎవరా నాయకుడు ఏంటా కథా…. లెట్స్ వాచ్ మెగా 9 ఆఫ్ ది రికార్డ్

తెలుగు రాష్ట్రాల్లో ఒక వెలుగు వెలిగిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాజకీయ భవిష్యత్ మసకబారుతుందా అంటే అవునని సంకేతాలు వస్తున్నాయి. ప్రజా సమస్యలపై పోరాటం చేయలేక  మరింత చులకన అవుతున్నారా… కాలం చెల్లిన రాజకీయ ఎత్తుగడలతో తన రాజకీయ భవిష్యత్తుని తానే ఇబ్బందుల్లో పడేసుకుంటున్నారా అనే అనుమానాలు గులాబీ క్యాడర్ లో వ్యక్తమవుతుంది. గత ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గం లో యశస్విని రెడ్డి చేతిలో ఘోర పరాజయం పొందిన ఎర్రబెల్లి దయాకర్ రావు తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డిలకు నియోజకవర్గంలో వస్తున్న ప్రజా మద్దతును డైరెక్ట్ గా ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్టీలో ఉన్న  అసమ్మతి నేతలను ప్రోత్సహించి, అత్త, కోడళ్లను ప్రజల్లో బలహీన పరిచి తను బలం పెంచుకోవాలని చూస్తున్నట్లు బాహటంగానే ఆరోపణలు వస్తున్నాయి..

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయిన ఎర్రబెల్లి దయాకర్ రావు పంట పొలాలకు కాలువ ద్వారా నీళ్లు అందించాలని పాదయాత్ర పేరుతో ఒక్కరోజు మీడియాలో హడావుడి చేసి చేతులు దులుపుకున్నారు. ఇక యూరియా దొరకక రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఇబ్బందులు పడుతుంటే, ఆ మధ్య యూరియా సెంటర్లలో ఇబ్బందులు పడుతున్న రైతులను పలకరించడానికి వెళ్ళి తద్వారా సానుభూతి పొందాలన్న ప్రయత్నం చేసినా అది కూడా బెడిసికొట్టడంతో ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో పడ్డారు. ఆ తర్వాత కూడా ఏదో మొక్కుబడిగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు కానీ పెద్దగా రైతు పక్షాన పోరాటం చేసింది ఏమీ లేదనే టాక్ వినిపిస్తుంది.

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింత నెక్కొండ గ్రామంలో బాలు అనే రైతు పత్తి పంటకు దిగుబడు రాక మిర్చి సాగు చేయాలని నిర్ణయించుకొని పత్తి చెట్లను తొలగించాడు. అయితే తను బిఆర్ఎస్ పార్టీ సానుభూతి పరుడు కావటంతో తొలగిస్తున్న చెట్లను వీడియో తీసి ప్రభుత్వం పైన నిందలు వేస్తూ సోషల్ మీడియాలో పెట్టడా. ఈ విషయాన్ని ఆసరాగా తీసుకున్న దయాకర్ రావు ఆ రైతుని పరామర్శించి రాజకీయంగా కొంత లబ్ధి పొందాలనే  ఆలోచనలతో మీడియాలో బాగా హడావుడి  చేశాడు. అయితే అది కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఒకప్పుడు తనదైన రాజకీయ వ్యూహాలతో ప్రత్యర్ధులను చిత్తు చేసిన ఎర్రబెల్లి ఇప్పుడు కేవలం మీడియాలో హడావుడికి మాత్రమే పరిమితం అయ్యారని, ప్రజల్లో మాత్రం చులకన అవుతున్నారని సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు.

ఒకవైపు వర్గపోరు,మరోవైపు కాంగ్రెస్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి, ఝాన్సీరెడ్డి  విఫలమయ్యారని ప్రజల్లో చర్చ సాగుతుంది. దాన్ని ఆసరాగా తీసుకోవాల్సిన ఎర్రబెల్లి మాత్రం కాలం చెల్లిన ఎత్తులు వేస్తూ ప్రజల్లో చులకన అవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతుంటే మాజీ మంత్రిగా ,సీనియర్ నాయకుడిగా ప్రజలకు మద్దతుగా ఉండాల్సిన ఎర్రబెల్లి కేవలం మీడియాలో మాత్రమే హడావుడి చేసి ఆ  తర్వాత మళ్ళీ సైలెంట్ మోడ్ లోకి వెళ్తున్నారు. ఎర్రబెల్లి కి రాజకీయ సమాధి కడతాం, మరోసారి పాలకుర్తి లో బిఆరెస్ జెండా ఎగరనివ్వమని ఝాన్సీరెడ్డి ప్రతిజ్ఞ చేస్తుంటే తిప్పి కొట్టాల్సిన దయాకర్ రావు మాత్రం సైలెంట్ అయ్యారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పాలకుర్తిలో మెజారిటీ స్థానాలు బిఆరెస్ గెలుస్తుందని లేకపోతే రాజకీయ సన్యాసం చేస్తా అని ఆ మధ్య మీడియా అటెన్షన్ డైవర్ట్ చేశారు ఎర్రబెల్లి. Errabelli Dayakar Rao.

ఝాన్సీరెడ్డి, ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి లను తట్టుకోలేక ఎర్రబెల్లి పాలకుర్తి నుండి వర్ధన్నపేటకు మకాం మార్చబోతున్నారని జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇందులో భాగంగానే తరచుగా వర్ధన్నపేట నియోజకవర్గం లో పర్యటిస్తూ క్యాడర్ ను సన్నద్ధం చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. ఒకవేళ రిజర్వేషన్లు కలిసివస్తే ఎర్రబెల్లి స్తానంలో పాలకుర్తిలో మరో బలమైన బీసీ నాయకుని తీసుకుని రావాలని బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఆలోచిస్తుంది. అయితే ప్రజా పోరాటాల్లో పాల్గొనలేక.. ప్రజల మద్దతు కూడగట్టుకోలేక మీడియాలో మాత్రం పులి లాగ వున్న ఎర్రబెల్లి ప్రజల్లో జీరో అయ్యారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు..ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఎర్రబెల్లి రాజకీయ భవిష్యత్తు కాలమే నిర్ణయించాలి.

Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q