
Kamareddy BC Sabha: ఈనెల 15 న కామారెడ్డి లో కాంగ్రెస్ బీసీ సభ నిర్వహించేందుకు..? డిక్లరేషన్ అమలు చేయకుండానే సంబరాలా..? కులగణన చేసినందుకు సభ నిర్వహిస్తున్నారా..? బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండానే ఉత్సవాలు ఎందుకు ? బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఎత్తుగడ కోసం కామారెడ్డి లో కాంగ్రెస్ సభ నిర్వహిస్తున్నారా..? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్.
ఈనెల 15న కామారెడ్డిలో కాంగ్రెస్ సభ నిర్వహించబోతుంది, ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా కామారెడ్డిలో చేసిన బీసీ డిక్లరేషన్ అమలు చేస్తాం అని ప్రకటించారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాము అందుకే ఇచ్చిన మాటకు కామారెడ్డిలో విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామని కాంగ్రెస్ గొప్పలు చెప్పుకుంటుంది. కానీ అసలు పరిస్థితి మరోలా ఉంది. బిల్లు ఇంకా రాష్ట్ర పతి దగ్గర పెండింగులో ఉండగా విజయోత్సవ సభను ఏ మొహం పెట్టుకొని నిర్వహిస్తున్నారంటూ కాంగ్రెస్ పై బీసీ సంఘాలు మండిపడుతున్నాయి, అధికారంలోకి రాగానే కులగణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించామని కాంగ్రెస్ పార్టీ గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ అవి మాటలకే పరిమితమై ఆచరణలో అమలు కాకపోవడం లేదంటూ సొంత పార్టీలోని బిసి వర్గాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బిసి సంఘాలు కాంగ్రెస్ పై తీవ్ర అసంతృప్తి తో ఉన్నాయి.
అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కులగణన చేయడంతో పాటు అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదిపజేశారు. దీనితో పాటు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించడం కోసం ప్రత్యేక ఆర్డినెన్స్ ను తీసుకొచ్చారు. అయితే బీసీ బిల్లును కాంగ్రెస్ సర్కార్ గవర్నర్ ఆమోదానికి పంపారు. కానీ గవర్నర్ న్యాయ సలహా కోసం దగ్గరికి పంపించారు, ప్రస్తుతం ఆ రెండు బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లును ఆమోదించాలని జంతర్మంతర్ దగ్గర సీఎం రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ నేతలతో పాటు ఏఐసిసి పెద్దలు ధర్నా చేసి చేతులు దులుపుకున్నారు. ఇక తమ పని అయిపోయింది బంతి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కోర్టులో ఉంది. బీసీ బిల్లును ఆమోదించాల్సింది కేంద్రాన్నిదే అంటూ నెపాన్ని కేంద్రంపైకి మీదికి నెట్టింది కాంగ్రెస్.
బీసీలకు 42 శాతం బిల్లును కేంద్రం ఆమోదించక ముందే ఇంత హడావుడిగా కామారెడ్డిలో సభను నిర్వహించాల్సిన అవసరమేంటని విపక్షాలతో పాటు రాష్ట్రంలో ని బీసీ నేతలు మండిపడుతున్నారు. ఇదంతా బీహార్ ఎన్నికల స్టంట్ కోసమే సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ వేస్తున్న ఎత్తుగడలంటూ బీసీ సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఎందుకంటే తెలంగాణ లో కాంగ్రెస్ కులగణన చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించింది. తెలంగాణ తరహాలోనే బీహార్లో అమలు చేస్తామంటూ కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ,మల్లికార్జున ఖర్గే తో పాటు ప్రియాంకా గాంధీ అక్కడ ప్రచారం చేసుకుంటున్నారు. బీహార్ లో తెలంగాణ బీసీ రిజర్వేషన్ అంశాన్ని వాడుకోవాలని భావిస్తుంది కాంగ్రెస్. దీంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తున్నాం బీహార్ లో కూడా కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణ తరాలని అమలు చేస్తామంటూ అ బీహార్ సభల్లో అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు
అయితే కాంగ్రెస్ పార్టీ తీరుపై బిసి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ అమలు చేయకుండా సంబరాలు దేనికి అంటూ ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు మండిపడుతున్న బీసీ సంఘాల నేతలు రిజర్వేషన్ల అమలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ని నిలదీసేందుకు సిద్ధం అవుతున్నారు బీసీ నేతలు.
మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలకి పోవడానికి భయం పట్టుకుందని గాంధీభవన్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది, ఈ నెల 15న కామారెడ్డిలో నిర్వహించబోయే సభ కేవలం బీహార్ లో జరగనున్న ఎన్నికల స్టంట్ లో భాగంగానే హడావుడి చేస్తుందంటూ ప్రతిపక్షాలతో పాటు బీసీ సంఘాలు విమర్శిస్తున్నాయి, మరి ప్రతిపక్షాలకు, బీసీ సంఘాలకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏ విధంగా సమాధానం చెప్తారో చూడాలి.