
NTR Dragon Rishab Shetty: పాన్ ఇండియా స్థాయిలో ‘RRR’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న తారక్ – జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత ఎంచుకుంటున్న ప్రాజెక్టులు అన్నీ కూడా భారీ స్థాయిలో రూపొందుతున్నాయి. ఇటీవల హిందీలో నటించిన వార్ 2 పెద్దగా ఫలితం అందించకపోయినా, ఎన్టీఆర్ ఇప్పుడు తన 31వ చిత్రంగా డ్రాగన్ అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్పై పూర్తి ఫోకస్ పెట్టాడు. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుండగా, సినిమా మొత్తం కర్ణాటకలో చిత్రీకరించబడుతోంది.
కన్నడకు చెందిన అభిమానుల మద్దతు ఎన్టీఆర్‌కి బలంగా ఉన్నప్పటికీ, ఈ సినిమా ద్వారా ఆయన మరింతగా అక్కడి ప్రేక్షకులకు దగ్గరవ్వాలని భావిస్తున్నారని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఎన్టీఆర్ కూడా కన్నడలో చక్కగా మాట్లాడగలడన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోని తాజా సమాచారం ప్రకారం, ‘డ్రాగన్’ చిత్రంలో ఓ ప్రముఖ కన్నడ స్టార్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమా కోసం ప్రశాంత్ నీల్ భారీ కాస్టింగ్ ను ప్లాన్ చేశారు. ఇప్పటికే మలయాళ నటుడు టోవినో థామస్, ప్రముఖ నటి రుక్మిణి వసంత్, బీజీ మీనన్ లాంటి నటులు ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. అలాగే ‘ఆనిమల్’ చిత్రంలో ప్రభావవంతమైన పాత్ర పోషించిన బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వచ్చాయి.
ఇప్పుడు మరో ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘కాంతారా’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రిషబ్ శెట్టి, ఈ చిత్రంలో గెస్ట్ రోల్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్ర కోసం దర్శకుడు ప్రశాంత్ నీల్, రిషబ్‌ను సంప్రదించాడట. ఆ పాత్ర సినిమాలో ఫ్లాష్‌బ్యాక్‌లో కనిపించనున్నట్టు సమాచారం. తారక్‌తో ఉన్న స్నేహం కారణంగా రిషబ్ ఈ పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. NTR Dragon Rishab Shetty.
ఇక ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్’, ‘సలార్’ సినిమాల్లో చూపించినట్లు, ఈ చిత్రానికి కూడా సెపరేట్ వరల్డ్ ను బిల్డ్ చేస్తున్నాడట. అది ఇంటర్నేషనల్ టచ్ తో ఉండనుందని సమాచారం. ఇందుకోసం సినిమా యూనిట్ విదేశీ లొకేషన్లలో కూడా షూటింగ్ ప్లాన్ చేస్తోంది. ఎన్టీఆర్ మేకోవర్ కూడా ఇప్పటివరకు ఎన్నడూ చూడని విధంగా ఉంటుందని చెబుతున్నారు. 2026 సమ్మర్లో విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే తారాస్థాయికి చేరాయి. ఇప్పుడు రిషబ్ శెట్టి చేరికతో ఈ ప్రాజెక్ట్ క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి.