సుశీలా కర్కీ.. ఎవరీమె?

Sushila Karki: ఏ దేశమైనా ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటుంది. నేపాల్‌లో మాత్రం ప్రజాస్వామ్యం నచ్చేలేదు. పగ్గాలు ఆర్మీ చేతిలోకి వెళ్లినా.. ఆర్మీ కఠినంగా వ్యవహరించకుండా.. ప్రజలతో కలిసి మెలిసి ముందుకెళ్తోంది. దీంతో తాత్కాలిక ప్రధానిగా సుశీలా కర్కీని ఒప్పుకోవడం గొప్ప విషయమే. ఇంతకు ఎవరు ఆమె తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్

సోషల్ మీడియా నిషేధం విధించడంతో ఈ ఆందోళనలు ప్రారంభమైనప్పటికీ.. తెరవెనక మరిన్ని అంశాలు ఉన్నాయి. ఆ దేశంలో అవినీతి బాగా పెరిగిపోయింది. యువతకు ఉద్యోగాలు లేవు. రాజకీయ నాయకుల పిల్లలు మాత్రం లగ్జరీ లైఫ్ స్టైల్ అనుభవిస్తున్నారు. దేశంలో పేదరికం తాండవిస్తోంది. ఇలాంటి అంశాలన్నీ కలిసి ప్రజల్లో ఆగ్రహాన్ని పెంచాయి. అవి ఈ నిరసనలను తీవ్రం చేశాయి.

NepoKids అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది రాజకీయ నాయకుల పిల్లల ధనిక జీవనశైలిని హైలైట్ చేసింది. ఈనెల 8న పోలీసులు ఆందోళనకారులపై రబ్బర్ బుల్లెట్లు, వాటర్ కెనాన్ లను ఉపయోగించడంతో 19 మంది మరణించారు, మరుసటి రోజు మరో ముగ్గురు మరణించారు. పార్లమెంటు, ప్రధానమంత్రి కార్యాలయం, రాజకీయ నాయకుల ఇళ్లపై దాడులు జరిగాయి. లగ్జరీ హోటళ్లను కూడా తగలబెట్టారు.

జనరేషన్ జెడ్ నిరసనకారుల ఆందోళనలు నేపాల్ లో ప్రధాని కేపీ శర్మ ప్రభుత్వాన్ని కూలదోశాయి. దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగిసిపడిన ఆగ్రహజ్వాలలు ప్రధానితో సహా కేంద్ర మంత్రులందరూ రాజీనామా చేసి పారిపోయేలా చేశాయి. నేపాల్ ప్రస్తుతం ఆర్మీ గుప్పిట్లో ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు సైనిక పాలన సాగుతుంది. ప్రధానిగా తన పదవికి కేపీ శర్మ రాజీనామా చేసిన తర్వాత ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఎవరు సమర్థవంతంగా నేపాల్ ను పాలించగలరు అనే సందేహాలు తలెత్తుతున్నాయి.

ఈ క్రమంలో ఇద్దరి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. నిన్న బాలెన్ షా పేరు తెరపైకి రాగా.. ఇవాళ నేపాల్ మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కీ పేరు తెరపైకి వచ్చింది.. నిరసనకారులతో జరిపిన చర్చల్లో ఆమెకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.. ఆ దేశ మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కి హిమాలయ దేశంలో తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించేందుకు ఎంపికైనట్లు సమాచారం.

ప్రస్తుతం నేపాల్ ఆర్మీ చేతిలోకి వెళ్లింది. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు, శాంతిని పునరుద్దరించేందుకు నిరసనకారులతో చర్చలు జరిగాయి.4వేలకు పైగా యువకులు ఆన్ లైన్ లో సమావేశం అయినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ఈ సమావేశంలో సుశీలా కర్కి పేరును సైన్యంతో చర్చలు జరిపేందుకు, తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నాయకత్వం వహించేందుకు ఆందోళనకారులు అంగీకరించారు. వర్చువల్ సమావేశంలో సుశీలా కర్కి 31 శాతం ఓట్లు పొందగా, ఖాట్మండు మేయర్ బాలెన్ షా 27 శాతం ఓట్లు పొందారు. దీనితో ఇప్పటివరకు జనరేషన్ జెడ్ ఉద్యమ నాయకుడిగా ప్రచారంలో ఉన్న షా కంటే సుశీల కర్కీకి ఆందోళనకారులు ఎక్కువ మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది.

నేపాల్‌లో ఇటీవలి రాజకీయ సంక్షోభం, యువత ఆందోళనలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. ఈనెల 8 నుంచి ఖాట్మండు, ఇతర నగరాల్లో జెన్ జెడ్ యువత నేతృత్వంలో జరిగిన ఆందోళనలు… దేశంలోని అవినీతి, నీతి లేని రాజకీయాలు, సోషల్ మీడియాపై నిషేధం విధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ ఆందోళనలు ప్రధానమంత్రి కే పీ శర్మ ఓలీ రాజీనామాకు దారితీశాయి. దీంతో దేశం రాజకీయ అనిశ్చితిలోకి వెళ్లిపోయింది. ఆర్మీ పగ్గాలు అందుకుంది. కానీ వెంటనే సుశీలా కర్కీని తాత్కాలిక ప్రధానమంత్రిగా ఒప్పుకుంది.

జెన్ జెడ్ ప్రతినిధులు.. కర్కీని ఎంపిక చేశారు. ఆమె.. ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దెల్‌తో చర్చలు జరుపుతారు. ఆమె ప్రధాన లక్ష్యం శాంతిని పునరుద్ధరించడం, బాధిత కుటుంబాలకు సహాయం అందించడం, ఒక సంవత్సరంలో స్వేచ్ఛాయుత, నీతిమంతమైన ఎన్నికలు నిర్వహించడం. ఆర్మీ.. ఖాట్మండులో కర్ఫ్యూ విధించినప్పటికీ పరిస్థితి కొంత శాంతియుతంగా మారింది. అయితే, రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది

నేపాల్‌ చరిత్రలో 72 ఏళ్ల సుశీల కర్కీకి ప్రత్యేక స్థానమే ఉంది. సుప్రీంకోర్టులో మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె రికార్డుకెక్కారు. భారత్‌లోని బనారస్‌ హిందూ యూనివర్సిటీలో చదువుకున్నారు. 1975లో పొలిటికల్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తిచేశారు. సుశీల కర్కీ మొదట టీచర్‌గా పనిచేశారు. 1978లో కాఠ్మండులోని త్రిభువన్‌ యూనివర్సిటీలో న్యాయ విద్యలో బ్యాచిలర్స్‌ డిగ్రీ అభ్యసించారు. 2016లో నేపాల్‌ సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా నియమితులయ్యారు.

అప్పటి ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని రాజ్యాంగ మండలి సిపార్సు మేరకు అప్పటి అధ్యక్షురాలు బిద్యాదేవి భండారీ ఆమెను చీఫ్‌ జస్టిస్‌గా నియమించారు. సుశీల కర్కీ అవినీతికి దూరంగా ఉంటారని, ఎవరికీ భయపడరని పెద్ద టాక్ ఏ వినిపిస్తుంది. అవినీతికి పాల్పడిన మంత్రులను జైలుకు పంపిస్తూ కీలక తీర్పులిచ్చారు. 2006లో నేపాల్‌ రాజ్యాంగ ముసాయిదా కమిటీలో సభ్యురాలిగా సేవలందించారు. బనారస్‌ హిందూ యూనివర్సిటీలో చదుకున్నప్పటి రోజులను సుశీల ఇటీవలే గుర్తుచేసుకున్నారు. అక్కడ డ్యాన్స్‌ నేర్చుకొనే అవకాశం దక్కిందని చెప్పారు. ఆ యూనివర్సిటీలోనే తనకు ఉద్యోగం వచ్చిందనిని, అక్కడే పీహెచ్‌డీ పూర్తిచేసే అవకాశం వచ్చిందని అన్నారు. కానీ, విధిరాత మరోలా ఉండడంతో న్యాయమూర్తిగా మారానని తెలిపారు.

నేపాల్‌ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీక రించడానికి తాను సిద్ధంగా ఉన్నానని జస్టిస్‌ సుశీల చెప్పారు. మధ్యంతర ప్రభుత్వాన్ని ముందుకు నడిపించాలంటూ యువత చేసిన విజ్ఞప్తిని స్వీకరిస్తున్నానని తెలిపారు. దేశ అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేద్దామని నేపాల్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. నూతన ప్రారంభానికి శ్రీకారం చుడదామని అన్నారు.

అవినీతికి వ్యతిరేకంగా తన బలమైన గళం వినిపించారు. 2016-2017లో ఆమె మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఆ సమయంలో అవినీతి కేసుల్లో కీలక తీర్పులు ఇచ్చారు. ఉదాహరణకు.. ఆమె నేతృత్వంలోని బెంచ్… ఒక మంత్రిని అవినీతి ఆరోపణలపై జైలుకు పంపింది. మహిళలకు పౌరసత్వ హక్కులను విస్తరించే ప్రగతిశీల తీర్పును ఇచ్చింది. ఆమె రాజకీయ పార్టీలతో సంబంధం లేని నిష్పక్షపాత వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఇది ఆమెను ఈ పదవికి ఎంపిక చేయడానికి కారణమైంది.

భారత్‌–నేపాల్‌ మధ్య దశాబ్దాలుగా బలమైన సంబంధాలు ఉన్నాయని గుర్తుచేశారు. భారత్‌ అంటే తమకు ఎంతో గౌరవం, ప్రేమ అని స్పష్టంచేశారు. తమ దేశానికి భారత్‌ వివిధ సందర్భాల్లో ఎంతగానో సాయం అందించిందని చెప్పారు. భారతదేశ పాలకులు, నాయకులతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. ముఖ్యంగా ప్రధాని మోదీకి నమస్కారాలు తెలియజేస్తున్నానని జస్టిస్‌ సుశీల కర్కీ వ్యాఖ్యానించారు. మోదీజీ అంటే తనకు గౌరవ ప్రప త్తులు, ఆరాధనభావం ఉన్నట్లు వివరించారు. Sushila Karki.

పాల్‌లో ఈ ఆందోళనలు యువత శక్తిని, అవినీతిపై వారి ఆగ్రహాన్ని ప్రతిబింబిస్తున్నాయి. కర్కీ నాయకత్వం దేశాన్ని ఈ సంక్షోభం నుంచి బయటకు నడిపించగలదని ఆందోళనకారులు ఆశిస్తున్నారు. ఐతే.. అది అంత తేలిక కాదు. నేపాల్ అభివృద్ధి బాట పట్టాలంటే.. చాలా సంస్కరణలు తేవాలి. ముందు అవినీతి, ఆర్థిక అసమానతలను తగ్గించాలి. అలాగే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. స్వేచ్ఛను హరించే చర్యలకు బ్రేక్ వెయ్యాలి. ఇవన్నీ ఒక్కసారిగా సాధ్యం కావు. వన్ బై వన్ చేసుకుంటూ వెళ్లాలి. ఇలా ఆమె ముందు పెద్ద సవాలే ఉంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q