
Nepal protest: నేపాల్ అట్టుడుకుతుంది. సోషల్ మీడియా పై ఆ దేశ ప్రభుత్వం నిషేధం విధించడంతో యువత రెచ్చిపోయింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తు జెన్ జీ చేపట్టిన ఉద్యమం అవినీతి పైకి మళ్లింది. దీంతో ఇది హింసాత్మకంగా మారింది. ప్రధాని ఓలీ సహా మంత్రుల రాజీనామాలకు దారి తీసింది. పార్లమెంట్, సుప్రీంకోర్టు సహా నేపాల్ ఇల్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. మాజీ ప్రధాని భార్యను సజీవదహనం చేశారు. అంతే కాకుండా మంత్రులన వీధుల్లో పరుగెత్తించి కొట్టారు. పరిస్థితులను కంట్రోల్ చేసేందుకు సైన్యం రంగంలోకి దిగింది. నేపాల్ లో జెన్ జీ ఉద్యమం హింసాత్మకంగా మారడానికి దోహద పడిన కారణాలను ఈ స్టోరీలో చూద్దాం.
నేపాల్ ప్రభుత్వం తీసుకున్న ఒకే ఒక నిర్ణయం ఆ దేశాన్ని రావణకాష్టంలా రగిలేలా చేసింది. ప్రభుత్వం గద్దె దిగేందుకు కారణమైంది. ఈనె 4న ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలో ఓ ప్రకటన విడుదల చేసింది. ఫేస్ బుక్, యూట్యూబ్, ఎక్స్, వాట్స్ అప్, ఇంస్ట్రాగ్రాంలాంటివి 26 సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లను నిషేదిస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ నిబంధన ప్రకారం ఈ ప్లాట్ ఫాంలు రిజిస్ట్రర్ చేయలేదని తెలిపింది. సోషల్ మీడియా పై విపరీతంగా ఆధారపడిన యువత ప్రభుత్వ నిర్ణయాన్ని జీర్ణించుకోలేక పోయింది. సోషల్ మీడియాలో ప్రభుత్వ అవినీతిని ఎండగడుతున్నందుకే ఈ యాప్స్ పై నిషేధించిందని యూత్ భావించింది. నేపాల్ పాలకులపై అవినీతి ఆరోపణలు భారీగా ఉన్నాయి. సోషల్ మీడియా లో యూత్ ఎప్పటికప్పుడు అవినీతి ఆరోపణలను ఎండగడుతోంది. దీంతో ప్రభుత్వానికి ఇది పెద్ద సమస్యగా మారింది. అందుకే ఈ యాప్స్ పై ప్రభుత్వం నిషేధం విదించిందని యూత్ ఆరోపిస్తుంది.
దేశంలో నిరుద్యోగం పెరిగిపోవడంతో లక్షలాది మంది విదేశాల్లో పనిచేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. అలాంటి వారు కుటుంబాలతో మాట్లాడుకోవడానికి సోషల్ మీడియా ప్రధాన మాద్యమంగా ఉంది. ప్రభుత్వం సోషల్ మీడియాను బ్యాన్ చేయడాన్ని యువత తట్టుకోలేక పోయింది. దీంతో యువత ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఆందోళనకు పిలుపు నిచ్చింది. ఈ నిరసనతో ప్రభుత్వాన్ని అణిచి వేసేందుకు ప్రయత్నించింది. దీంతో ఆందోళన కాస్త హింసాత్మకంగా మారాయి. ఈనెల 8న కాట్మాండులో హమీ నేపాల్ అనే స్వచ్చంద సంస్థ ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుత ర్యాలీ చేపట్టింది. ఈ ర్యాలీకి యువత పెద్ద ఎత్తున తరలివచ్చింది. మొదట్లో ఈ ర్యాలీ సాఫీగానే సాగింది. అయితే యువతను కంట్రోల్ చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. వాటర్ క్యానెల్ తో దాడి చేశారు. దీంతో పోలీసుల వాహనాలపై ఆందోళన కారులు రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 19 మంది చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు. ఇక ఈ ఆందోళన కాస్త మరో టర్న్ తీసుకుంది. సోషల్ మీడియా పై నిషేధం ఎత్తివేయాలని ఈ ఆందోళన అవినీతి వైపు మళ్లీంది.
ప్రభుత్వ తీరుపై యువత రెచ్చిపోయింది. పాలకులను శిక్షించాలని పిల్లలను చంపవద్దని డిమాండ్ చేస్తూ లక్షలాది మంది వీధుల్లోకి వచ్చారు. దశాబ్దాలుగా పేరుకుపోయిన అవినీతి , నిరద్యోగం, రాజకీయ నాయకుల లగ్జరీ లైఫ్ లాంటి వాటిని ఎత్తి చూపారు. ఆందోళనకారులతో దిగొచ్చిన ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేసింది. నేపాల్ లో నాయకులపై అవినీతి ఆరోపణలు కొత్తేమి కాదు. కమ్యూనిజమ్ మాటున పాలకులు దోచేసుకుంటున్నారని ప్రజలు భావిస్తున్నారు. దీన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు.నేపాల్ లో నేతలు, వారి కుటుంబసభ్యులు లగ్జరీ లైఫ్ గడుపుతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చాలా కాలంగా చక్కర్లు కొడుతున్నాయి. వాళ్లకి వ్యతిరేకంగా అవర్నెస్ కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. నెపో బేబీస్, నెపో పొలిటీషియన్స్ లాంటి హ్యాష్ ట్యాగ్స్ తో పోస్టుల పెడుతున్నారు. మంత్రులు, వారి పిల్లలు కొందరు తమ లగ్జరీ లైఫ్ స్టైల్ ను సోషల్ మీడియాలో పంచుకోవడానికి కూడా వీళ్ల ఆగ్రహానికి కారణమైయింది. ఖరీదైన కార్లు, రెస్టా రెంట్లలో ఫోటోలను పలువురు నేతల కుటుంబసభ్యులు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతూ వచ్చారు. దీంతో యువత అవమానంగా భావించింది. సగానికి సంగం నేపాల్ ప్రజలు పేదరికంలో మగ్గుతుంటే పాలకులు, వాళ్ల కుటుంబాలు మాత్రం లగ్జరీ గా ఉండడాన్ని తట్టుకోలేక పోయింది.
సోషల్ మీడియా నుంచి అవినీతి పైకి మళ్లిన జెన్ జీ ఉద్యమం ఈనెల 9న మరింత ఉగ్రరూపం దాల్చింది. ప్రభుత్వ ఆఫీసులు, పాలకుల ఇళ్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. కాట్మాండులోని ప్రధాన మంత్రి కార్యాలయంతో పాటు మంత్రుల ఆఫీసులు ఉండే సింగా దర్బార్ కు నిప్పు పెట్టారు. పార్లమెంటు భవనం, సుప్రీం కోర్టు, రాష్ట్రపతి నివాసానికి నిప్పు పెట్టారు. ప్రభుత్వ అనుకూల మీడియా కార్యాలయాలకు నిప్పు పెట్టారు. పలు స్టార్ హోటళ్లను ధ్వంసం చేశారు. దీంతో నేపాల్ లో ఎక్కడ చూసిన మండుతున్న దృశ్యాలే కనిపించాయి. పార్లమెంట్ ను వెంటనే రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలని అవినీతి పై దర్యాప్తు చేపట్టాలని ఆందోళన కారులపై దాడిచేసిన అధికారులను సస్పెండ్ చేయాలని ప్రధాని సహా పాలకులంతా రాజీనామా చేయాలని జెన్ జీ డిమాండ్ చేసింది.
జెన్ జీ ఆగ్రహంతో దిగొచ్చిన ప్రధాని ఓలీ పదవికి రాజీనామా చేశారు. దీంతో సైన్యం రంగంలోకి దిగింది. నేపాల్ లో శాంతి యుత వాతావరణానికి సహకరించాలని కోరింది. సెప్టెంబర్ 9న మధ్యాహ్నం ప్రధాని ఓలీ తన రాజీనామను రాష్ట్రపతికి సమర్పించారు. దేశంలో అసాధారణ పరిస్థితులను చక్కదిద్దటానికి ఒక రాజకీయ పరిష్కారం కోసం తను రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. హోమినిస్టర్ రమేష్ లేకర్, వ్యవసాయ మంత్రి రామ్ నాథ్ అధికారి, ఆరోగ్య మంత్రి ప్రదీప్ రాష్టీయ స్వాతంత్ర్య పార్టీ నుండి 21 ఎంపీలు రాజీనామా చేశారు. ఓలీ రాజీనామా తర్వాత సైన్యం రంగంలోకి దిగింది. నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిద్ధల్ ఆందోళన కారులను శాంతించాలని కోరారు. సంప్రదింపుల ద్వారా పరిష్కారం కోసం ముందుకు రావాలని సూచించారు. హట్ మండి, లలిత్ పూర్, పలు ప్రాంతాల్లో నిరవధిక కర్ఫ్యూ విధించారు. త్రిభువన్ ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్టును మూసివేశారు.
నేపాల్ లో రాచరిక పాలన అంతమైన తర్వాత ఎక్కువ కాలం కమ్యూనిస్టులే రాజ్యం ఏలుతున్నారు. అయితే కమ్మూనిజం ముసుగులో పాలకులు భారీగా అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రజల్లో అసంతృప్తి కి ఇదే ప్రధాన కారణం. నేపాల్ లో 2008 నుంచి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ UML, CPN మావోయిస్ట్ సెంటర్ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. ఇవే అధికారాన్ని పంచుకుంటుూ , రాజకీయ శక్తులుగా ఎదిగాయి. అయితే రెండు పార్టీలపైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఓలీ నేతృత్వంలో CPNUML 2024లో నేపాల్ కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాట చేసింది. అయితే ఈ కూటమిలో విభేదాలు ఉన్నాయి. ఓలీ పార్టీ నాయకులు అవినీతిలో కూరుకుపోయారని జన్ జీ భావిస్తుంది. అందుకే ఓలీ సర్కార్ ను సాగనంపే వరకు పోరాడింది. Nepal protest.
ప్రస్తుతం నేపాల్ లో రాజకీయ సూన్యత ఏర్పడింది. ప్రజా ప్రభుత్వం గద్దె దిగింది. జన్ జీ ఉద్యమం నేపాల్ లో ఒక కొత్త రాజకీయ శకానికి నాంది పలికింది. ఇది కేవలం ఒక ఆందోళన కాదు దశాబ్దాల అవినీతి, అసమానతులు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా యువత చేపట్టిన ఉద్యమం. సోషల్ మీడియా నిషేధం ఈ ఉద్యమానికి ట్రిగ్గర్ మాత్రమే. ఇది అవినీతి రహిత రాజకీయ వ్యవస్థకు దారి తీస్తుందా లేక మరింత అస్తిరత వైపు వెళ్తుందా వేచి చూడాల్సిందే.