
BRS ADR Report: దేశంలోని ప్రాంతీయ పార్టీల ఆదాయంలో తెలుగు రాష్ట్రాల పార్టీలు సత్తా చాటాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ దేశంలోనే అత్యంత సంపన్న ప్రాంతీయ పార్టీగా మొదటి స్థానంలో నిలిచింది. ఈ జాబితాలోని తొలి ఐదు స్థానాల్లో మూడు తెలుగు పార్టీలు ఉండటం విశేషం. కానీ తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయినా విరాళాలు మాత్రం బాగా రాబట్టింది. ఏకంగా టాప్‌లో నిలిచింది. ఆ విశేషాలేంటో చూద్దాం.
రాజకీయ పార్టీలకు విరాళాలు కీలకమైనవి. చాలా పార్టీలు.. అధికారంలో ఉన్నప్పుడు బీభత్సంగా విరాళాలు రాబడతాయి. అవన్నీ పార్టీపై ప్రేమతో వచ్చేవి కావనీ.. బ్లాక్ మెయిల్ ద్వారా, కమిషన్ల రూపంలో వచ్చేవి కూడా ఉంటాయని విశ్లేషకులు చెబుతుంటారు. ఎందుకు వచ్చాయన్నది పక్కన పెడితే.. ఏ పార్టీకి ఎన్ని విరాళాలు వచ్చాయన్నది ఆసక్తికరం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలోని 40 ప్రాంతీయ రాజకీయ పార్టీలు కలిపి రూ.2,532.09 కోట్ల ఆదాయాన్ని పొందాయి. ఈ డబ్బులో 70 శాతం కంటే ఎక్కువ మనీ.. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చిందేనని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ తాజా రిపోర్టులో తెలిపింది. అయితే, ఈ మొత్తం ఆదాయంలో సింహభాగం కేవలం ఐదు పార్టీలదే కావడం గమనార్హం. తొలి ఐదు స్థానాల్లో ఉన్న బీఆర్‌ఎస్, టీఎంసీ, బీజేడీ, టీడీపీ, వైసీపీల వాటానే ఏకంగా 83.17 శాతంగా నమోదైంది. మిగిలిన పార్టీలన్నీ కలిపి కేవలం 17 శాతం లోపే ఆదాయాన్ని కలిగి ఉన్నాయని ఈ నివేదిక గణాంకాలు తెలిపాయి.
ఈ నిధులలో BRS అత్యధికంగా రూ.685.51 కోట్లు సేకరించింది. తద్వారా ఈ పార్టీ.. ప్రాంతీయ పార్టీల్లోనే అత్యధికంగా విరాళాలు పొందిన పార్టీగా టాప్‌లో నిలిచింది. ఐతే.. 2023లో డిసెంబర్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటికి ఆ ఆర్థిక సంవత్సరంలో 8 నెలలపాటూ.. బీఆర్ఎస్ అధికారంలో ఉంది. అందువల్ల ఆ టైంలో భారీగా విరాళాలు రాబట్టింది. ఆ తర్వాత 4 నెలలు అధికారంలో లేకపోయినా.. బీఆర్ఎస్ టాప్‌లోనే ఉందంటే.. ఆ 8 నెలలూ ఈ పార్టీకి ఏ స్థాయిలో విరాళాలు వచ్చాయో అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే.. ఆ మిగతా 4 నెలలు కూడా మరింత ఎక్కువ విరాళాలు వచ్చేవని అనుకోవచ్చు.
BRS నెక్ట్స్ ప్లేస్ లో తృణమూల్ కాంగ్రెస్ రూ.646.39 కోట్లు, బిజు జనతాదళ్ రూ.297.81 కోట్లు, తెలుగుదేశం పార్టీ రూ.285.07 కోట్లు, వైసీపీ రూ.191.04 కోట్లతో ఉన్నాయి. ఈ 5 పార్టీలు మొత్తం ఆదాయంలో 83.17 శాతం వాటాను కలిగి ఉన్నాయని నివేదిక తెలిపింది. ఇక్కడ మరో కీలక అంశం ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరం 2024 మార్చి 31తో ముగుస్తుంది. అప్పటికి ఏపీలో వైసీపీయే అధికారంలో ఉంది. కానీ.. ఆ పార్టీ కంటే.. అధికారంలో లేని టీడీపీకే ఎక్కువ విరాళాలు వచ్చాయి. అంటే.. వైసీపీ.. అధికారాన్ని కోల్పోవడమే కాదు.. విరాళాలను రాబట్టుకోవడంలో కూడా ఫెయిల్ అయ్యిందని అర్థమవుతోంది. ఇది ఆ పార్టీలో నైరాశ్యం, నిస్తేజాన్ని బయటపెడుతోంది.
2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, ప్రాంతీయ పార్టీల మొత్తం ఆదాయం 45.77 శాతం పెరిగింది. అప్పటి ఆదాయం రూ.1,736.85 కోట్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో టీఎంసీ అత్యధికంగా రూ.312.93 కోట్లు సేకరించగా, టీడీపీ, బీజేడీలు కూడా గణనీయమైన ఆదాయ పెరుగుదలను నమోదు చేశాయి. ఎలక్టోరల్ బాండ్లు రూ.1,796.02 కోట్లతో మొత్తం ఆదాయంలో 70.93 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఇవి కేవలం 10 పార్టీల ద్వారా సేకరించినవి. వీటిలో BRS, టీఎంసీ, డీఎంకే, బీజేడీ, టీడీపీ, వైసీపీ ఉన్నాయి. ఇతర విరాళాలు రూ.321.82 కోట్లకు తోడు.. వడ్డీ ఆదాయంగా రూ.274.90 కోట్లను పొందాయి.
ఏడీఆర్ నివేదిక ప్రకారం, 27 ప్రాంతీయ పార్టీలు తమ ఆదాయంలో కొంత భాగాన్ని ఖర్చు చేయలేదు. BRS దగ్గర రూ.430.60 కోట్లు, టీఎంసీ వద్ద రూ.414.92 కోట్లు, బీజేడీ దగ్గర రూ.253.79 కోట్లు ఇంకా ఉన్నాయి. అలాగే వైసీపీ, డీఎంకే, సమాజ్ వాదీ పార్టీ, జేడీయూ సహా 12 పార్టీలు.. తమకు వచ్చిన ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేశాయి. ముఖ్యంగా వైసీపీ.. మళ్లీ అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో 55 శాతం అధికంగా ఖర్చు చేసింది. ఫలితంగా అధికారమూ కోల్పోయింది, డబ్బూ కోల్పోయింది. ఐతే.. సరిగ్గా పరిపాలించి ఉంటే.. అసలు ఖర్చు పెట్టకపోయినా గెలిచేదని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. గోవా ఫార్వర్డ్ పార్టీకి ఆదాయమే లాదు.. కానీ ఎన్నికల్లో రూ.1.56 లక్షలు ఖర్చుపెట్టింది.
ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో 20 పార్టీల ఆడిట్ రిపోర్టులు లేవు. గడువు ముగిసిపోయి, మరో 313 రోజులు దాటిపోయాయి. అయినా రిపోర్టులు పెట్టకపోవడం అనేది ప్రజాస్వామ్య విరుద్ధం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్టీఐ సమాచారం ప్రకారం, 2023-24లో రూ.4,507.56 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను రాజకీయ పార్టీలు రెడీమ్ చేశాయి. వీటిలో 55.99 శాతం జాతీయ పార్టీలు, 39.84 శాతం ప్రాంతీయ పార్టీలు సేకరించాయి. మొత్తంగా చూస్తే.. ప్రాంతీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్లు బాగా కలిసొచ్చాయి. వీటి పేరు మీద బాగా సంపాదించాయి. BRS ADR Report.
ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు 2024 ఫిబ్రవరి 15న రద్దు చేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధం అని ప్రకటించింది. ఈ పథకం ఓటర్ల హక్కు సమాచారాన్ని (ఆర్టికల్ 19(1)(a)) ఉల్లంఘిస్తుందనీ, రాజకీయ నిధుల సమాచారంలో పారదర్శకతను కాలరాస్తుందని కోర్టు తీర్పు చెప్పింది. చీఫ్ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జిల రాజ్యాంగ బెంచ్ ఈ ఏకగ్రీవ తీర్పును వెలువరించింది. అంటే.. ఈ ప్రాంతీయ పార్టీలన్నీ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించాయని అనుకోవచ్చు. అక్రమంగా మనీ పొందాయని అనుకోవాల్సి ఉంటుంది.
Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q