
Telangana farmers: తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. 9 లక్షల 89వేల మంది రైతులకు ప్రయోజనం అందించే నిర్ణయం తీసుకుంది. 1970లలో అప్రకటిత భూమి లావాదేవీలను సక్రమం చేయాలనుకుంటోంది. అందుకోసం సాదాబైనామా అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ నిర్ణయంతో రైతులు సాగు చేసుకుంటున్న భూములకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం లభించినట్లైంది.
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ చాలా మంది రైతులు తమ భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. తరతరాల నుంచి ఆ భూములను సాగు చేసుకుంటూ వస్తున్నా వాటిపై పూర్తి హక్కు మాత్రం లభించడం లేదు. దీనికి కారణం వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడం. భూమి అమ్మిన వారి పేర్లు, కొన్నవాళ్ల పేర్లకు సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్స్ లేకపోవడంతో వారి భూమి రిజిస్ట్రేషన్ కావడం లేదు. అయితే ఏదో ఒక అగ్రిమెంట్ లేదా తెల్లకాగితంపై రాసుకున్నా వాటి ద్వారా భూమి రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు ఉంటుంది. అలాంటి ప్రక్రియనే సాదాబైనామా అంటారు.
భూమి రిజిస్ట్రేషన్ ప్రతి రైతు, భూస్వామికి అత్యంత అవసరం. ఒక భూమి చట్టబద్ధ రిజిస్ట్రేషన్ లేకపోతే ఆస్తిపై హక్కులు నిరూపించుకోవడం కష్టమవుతుంది. ఒకప్పుడు కొనుగోలు, విక్రయాలు కేవలం కాగితాల ఒప్పందాలు, సంతకాలతోనే జరిగేవి. వీటిని సాదాబైనామాలు అని పిలిచేవారు. కానీ ఈ పత్రాలకు చట్టబద్ధత తక్కువగా ఉండడంతో బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వడం లేదు. Telangana farmers.
అయితే 2020 నవంబర్ 10 వరకు ఆన్‌లైన్ ద్వారా సాదాబైనామా దరఖాస్తులను స్వీకరించారు. కానీ ఆర్.ఓ.ఆర్. చట్టంలో ఈ అంశాన్ని చేర్చకపోవడంతో హైకోర్టు స్టే విధించింది. దాదాపు 9లక్షల89వేల మంది రైతుల దరఖాస్తులు నిలిచిపోయాయి. ఇటీవల హైకోర్టు ఆ స్టే ఎత్తివేయడంతో, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిశీలనకు మార్గం సులువైంది. తాజాగా తెలంగాణ రెవెన్యూ శాఖ సాదాబైనామా క్రమబద్ధీకరణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని వల్ల సాదాబైనామాలకు దరఖాస్తు చేసుకున్న 9లక్షల 89వేల మంది లబ్ధిపొందనున్నారు. సుమారు 11 లక్షల ఎకరాల భూములకు 13-బీ ప్రొసీడింగ్స్ జారీ అయ్యే అవకాశం ఉంది. ఈ నిర్ణయం రైతులకు పలు విధాలుగా ఉపయోగపడనుంది. భూమికి సంబంధించిన చట్టబద్ధ పత్రాలు లభించడం వల్ల పట్టాదారు పాస్ పుస్తకాలు పొందుతారు. తద్వారా రైతులు రుణాలు పొందే అవకాశం ఉంటుంది. వారసత్వం, విక్రయం, భూమి రక్షణ వంటి అంశాల్లో ఇకపై సమస్యలుండవ్ భూమి రికార్డులు పూర్తిగా పారదర్శకంగా మారి, దళారుల జోక్యం తగ్గే అవకాశముంది.