పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే లపై వేటు పడేనా?

Congress Party MLA’s: తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ 64 మంది ఎమ్మెల్యే ల సంఖ్య బలం తో అధికారం లోకి వచ్చింది. తర్వాత వచ్చిన కంటోన్మెంట్ నియోజకవర్గం ఉప ఎన్నికలో గెలిచి 65 స్థానాలకి చేరింది.ఇది ఇలా ఉంటే హస్తం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు పార్టీ ఫిరాయించి హస్తం గూటికి చేరారు. ఇందులో మొదట పార్టీ లోకి వచ్చింది ఖైరతాబాద్ ఎమ్మెల్యే మాజీ మంత్రి దానం నాగేందర్.. పార్టీ లోకి రావడమే కాదు సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్లిమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ గుర్తుపై పోటీ సైతం చేశారు. అలాగే స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా కూతురు కడియం కావ్య వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు అయితే కడియం కావ్య అభ్యర్థిత్వని బలపరుస్తూ కడియం శ్రీహరి తన కూతురుకు మద్దతుగా సంతకం చేశారు దీనితో ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున ప్రచారం చేశారు

ఇక వీరితో పాటు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, శేర్ లింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ, భద్రాచలం ఎమ్యెల్యే తెల్లం వెంకట్ రావు బాన్సవాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, పఠాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య తో పాటు రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ లు హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే ల పై బీఆర్ఎస్ నేతలు హై కోర్టు, సుప్రీం కోర్టు ని ఆశ్రయించారు. న్యాయస్థానం సైతం పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోడానికి ఎంత సమయం కావాలని స్పీకర్ కార్యాలయాన్ని ప్రశ్నించింది,పిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై త్వరగా ఒక నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పీకర్ కు సూచించింది.

ఇది ఇలా ఉంటే పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసు జారీ చేశారు,ఎనిమిది మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ను కలిసి తాము కాంగ్రెస్ పార్టీలో చేరలేదు BRS పార్టీలోనే కొనసాగుతున్నాం,మా నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశామని సమాధానం ఇచ్చారు,దీనితో పాటు సీఎం ని కలిసిన సందర్భంలో మర్యాద పూర్వకంగా మాకు జాతీయ జెండా కండువా కప్పారని కాంగ్రెస్ కండువా కప్పలేదని స్పీకర్ కు ఆధారాలతో సహా వివరణ ఇచ్చారు,ఇదిలా ఉంటె షేర్ లింగం పల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ సంప్రదాయ బద్దంగా కొనసాగుతున్న PAC చైర్మన్ పదవి ప్రతి పక్ష నేతకు ఇస్తారు అదే తరహాలో నాకు PAC చైర్మన్ పదవి వచ్చిందని వివరణ ఇచ్చారు,ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణ తో కూడిన కాపీలను పిర్యాదు చేసిన brs నేతలకు అసెంబ్లీ కార్యదర్శి పంపించారు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగుస్తున్న నేపధ్యంలో మూడు రోజుల్లో అభిప్రాయం చెప్పాలని లేఖలో పేర్కొన్నారని తెలుస్తుంది

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి లు మాత్రం వివరణ ఇచ్చేందుకు తమకు కొంత సమయం కావాలని స్పీకర్ ని కోరారట, ఎందుకంటే దానం బీఆర్ఎస్ ఎమ్మెల్యే ల గా ఉంటూనే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గుర్తుపై సికింద్రాబాద్ నుండి పోటీ చేశారు,కడియం శ్రీహరి వరంగల్ లో తన కూతురుకు మద్దతు గా కాంగ్రెస్ కండువా తో ప్రచారం చేశారు,దీంతో వీళ్ళ ద్దరి పై అనర్హత వేటు పడడం ఖాయం అని ప్రచారం జరుగుతోంది,దీనితో పాటు స్పీకర్ ని ఈ ఇద్దరే గడువు కావాలని అడగటం తో అలాంటి సందేశహాలే రేకెత్తిస్తున్నాయి,ఇద్దరి విషయంలో కాంగ్రెస్ హై కమాండ్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి తర్జన భర్జన పడు తున్నట్లు గాంధీ భవన్ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.దానం నాగేందర్ రాజీనామా చేసేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. Congress Party MLA’s.

మరి brs ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శి పంపిన లేఖ కు మూడు రోజుల్లో సమాధానం చెప్తారా?ఎమ్మెల్యేలు దానం నాగేందర్,కడియం శ్రీహరి ఎప్పటివరకు స్పీకర్ నోటీసులకు వివరణ ఇస్తారు,స్పీకర్ తనకు ఉన్న విస్తృత అధికారంతో పిర్యాయించిన ఎమ్మెల్యేలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.