
Srikakulam Sand Mafia: ఒకరు అధికార పక్షం ..ఇంకొకరు ప్రతిపక్షం..బయట ప్రపంచానికి టిడిపి వైసిపి కౌంటర్లు ఇచ్చుకుంటారు..ఇక వాటాలు కోసం మాత్రం ఇరు పార్టీల నేతలు కుమ్మక్కు అయ్యారని బయట టాక్..సిక్కోలు జిల్లా ఇసుక మాఫియా లో టిడిపి వైసిపి నేతలకు మధ్య లోపయికారీ ఒప్పందం ఉందట..ఇంతకి ఈ శాండ్ బిజినెస్ లో పొలిటికల్ నేతలపై వస్తున్న కమీషన్ల దందా ఆరోపణలపై వాస్తవం ఎంత..లెట్స్ వాచ్ దిస్ స్టోరీ..
నేడు ఉన్న అధికారం.. రేపు ఉంటుందో లేదో తెలియదు..మాట చెల్లినపుడే అనుకున్నది చేసేసుకోవాలి.. ఈ పాలసీలో సిక్కోలు అధికార పార్టీ నేతలు ముందుకు సాగుతున్నారట.శ్రీకాకుళం జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు యదేచ్చగా కొనసాగుతున్నాయి..ఇసుక దందా కొంత మంది అధికార పార్టీ నాయకులు,వైసీపీ నాయకులు కలిసి చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి..వైసీపీ పాలనలో అక్రమాలు చేసినవారు ఇప్పుడు అధికార పార్టీలో కొంతమంది నేతలుతో కుమ్మక్కు అయి ఇసుక దందా చేస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
జిల్లాలోని నాగావళి వంశధార నదులు ఇసుక అక్రమార్కులకు వరంగా మారాయట..ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత ఇసుక విధానాన్ని ఆసరాగా తీసుకుని మైనింగ్ మాఫియా బరితెగిస్తున్నారు..శ్రీకాకుళం ఆమదాలవలస ఎచ్చెర్ల పాతపట్నం నియోజకవర్గాల్లోని పలు రీచుల్లో ఇసుకను భారీ ఎత్తున యంత్రాలతో తవ్వకాలు చేసి తరలిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..జిల్లా నుండి రోజుకి సగటున నూట యాభై వరకు లారీలు విశాఖపట్నం ఒడిశా ప్రాంతాలకు తరలిస్తున్నారట..
వంశధార నాగావళి నదుల్లో మాన్యువల్ పద్ధతిలో ఇసుకను తవ్వుకునేందుకు ప్రభుత్వం కొన్ని రీచ్ లకు అనుమతి ఇచ్చింది..కానీ చాలా వరకు రీచ్ లలో నిబంధనలు విరుద్ధంగా నదీ గర్భంలోకి యంత్రాలతో తవ్వకాలు చేపడుతున్నారు..ఇసుకను ట్రాక్టర్ల ద్వారా నదుల నుంచి తీసుకు వచ్చి సమీపంలోని తోటలు రహదారి మార్గంలో కుప్పలుగా పోసి రాత్రి పూట లారీలకు ఎత్తుతున్న పరిస్థితి..
ఇసుక తవ్వకాల్లో ఎమ్మెల్యే ల ప్రమేయం ఉండ కూడదని పలుమార్లు ముఖ్యమంత్రి స్పష్టం చేసినప్పటికీ అక్రమ వ్యాపారులకు శాసన సభ్యులు అండగా నిలుస్తున్నారన్న టాక్ కొన్ని చోట్ల వినిపిస్తోంది.ఇసుక అక్రమ వ్యాపారులు కూడా తాము సంపాదిస్తున్న ఆదాయంలో కొంత మేర ఆయా నియోజకవర్గాల్లోని ముఖ్యమైన నాయకులకు ముట్ట చెబుతున్నారట..అధికార పార్టీ కి చెందిన వారికే కాకుండా ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారికి కూడా ప్రతీ నెల ఎంతో కొంత మెత్తం ఇసుక అక్రమ వ్యాపారులు ఇస్తున్నారట..
అందువల్లనే ఇసుక అక్రమ రవాణా పై కొన్ని చోట్ల ప్రతిపక్ష పార్టీకి చెందిన వారు మౌనంగా ఉన్నారట..
నదీ పరీవాహక ప్రాంత గ్రామాల్లో ప్రతి రోజు వందల సంఖ్యలో వాహనాలు తిరుగుతుండడంతో రహదారులు పూర్తిగా పాడై పోతున్నాయని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.జేసీబీ లతో ఇసుకను నదీ గర్భాల్లోకి వెళ్లి తవ్వకాలు జరపడంతో పలు చోట్ల వంతెనలు దెబ్బ తినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Srikakulam Sand Mafia.
అధికార పార్టీ ఇసుక దందా పై ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది.ఈ వ్యవహారంలో అధికార ప్రతిపక్షాలకు భారీగా ముడుపులు అందుతున్నాయనే టాక్ వినిపిస్తోంది..ఇంత జరుగుతున్న గనుల శాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం కొసమెరుపు..