
Indonesia Vishnu Statue: సాధారణంగా మన దేశంలో దేవాలయాలు చాలా ఉన్నాయి. ఇతర దేశాలలో సైతం మనం పూజించే దేవుళ్ల ఆలయాలు ఉన్నాయి. అయితే విదేశాల్లో కూడా మన భగవంతుడిని ఆరాధిస్తూన్నారు. ఆ దేశంలో దాదాపు అందరూ ముస్లింలే. అలాంటి చోట శ్రీమహావిష్ణువు అతి పెద్ద విగ్రహం ఉంది. అందుకు కారణమేంటి? ఆ దేశంలో ఏం జరిగింది? అసలు ఆ విగ్రహం ఎక్కడుందో ఎవరు నిర్మించారో తెలుసు కోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ..
ఇండోనేషియా… ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశం. బాలిలోని గరుడ విష్ణు కెంచన (GWK) సాంస్కృతిక పార్కులో శ్రీమహా విష్ణువు అతిపెద్ద విగ్రహాన్ని నిర్మించింది. ఈ 121 మీటర్ల ఎత్తైన విగ్రహం… హిందూ దేవతల విగ్రహాలలో… ప్రపంచంలోనే అతిపెద్దది. దీనిని 2018లో ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని చూస్తే… విష్ణువు తన వాహనమైన గరుడపై ఆసీనుడై ఉంటారు. ఇది.. హిందూ పురాణాలలో గరుడుడు తన తల్లి బానిసత్వం నుంచి విముక్తి కోసం, అమృతం కోసం శోధించిన కథను సూచిస్తుంది. ఈ విగ్రహం ఇండోనేషియా సాంస్కృతిక వైవిధ్యానికీ, బలమైన చారిత్రక వారసత్వానికీ చిహ్నంగా నిలుస్తోంది.
హిందూ ధర్మంలో విష్ణువు.. సమస్త విశ్వానికీ రక్షకుడు. సమృద్ధి, వైభవాలకు ప్రతీక. బ్రహ్మ, శివుడితో కలిసి త్రిమూర్తులలో ఒకరైన విష్ణువు, భూమికి రక్షకుడిగా చెబుతారు. భారతదేశంలో విష్ణువు ఆరాధన… వివిధ రూపాలలో విస్తృతంగా ఉన్నప్పటికీ, ప్రపంచంలో అతిపెద్ద విష్ణు విగ్రహం ఇండోనేషియాలో ఉండటం ఆశ్చర్యకరం. ఈ విగ్రహం, బాలిలోని ఉంగసాన్‌లో 60 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న GWK సాంస్కృతిక పార్కులో ఉంది. ఇది పర్యాటకులు, భక్తులు, సాంస్కృతిక ఔత్సాహికులను ఆకర్షిస్తోంది. బాలీ ద్వీపంలోని ఉంగాసన్ ప్రాంతంలో ఉన్న ఈ విగ్రహం నిర్మాణం వెనుక ఒక కల ఉంది. 1979లో ఇండోనేషియాలో నివసించే శిల్ప బప్పా సుమన్ నువర్తా ఒక భారీ విగ్రహాన్ని తయారు చేయాలనుకున్నాడు. ప్రపంచంలో ఎక్కడా లేని పెద్ద విగ్రహాన్ని తయారు చేయాలనుకున్నాడు. సుధీర్ఘ కాలం ప్రణాళిక చేసి.. అందుకు కాస్త డబ్బు పొగేసి 1994లో విగ్రహ నిర్మాణం ప్రారంభించారు.
ఈ విగ్రహం నిర్మాణం 1980లలో ప్రారంభమైంది. ఇండోనేషియా శిల్పి న్యోమన్ నుర్తా దీనిని రూపొందించారు. ఈ ప్రాజెక్టు ఇండోనేషియా.. సాంస్కృతిక, ఆధ్యాత్మిక సారాంశాన్ని ప్రతిబింబించే జాతీయ చిహ్నంగా రూపొందింది. అయితే 1997లో ఆసియా ఆర్థిక సంక్షోభం కారణంగా నిర్మాణం ఆగిపోయింది. మొత్తంగా నిర్మాణం 28 సంవత్సరాలు పట్టింది. ఈ విగ్రహం 3,000 టన్నుల రాగి, ఇత్తడితో నిర్మించినది. బాలిలో ఉష్ణమండల వాతావరణం, భూకంపాలను తట్టుకునేలా రూపొందించారు. విగ్రహా నిర్మాణానికి అక్కడి సమీప గ్రామస్తులు సైతం నిరసన తెలిపారు. అయితే పర్యాటకం, ఆదాయం గురించి వారికి వివరించిన తర్వాత వారు నిరసన ముగించారు. దీంతో విగ్రహ తయారీ మళ్లీ ప్రారంభమైంది. 2018లో పూర్తిగా విగ్రహం సిద్దమైంది. అప్పటి ఇండోనేషియా ప్రెసిడెంట్ మహా విష్ణువు విగ్రహాన్ని సందర్శించారు.
ఈ విగ్రహం హిందూ పురాణాలలో… గరుడుడు… అమృతం కోసం, తన తల్లిని విముక్తి చేయడానికీ, విష్ణువుకు సేవ చేయడానికి అంగీకరించిన కథను చిత్రీకరిస్తుంది. గరుడుడు ఇండోనేషియా జాతీయ చిహ్నంగా కూడా ఉన్నాడు. ఇది ‘వైవిధ్యంలో ఐక్యత’ అనే దేశ గీతాన్ని సూచిస్తోంది. ఈ విగ్రహం బాలినీస్ హిందూ సంస్కృతినీ, ఇండోనేషియా బహుసాంస్కృతిక వారసత్వాన్ని చాటుతోంది. 2,000 సంవత్సరాల కిందట భారతదేశం, ఆగ్నేయాసియా మధ్య సముద్ర వాణిజ్యం ద్వారా బాలిలో హిందూయిజం వ్యాపించింది. బాలి, హిందూ మెజారిటీ ఉన్న ఏకైక ఇండోనేషియన్ ద్వీపం. ఈ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతోంది. GWK పార్కు… సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు, కళా ప్రదర్శనలు, ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఇది ఇండోనేషియా బహుళ సాంస్కృతిక గుర్తింపును ప్రోత్సహిస్తోంది.
నిర్మాణ సమయంలో, ఈ విగ్రహం ఆధ్యాత్మిక సమతుల్యతను దెబ్బతీస్తుందనీ, లాభాలు బాలికి కాకుండా జకార్తాకు వెళతాయని స్థానిక బాలినీస్ వాసులు వ్యతిరేకించారు. అయితే, ఈ విగ్రహం పర్యాటక ఆకర్షణగా, సాంస్కృతిక చిహ్నంగా మారుతుందని వివరించిన తర్వాత వారు అంగీకరించారు. ఈ విగ్రహం ఇప్పుడు బాలిని సందర్శించే ప్రపంచవ్యాప్త పర్యాటకులకు ఒక ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ విగ్రహం ఇండోనేషియా బహుళ సాంస్కృతికతను, వైవిధ్యాన్ని గౌరవించే స్ఫూర్తిని ప్రతిబింబిస్తోంది. ఇండోనేషియా జాతీయ విమానయాన సంస్థ ‘గరుడ’ పేరు, గతంలో దేశ రూపాయిలపై గణేషుని చిత్రం వంటి హిందూ ప్రభావాలు దీనిని సూచిస్తాయి. ఈ విగ్రహం ఇండోనేషియా బహు సాంస్కృతిక గుర్తింపును చాటుతూ.. హిందూ వారసత్వాన్ని కొనసాగిస్తోంది. Indonesia Vishnu Statue.
2025 ఆగస్టు 13-17 వరకు, GWK పార్కు… ఇండోనేషియా స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పెస్టా రక్యత్ ఉత్సవాన్ని నిర్వహించింది. ఇందులో సంగీత కచేరీలు, సాంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ విగ్రహం, దాని సాంస్కృతిక పార్కు ఇండోనేషియా ఆధ్యాత్మిక, కళాత్మక వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ఒక శక్తివంతమైన చిహ్నంగా నిలుస్తోంది. విష్ణు మూర్తి విగ్రహాన్ని నిర్మించిన బప్పా నుమాన్ భారతదేశంలో కూడా గౌరవించబడ్డారు. మన దేశ రాష్ట్రపతి రామ్ నాథ్ గోవింద్ దేశ అత్యున్నత పౌర సన్మానాలలో ఒకటైన పద్మ శ్రీతో సత్కరించారు. ఈ విగ్రహం ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఇక్కడికి ఇతర మతాల వారు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు.